కారును ఢీకొట్టిన పల్సర్‌ బైక్‌ రైడర్‌.. డ్యాష్‌బోర్డు కెమెరా వీడియో వైరల్‌

రోడ్లపై ప్రయాణం చేస్తున్న సమయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణం నిర్లక్ష్యంగా ప్రవర్తించినా.. అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోడ్లపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కార్లలోని డ్యాష్‌బోర్డు కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి.

తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అప్రమత్తంగా లేకుండా డ్రైవింగ్‌ చేయడం ఎటువంటి ప్రమాదాలకు కారణం అవుతుందో ఈ వీడియో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఓ యువకుడు బజాజ్‌ పల్సర్‌ బైక్‌ను డ్రైవింగ్‌ చేయడం ఈ వీడియోలో గమనించవచ్చు.

Bajaj pulsar rider crashed into rear of the car

ఓ రోడ్డుపై కారు వెళ్తోంది. దాని వెనుక కొంత దూరంలో పల్సర్‌ బైక్‌పై యువకుడు ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఏదో కారణంతో కారు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీనిని గమనించని పల్సర్‌ బైక్‌ రైడర్‌ తన చేతికున్న గ్లౌజులు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో నేరుగా వెళ్లి కారు వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. దీంతో బైక్‌ అదుపు తప్పి కిందపడ్డాడు.

ఆ సమయంలో అదే రోడ్డుపైన ప్రయాణం చేస్తు్న్న కొందరు వాహనదారులు.. కిందపడిన పల్సర్‌ బైక్‌ రైడర్‌ను సాయం చేశారు. అయితే అతనికి పెద్ద గాయాలు కాలేదని తెలుస్తోంది. ఈ ఘటన పంజాబ్‌లోని లూథియానాలో జరిగింది. ఈ ఘటనకు బైక్‌ రైడరే ప్రధాన కారణమని వీడియో ఆధారంగా తెలుస్తోంది. అయితే కారు డ్రైవర్ మాత్రం వెనక్కి చూడకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

Bajaj pulsar rider crashed into rear of the car

రోడ్లపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం జరుగుతుందో చెప్పడం కష్టం. అందువల్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పల్సర్‌ బైక్‌ డ్రైవర్‌ ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ప్రమాదం జరిగేది కాదు. చేతికున్న గ్లౌజులు తీసుకోవాలి అంటే రోడ్డుకు ఒక పక్కన బైక్‌ నిలిపి తీసుకోవచ్చు. అలా కాకుండా రోడ్లపైనే ప్రయాణంలో ఉండగానే నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే ప్రమాదానికి గురయ్యాడు.

కారు, పల్సర్‌ బైక్‌ వేగం తక్కువగా ఉండడం కారణంగా, బైక్‌ రైడర్‌ హెల్మెట్ ధరించిన కారణంగా పెద్ద గాయాలు కాలేదు. అయితే పల్సర్‌ బైక్‌ వెనుక వచ్చిన చాలా మంది వాహనదారులు కనీసం తమ వాహనాన్ని ఆపకుండానే వెళ్లిపోయారు. కనీసం బైక్‌ రైడర్‌ పరిస్థితిపై ఆరా తీయలేదు. అయితే కనీస మానవత్వం చూపించి ఉండాల్సింది.

Bajaj pulsar rider crashed into rear of the car

అందువల్ల రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తే ప్రమాదాలు తప్పవు. కారు, బైక్‌ తక్కువ వేగంతో ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదే వేగంగా ప్రయాణం చేసి ఉంటే.. రోడ్లపైన ఉన్న ఇతరులు కూడా తీవ్రంగా గాయపడి ఉండేవారు. ప్రమాద సమయంలో పల్సర్‌ బైక్‌ వెనకున్న వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, August 26, 2023, 17:28 [IST]
English summary
Bajaj pulsar rider crashed into rear of the car dashboard video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+