బైక్‌కి ట్రాక్టర్ టైర్ అమర్చిన యువకుడు.. అతని టాలెంట్‌కి నెటిజన్లు ఫిదా, వైరల్ అవుతున్న వీడియో
బజాజ్ పల్సర్ బైక్‌కి ట్రాక్టర్ టైర్‌ను అమర్చాడు ఓ ఇన్నోవేటివ్.. అంతే కాకుండా బైక్ ఎక్కి దర్జాగా తోలుతున్నాడు. అలా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా.. స్టోరీ ఇక్కడ చదివేయండి మరి..
సోషల్ మీడియా పుణ్యమా అని రోజూ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఔత్సాహికులు తమ టాలెంట్‌ను దాచేయకుండా వాటిని నలుగురికీ తెలియజేయడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. నెటిజన్ల ప్రశంసలతో పాటు వాటితో సక్సెస్‌ను కూడా అందుకుంటున్నారు. ఇటీవల ఓ యువకుడు మామూలు కారును రోల్స్ రాయిస్ కారులా మార్చిన సంగతి తెలిసిందే.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, X(గతంలో ట్విట్టర్), యూట్యూబ్ వేదికగా సామాన్యులు చేసిన ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. వీటిని ఇలా కూడా మార్చవచ్చా.. అని ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతుంటారు. ముఖ్యంగా ఆటో మొబైల్ రంగంలో ఇలాంటి ఆవిష్కరణలు కోకొల్లలు..
ఓ జంట తమ కారు క్యాబిన్ లోపల ఓ చిన్న బెడ్ రూమ్‌నే ఏర్పాటు చేసి ఔరా అనిపించారు. ఇంకొకరు ట్రయాంగిల్ షేప్‌లో వీల్స్‌ను తయారు చేసి వాటిని సైకిల్‌కు రూపొందించారు. టైర్లు ఎప్పుడూ వృత్తాకారంలోనే ఉండాలని ఎందుకు భావించాడో ఏమో ఇలాంటి పనికి పూనుకుని విజయం సాధించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఇలాంటివి ఎన్నో కనిపిస్తుంటాయి.

సాధారణంగా వాహనం సైజ్, బరువును బట్టి తయారీదారులు వాహనాలను టైర్ల సైజు, షేప్‌ను నిర్ణయించి వాటికి అమరుస్తారు. వాహనం రోడ్డుపై రయ్ మంటూ దూసుకెళ్లడంలో టైర్లదే ప్రధాన పాత్ర. కానీ ఇక్కడ ఓ యువకుడు అలా కాదు.. తన బైక్ కంటే ఎక్కువ ఎత్తులో ఉండే టైర్‌ను బైక్‌కి అమర్చి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
బజాజ్ పల్సర్ బైక్‌కి ట్రాక్టర్ టైర్‌ను అమర్చడానికి ముందు యువకుడు బైక్‌లో కొన్ని మార్పులు చేశారు. స్టాక్ టైర్ తీసివేసి.. ట్రాక్టర్ యొక్క టైర్ బైక్‌పై సరిపోయేలా చేయడానికి సవరించిన ఫోర్క్‌ను జత చేశారు. వీడియోను చూసినట్లయితే యువకుడు డ్యామేజ్ అయిన రోడ్డుపై బైక్ నడుపుతున్నట్లుగా ఉంది.

ట్రాక్టర్ టైర్ అమర్చడం ద్వారా రైడర్ బైక్‌పై కంట్రోల్‌ను కలిగినట్లుగా ఉంది. ఎలాంటి రోడ్లపై అయినా సరే ఈ సరికొత్త బైక్ స్కిడ్ అవ్వకుండా వెళ్లేలా ఉంది. @mrhifixyz అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సదరు యువకుడు ఈ వీడియో పోస్ట్ చేశాడు. యువకుడు తన బజాజ్ పల్సర్ బైక్ ముందు చక్రానికి ట్రాక్టర్ వీల్‌ను( Tractor Wheel ) అమర్చి.. ఆపై దానిని సులభంగా రోడ్డుపై నడుపుతూ వెళ్తున్నాడు.
బయట ఇలాంటి ఇన్నోవేటివ్ బైక్స్ కనిపించడం చాలా అరుదు. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ట్రాక్టర్ టైరును బైక్ ముందు చక్రానికి అంత సులభంగా ఎలా అమర్చగలిగారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మీ తెలివికి హ్యాట్సాఫ్ అంటూ అభినందించారు. ట్రాక్టర్ కమ్ బైక్ అంటూ మరికొందరు కామెంట్ చేశారు. ఈ వీడియో చాలా త్వరగా వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ దాదాపు 3 లక్షల వ్యూస్‌ను సంపాదించుకుంది.

ఏదేమైనా ఇది ఇన్నోవేటివ్ ఐడియా అయినా ఇలా ట్రాక్టర్ వీల్ సాయంతో బైక్‌ను వేగంగా నడపడం కష్టమంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి టైర్లతో రైడ్ కష్టమని.. ఈ తరహా స్టంట్స్‌కు పాల్పడకపోవడమే బెటర్ అని మరికొందరు సలహా ఇస్తున్నారు. కానీ ఇలాంటి క్రేజీ ఐడియా విషయంలో మనం ఈ యువకుడిని మెచ్చుకోవాల్సిందే.. మీరు కూడా ఈ వీడియో చూసేయండి.


Click it and Unblock the Notifications








