దివికేగిన Bajaj Auto మాజీ చైర్మన్ 'రాహుల్ బజాజ్': సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

భారతీయ మార్కెట్లో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఉన్నతమైన శిఖరంగా నిలబడిన బజాజ్ ఆటో కంపెనీ యొక్క మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ గురించి అందరికి తెలుసు. ఈ రోజు బజాజ్ కంపెనీ ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారకుడు మరియు భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన 'రాహుల్ బజాజ్' ఈ రోజు కన్నుమూశారు.

దివికేగిన Bajaj Auto మాజీ చైర్మన్ 'రాహుల్ బజాజ్': సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

83 సంవత్సరాల రాహుల్ బజాజ్‌కు న్యుమోనియా మరియు గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు తెలిసింది. నెల రోజుల క్రితం రూబీ హాల్ క్లినిక్‌లో చేరిన 'రాహుల్ బజాజ్‌' ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రాహుల్ బజాజ్‌ మరణంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

దివికేగిన Bajaj Auto మాజీ చైర్మన్ 'రాహుల్ బజాజ్': సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

జమ్నాలాల్‌ బజాజ్ మనవడైన 'రాహుల్‌ బజాజ్‌' 1938 జూన్ 10 న జన్మించాడు. ముంబైలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి, ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో పట్టా పొందిన రాహుల్ బజాజ్ 1964లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీయే పూర్తి చేశారు.

దివికేగిన Bajaj Auto మాజీ చైర్మన్ 'రాహుల్ బజాజ్': సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

రాహుల్ బజాజ్ తండ్రి బజాజ్ ఆటోను 1940లో ప్రారంభించిన మొదటిలో విదేశాల నుంచి విడి భాగాలను తెచ్చి అమ్మిన తరువాత సొంతంగానే ద్విచక్రవాహనాలను తయారు చేసేవారు. ఇది కంపెనీకి చాలా కష్టమయ్యేది. అయితే రాహుల్ బజాజ్ 1965 లో కంపెనీ బాధ్యతలు చేపట్టిన అతితక్కువ కాలంలోనే కంపెనీపై పట్టు సాధించి 1968 లో కంపెనీకి ఛైర్మన్‌ అయ్యారు.

దివికేగిన Bajaj Auto మాజీ చైర్మన్ 'రాహుల్ బజాజ్': సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

వేల కోట్ల ఆస్తికి అధిపతి అయినా రాహుల్ బజాజ్ చాలా సింపుల్ గా ఉంటారు, ఇందులో భాగంగానే పూణేలోని కంపెనీ ప్లాంట్‌లోనే ఇల్లు కట్టుకుని అక్కడే నివసించేవారు. గ్రామాల్లో నీటి సంరక్షణ, గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్ల లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే కాకుండా.. ఔరంగాబాద్‌లో ఆసుపత్రిని నెలకొల్పి పేదలకు వైద్యసేవలను సైతం అందిస్తున్నారు. రాహుల్ బజాజ్‌కు 2001లో పద్మభూషణ్ అవార్డు అందుకోవడమే కాకుండా, రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఇంతటి గొప్ప మహనీయుడు ఈ రోజు దివికేగడం చాలా బాధకరం.

దివికేగిన Bajaj Auto మాజీ చైర్మన్ 'రాహుల్ బజాజ్': సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

'రాహుల్ బజాజ్' మరణానికి ఎంతోమంది నివాళులర్పించారు. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రాహుల్ బజాజ్‌కు నివాళులర్పిస్తూ, "విజయవంతమైన వ్యవస్థాపకుడు, పరోపకారి మరియు బజాజ్ మాజీ అధ్యక్షుడు రాహుల్ బజాజ్‌కు నా హృదయపూర్వక నివాళి. పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాహుల్ బజాజ్ తో నాకు వ్యక్తిగత సంబంధం ఉంది" అని పేర్కొన్నారు.

దివికేగిన Bajaj Auto మాజీ చైర్మన్ 'రాహుల్ బజాజ్': సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్' మాట్లాడుతూ.. ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ మరణించడం చాలా బాధాకరమైన వార్త. ఆర్థిక రంగంలో దేశ పురోగతికి ఆయన చాలా దోహదపడ్డారు. ఆ మహనీయుడికి నా హృదయపూర్వక నివాళులు. వీరితో పాటు కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే మరియు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాహుల్ బజాజ్ కి నివాళులర్పించారు.

ఏది ఏమైనా రాహుల్ బజాజ్ యొక్క మరణం దేశానికీ తీరని లోటు, ఈయన మరణానికి ఇప్పుడు యావత్ భారతదేశం నివాళులర్పిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 12, 2022, 19:44 [IST]
English summary
Bajaj auto former chairman rahul bajaj passes at 83 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+