గిన్నిస్ వరల్డ్ రికార్డులో బజాజ్ డిస్కవర్ 125

By Anil Kumar

ప్రపంచపు అత్యంత పొడవైన మోటార్ సైకిల్‌గా బజాజ్ డిస్కర్ 125 గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. సాధారణ బైకుతో ఈ రికార్డ్ అసాధ్యం. అయితే, బజాజ్ డిస్కవర్ 125 మోటార్ సైకిల్‌కు పలు మోడిఫికేశషన్స్ నిర్వహించిన అనంతరం దీని కొలతల్లో మార్పులు జరిపి ప్రపంచ అత్యంత పొడవైన బైకుగా రికార్డును సృష్టించారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డులో బజాజ్ డిస్కవర్ 125

గుజరాత్‌కు చెందిన భరత్ సిన్హ పర్మార్ తన బజాజ్ డిస్కవర్ 125 మోటార్ సైకిల్‌కు పలు రకాల మోడిఫికేషన్స్ నిర్వహించి అసాధాన్ని సుసాధ్యం చేశాడు. బైకును సగానికి తొలిగించి, వెనుక వైపున పొడవాటి మెటల్ ఫ్రేమ్‌ వెల్డింగ్ చేశాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డులో బజాజ్ డిస్కవర్ 125

బైకు వెనుక వైపున పొడగించిన మెటల్ ఫ్రేమ్‌ చివర్లో రియర్ వీల్ జోడించాడు. అంతే కాకుండా, ఇంజన్ పవర్ ఆ రియర్ వీల్‌ను చేరేందుకు ఫ్రేమ్ పొడవునా చైన్ అందివ్వడం జరిగింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డులో బజాజ్ డిస్కవర్ 125

అత్యంత పొడవైన మోటార్ సైకిల్‌గా రికార్డును నెలకొల్పేందుకు ఎలాంటి సహాయం మరియు ఇబ్బందులు ఎదుర్కోకుండా 100మీటర్ల పాటు బైకును నడపాల్సి ఉంటుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిభందనలకు అనుగుణంగానే భరత్ సిన్హ పర్మార్ బైకును 100మీటర్ల మేర విజయవంతంగా నడిపాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డులో బజాజ్ డిస్కవర్ 125

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో బజాజ్ డిస్కవర్ 125 బైకు 26,289ఎమ్ఎమ్ లేదా 86.25 అడుగులు పొడవు ఉన్నట్లు గుర్తించారు. 3,962ఎమ్ఎమ్ లేదా 13 అడుగుల పొడవుతో గతంలో నమోదైన రికార్డును ఇది బ్రేక్ చేసింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డులో బజాజ్ డిస్కవర్ 125

నిజానికి ఇది ఊహించ సాధ్యం కాని విన్యాసం అని చెప్పవచ్చు, కేవలం 2,035ఎమ్ఎమ్ లేదా 6.6 అడుగులు పొడవు మాత్రమే ఉన్న బైకును 86.25 అడుగులకు పెంచి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కించాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డులో బజాజ్ డిస్కవర్ 125

ఎంతో శ్రమ మరియు ఖర్చు పెట్టి మోడిఫై చేసిన ఈ బైకు గిన్నిస్ రికార్డు సాధించిందే గానీ, దీనిని ఇండియన్ రోడ్ల మీద అస్సలు ఉపయోగించలేడు. మోడిఫైడ్ వాహనాలను ఇండియన్ రోడ్ల మీద వాడటం చట్ట పరంగా నేరం అయితే, అత్యంత ఇరుకైన మన ఇండియన్ రోడ్ల మీద హ్యాండిల్ చేయలేకపోవడం మరొక కారణంగా చెప్పుకోవచ్చు.

గిన్నిస్ వరల్డ్ రికార్డులో బజాజ్ డిస్కవర్ 125

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అత్యంత సౌకర్యవంతమైన మరియు అత్యుత్తమ మైలేజ్ ఇచ్చే కమ్యూటర్ మోటార్ సైకిల్‌గా బజాజ్ డిస్కవర్ 125 అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇలాంటి మోటార్ సైకిల్‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం నిజంగా గొప్పే...

Most Read Articles

English summary
Read In Telugu: This Bajaj Discover Is The Longest Motorcycle In The World
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X