స్టీరింగ్ వీల్ కలిగిన మోడిఫైడ్ స్కూటర్: ఇది సృజనాత్మకత అవునో, కాదో.. మీరే చెప్పాలి
గతంలో చాలా సందర్భాల్లో మోడిఫైడ్ బైకులు మరియు మోడిఫైడ్ కార్లను గురించి తెలుసుకున్నాం. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక మోడిఫైడ్ వెహికల్ అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తోంది, ఈ మోడిఫైడ్ వెహికల్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

నివేదికల ప్రకారం ఈ సంఘటన పంజాబ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి గతంలో కూడా పంజాబ్‌లో చాలా మోడిఫైడ్ వెహికల్స్ పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన సంఘటనలో ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ హ్యాండిల్ చేసే ఒక వ్యక్తి ఒక పాత బజాజ్ చేతక్ స్కూటర్ ని మోడిఫైడ్ చేసాడు. ఇది చూడటానికి సాధారణ మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే, ఈ స్కూటర్ యొక్క హ్యాండిల్ ప్రాంతంలో స్టీరింగ్ వీల్ ఉంది. అంతే కాకుండా వెనుక ఉండాల్సిన ఎగ్జాస్ట్ కూడా ముందు భాగంలోనే అమర్చబడి ఉంది. నిజానికి బజాజ్ చేతక్ స్కూటర్ అంత పెద్ద ఎగ్జాస్ట్ ఉండదు. ఇది మోడిఫైడ్ చేయబడిన స్కూటర్ కావున ఇందులో మోడిఫైడ్ చేసిన వ్యక్తి స్వయంగా అమర్చాడు. కావున ఇందులో పెద్ద ఎగ్జాస్ట్ కనిపిస్తుంది.

ఈ వీడియో malkitbaj_wa అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయబడింది. ఇప్పటికీ ఈ వీడియోకి దాదాపు 2 లక్షల కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా ఈ వీడియోలో ఈ మోడిఫైడ్ చేయబడిన స్కూటర్ చూసిన చాలామంది వీక్షకులు కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొంత మంది ఈ వీడియో చూసి వ్యంగంగా కామెంట్స్ చేస్తుంటే, మరి కొందరు మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియోలో కనిపించే ఈ వెహికల్ చట్టబద్దం కాదు.

ఈ వీడియోలో మాడిఫైడ్ చేసిన వ్యక్తి ఈ స్కూటర్ రైడింగ్ చేయడం కూడా చూడవచ్చు. ఇందులో ఆ వ్యక్తి స్కూటర్ స్టార్ట్ చేసిన స్టీరింగ్ వీల్ సాయంతో హ్యాండిల్ చేస్తున్నాడు. అంతే కాకూండా.. ఇందులో అమర్చబడిన ఎగ్జాస్ట్ నుంచి ఎక్కువ పొగ రావడం కూడా చూడవచ్చు. ఏది ఏమైనా ఇది ప్రజా రహదారులలో తిరగడానికి పూర్తిగా చట్టవిరుద్ధం. కావున ప్రవేట్ ప్రాంతాల్లో మాత్రం అభిరుచి కలిగిన వారు రైడ్ చేసుకోవచ్చు.

ఈ వీడియోలో మనకు కనిపించే స్కూటర్ హ్యాండిల్ చోట స్టీరింగ్ వీల్ అమర్చబడి ఉండటమే కాదు, దాని ముందు భాగంలో ఉన్న వీల్ కూడా ఆ స్కూటర్ డి కాదు. అది కార్ వీల్ కావడం గమనార్హం. స్కూటర్ కి కార్ వీల్ అమర్చడం వల్ల దానిని రైడింగ్ చేయడం కొంత కష్టం అవుతుంది. ఇది కార్ వీల్ కావడం వల్ల దానికి అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో అవన్నీ కూడా మాన్కు స్పష్టంగా కనిపిస్తాయి.
భారతదేశంలో మోటార్ వాహన చట్టాలు చాలా కఠినంగా అమలు చేస్తున్నారు, కావున ఏ వాహనమైన తప్పకుండా మోటార్ వాహనం చట్టం పరిధిలోనే ఉండాలి మరియు మోటార్ వాహనం చట్టానికి లోబడి ఉండాలి. అలా కాకుండా మోడైఫైడ్ చేయబడితే అవి ప్రజా రహదారుల్లో ప్రయాణించకూడదు. ఒక వేళా అవి ప్రజా రహాదారుల్లో ప్రయాణిస్తే తప్పకుండా అవి సీజ్ చేయబడతాయి, మరియు భారీ జరిమానా కూడా విధించబడుతుంది.

గతంలో కూడా చాలా విచిత్రంగా మోడిఫైడ్ చేయబడిన వాహనాలను ఎన్నో చూసాము, కానీ స్టీరింగ్ వీల్ కలిగిన స్కూటర్ చూడటం బహుశా ఇదే మొదటి సారి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి. మీకు కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి.


Click it and Unblock the Notifications








