పెట్రోల్‌ బంక్‌లో ప్రమాదం.. CNG ఫిల్లింగ్‌ సమయంలో అలసత్వం, ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్‌!

బజాజ్ ఫ్రీడమ్‌ 125 సీఎన్‌జీ బైక్‌ మార్కెట్‌లో ఇప్పుడు ఇప్పుడే క్రేజ్‌ని పెంచుకుంటోంది. ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఇది దేశంలోనే తొలి బై ఫ్యూయల్‌ టూవీలర్‌ కావడం విశేషం. దీనిని పెట్రోల్‌, సీఎన్‌జీ మోడ్‌లో నడపవచ్చు. ఇది ఎట్టకేలకు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. నెల రోజుల క్రితమే తెలుగు రాష్ట్రాల్లో వీటి డెలివరీలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ బైక్‌పై ప్రజల్లో ఇంకా సేఫ్టీ ప్రశ్నలు నెలకొంటున్నాయి. తాజాగా ఈ బైక్‌ ఫ్యూయల్‌ రీఫిల్లింగ్‌ సమంయోల జరిగిన ఓ సంఘటన ఇంటర్‌నెట్‌లో వైరల్ అయింది.

బజాజ్ ఫ్రీడమ్ 125లో సీఎన్‌జీ ఫిల్‌ చేసేక్రమంలో ఫ్యూయల్ స్టేషన్ ఉద్యోగి గాయపడ్డాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఫ్రీడమ్ బైక్‌తో ఓ వ్యక్తి సీఎన్‌జీ ఫిల్‌ చేసుకోవడానికి వచ్చాడు. ఆ సమయంలో ఫిల్లింగ్ స్టేషన్‌లో సీఎన్‌జీ నింపేదుకు నాజిల్‌ని (మూత)ను తెరిచాడు. ఫ్యూయల్‌ పైప్‌ని ఇన్‌సర్ట్ చేసే క్రమంలో మరోసారి మూత పడిపోయింది.

Bajaj Freedom 125 CNG Refilling Accident

ఆ తర్వాత ఉద్యోగి మరోసారి మూత తెరిచి సీఎన్‌జీ నాజిల్‌ లోపలికి ఇన్‌సర్ట్‌ చేసి.. రీడింగ్‌ మిషన్‌లో బటన్ నొక్కగానే షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో పక్కన నిల్చున్న బైక్ యజమాని, ఉద్యోగి బైక్‌కి దూరంగా పడిపోయారు. సీఎన్‌జీ ఫిల్లింగ్ సమయంలో నాజిల్‌లో సరిగ్గా పైప్‌ని పెట్టకపోవడంతో అది బయటకు వచ్చి ఉద్యోగిని పక్కకు విసిరేసింది. ఉద్యోగి తల నేలపై ఢీకొంటుంది.

ఈ ఘటనతో అక్కడి వారు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. నేలపై పడిపోయిన ఉద్యోగి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కూడా మనం వీడియోలో చూడవచ్చు. సీఎన్‌జీ పైపుని బైక్‌ నాజిల్‌లో సరిగ్గా ఇన్‌సర్ట్‌ చేయకపోవడం వల్ల పైప్‌ ప్రెజర్‌ దాటికి కంట్రోల్‌ తప్పి ఈ ప్రమాదం జరిగింది. అక్కడే పనిచేస్తున్న సహోద్యోగులు, బైక్ యజమాని, ఆటో డ్రైవర్లు సహా అందరూ ప్రాణభయంతో బయకకు పరుగులు తీశారు.

Bajaj Freedom 125 CNG Motorcycle Filling Accident Video

కాసేపటికే వారంతా తిరిగి వచ్చి నేలపై పడి ఉన్న ఉద్యోగిని సపర్యలు చేశారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఇలా ఎందుకు జరిగిందనే అంశంపై క్లారిటీ లేదు. ఇందులో బజాజ్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఘటన ప్రకారం ఫిల్లింగ్‌ స్టేషన్‌లో ఉద్యోగికి సీఎన్‌జీ ఫిల్లింగ్‌ అవగాహన లేదని తెలుస్తోంది. బైక్ ఫిల్లింగ్ ట్యాంక్‌ నాజిల్ సరిగా బిగించకపోవడమే ప్రమాదానికి కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే బజాజ్‌ ఈ బైక్‌ని 11 రకాల క్రాష్‌ టెస్ట్‌లను నిర్వహించింది. ఈ అన్ని టెస్టుల్లోనూ ఫ్రీడమ్ 125 సీసీ బైక్‌ అదరగొట్టింది. రీఫిల్లింగ్‌కి సంబంధించిన వీడియోలను సైతం బజాజ్ ఆటో విడుదల చేసింది. అందువల్ల సేఫ్టీలో ఎటువంటి భయం అవసరం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలతో కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే అన్ని రకాల టెస్ట్‌లు పకడ్బందీగా నిర్వహించారు.

ఈ బైక్‌ని 3 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఇది డిస్క్‌, డిస్క్‌ ఎల్‌సీడీ, డిస్క్‌ ఎల్‌ఈడీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ బైక్‌ ధరలు రూ. 95,000 నుంచే ప్రారంభం అవుతుంది. ఈ బైక్‌లోని పెట్రోల్‌ ట్యాంక్, రెండు కిలోల సీఎన్‌జీ ట్యాంక్స్‌ని ఫుల్‌ ట్యాంక్‌ చేయడం ద్వారా 330 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ బైక్‌ వల్ల ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, November 16, 2024, 10:11 [IST]
English summary
Bajaj freedom 125 cng filling accident video gone viral
Read more on: #auto news #bajaj auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+