హైవేలో బైక్‌పై స్టంట్స్ చేస్తూ ఫోజులు.. జస్ట్ మిస్.. లేదంటే!!
పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా బైక్ రైడర్లు రద్దీగా ఉన్న రోడ్లపై సైతం బైక్‌ను వంకలు తిప్పుతూ నిర్లక్ష్యంగా వేగంగా డ్రైవ్ చేస్తుంటారు. రోడ్డుపై కార్ల మధ్య చిన్నచిన్న గ్యాప్‌లను కూడా వదలకుండా దూరుతుంటారు. మరికొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం రోడ్లపై స్టంట్లు చేస్తుంటారు.
వీరిలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ రోడ్లపై విన్యాసాలకు పాల్పడటం ద్వారా వారికే కాదు ఇతర వాహనదారులకు ఆందోళన కలిగిస్తున్నారు. చాలా సందర్భాల్లో ద్విచక్ర వాహనదారుల నిర్లక్ష్య వైఖరి వల్లే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల ఓ బైకర్ రోడ్డుపై పోజు కొడుతూ బొక్క బోర్లా పడిన ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బజాజ్ NS200 బైక్ నడుపుతున్న వ‌్యక్తి తన హీరోయిజాన్ని ప్రదరిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో, వ్లాగర్ తన హెల్మెట్‌కు అమర్చిన యాక్షన్ కెమెరాలో ఈ సంఘటన రికార్డ్ అయింది. వ్లాగర్ కవాసకి నింజా ZX10R కారును నడుపుతున్నాడు.
కవాసకి నింజా ZX10R బైక్ నడుపుతూ వ్యక్తి వెళ్తుండగా.. కాసేపటి తర్వాత బజాజ్ పల్సర్ NS200 రైడర్ వెనుక నుంచి వస్తున్నాడు. ఈ క్రమంలో కవాసకి నింజా బైక్ రైడర్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో సూపర్ బైక్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. అయితే బజాజ్ బైక్‌పై ఇద్దరు ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు.

అయితే ఇక్కడ సూపర్ బైక్ కవాసకి నింజా రైడర్ పరిమిత వేగంతోనే రోడ్డుపై వెళ్తున్నాడు. కానీ వీడియోలో చూస్తుంటే హై స్పీడ్ తో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంమలో అకస్మాత్తుగా, బజాజ్ పల్సర్ NS200 రైడర్ సూపర్‌బైక్ రైడర్‌తో వారిద్దరి మధ్య రేసింగ్ మొదలైంది. బజాజ్ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఉండగా, వారిద్దరూ హెల్మెట్ ధరించలేదు.
వారిద్దరూ సూపర్ బైక్ రైడర్ ముందు తమ టాలెంట్‌ను ప్రదర్శించడం ప్రారంభించారు. బజాజ్ NS200 రైడర్ నిర్లక్ష్యంగా నడుపుతూ, ఎడమ వైపు నుండి ప్రమాదకరమైన ఓవర్‌టేక్‌లు చేయడమే కాకుండా కార్లు ఇంకా బస్సులు, ఆటోల మధ్య చిన్న చిన్న గ్యాప్ లను కూడా వదలకుండా వెళ్తున్నాడు.

ఈ రైడ్‌లో పలుమార్లు ఆటోరిక్షాలను ఢీకొట్టకుండా తృటిలో తప్పించుకున్నాడు. ఇదంతా కవాసకిి నింజా రైడర్ యాక్షన్ కెమెరాలో రికార్డ్ అవుతోంది. అయితే కొద్ది దూరం ప్రయాణం తర్వాత రోడ్డు ఖాళీగా ఉండటంతో NS200 రైడర్ తనను సూపర్‌బైక్ ఓవర్‌టేక్ చేయకుండా ఉండటానికి జిగ్‌జాగ్ పద్ధతిలో బైక్‌ను నడిపాడు.
ఈ క్రమంలో ఒక్కసారి బజాజ్ బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సూపర్ బైక్ రైడర్ తన బైక్‌ను రోడ్డు పక్కన ఆపి వారికి సహాయం చేశాడు. అదృష్టవశాత్తూ, ఇద్దరికీ పెద్దగా గాయాలు కాలేదు.

బైక్‌పై ఉన్న క్రాష్‌గార్డు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. బైక్‌ను పైకి లేపి ఎక్కడైనా డ్యామేజ్ అయ్యిందేమో అని పరిశీలించారు. బైక్‌తో పాటు ఇద్దరూ యువకులూ క్షేమంగా ఉండటంతో యువకులు తిరిగి బైక్‌పై వెళ్లిపోయారు. అదృష్టవశాత్తు వారు కిందపడినప్పుడు వెనుక నుంచి ఏ వాహనం కూడా దగ్గరగా రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే యువకులు తీవ్రంగా గాయపడేవారు.
పబ్లిక్ రోడ్లపై ఇలా స్టంట్లు చేయడం ప్రాణాపాయం అని తెలిసినా.. కొందరు నలుగురి దృష్టిలో పడేందుకు ఇలాంటి విన్యాసాలు చేస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా.. చర్యలు తీసుకున్నా కొందరు వారి తీరు మార్చుకోవడం లేదు.


Click it and Unblock the Notifications








