హాలీవుడ్ సినిమాలో కనిపించనున్న ఇండియన్ కారు 'బజాజ్ క్యూట్‌'.. సూపర్ కదా..!!

భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటి బజాజ్ ఆటో, మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన బజాజ్ ఆటో (Bajaj Auto) యొక్క 'బజాజ్ క్యూట్‌' (Bajaj Qute) మొదటి సారిగా 2019 లో భారతీయ మార్కెట్లో విడుదల చేయబడింది. అప్పట్లోనే బజాజ్ ఆటో అందుబాటులో ఉన్న బజాజ్ ఆటో రిక్షాలకు గొప్ప ప్రత్యామ్నాయంగా ఈ అందమైన బుజ్జి వాహనాన్ని విడుదల చేసింది.

హాలీవుడ్ సినిమాలో కనిపించనున్న దేశీయ కారు 'బజాజ్ క్యూట్‌'.. సూపర్ కదా..!!

భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్. ఇది అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఈ చిన్న వాహనం కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్ల కోసం కూడా ఎగుమతి చేయబడింది. ఈ కారణంగానే ప్రపంచ మార్కెట్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది.

హాలీవుడ్ సినిమాలో కనిపించనున్న దేశీయ కారు 'బజాజ్ క్యూట్‌'.. సూపర్ కదా..!!

అయితే బజాజ్ కంపెనీ యొక్క ఈ చిన్న కారు, త్వరలో విడుదల కానున్న హాలీవుడ్ సినిమాలో కనిపించనుంది. హాలీవుడ్ చిత్రమైన 'ది లాస్ట్ సిటీ' లో ఈ కారు కనిపించనునుంది. ఇందులో సాండ్రా బుల్లక్, చానింగ్ డాటమ్, డేనియల్ రాడ్‌క్లిఫ్ మరియు బ్రాడ్ పిట్ నటించారు. ఈ చిత్రాన్ని 2022 మార్చిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

హాలీవుడ్ సినిమాలో కనిపించనున్న దేశీయ కారు 'బజాజ్ క్యూట్‌'.. సూపర్ కదా..!!

అయితే ఈ సినిమా విడుదలకు ముందే, దీనికి సంబంధించిన ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించారు. 'ది లాస్ట్ సిటీ' సినిమా ట్రైలర్‌లో బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్‌ను మనం చూడవచ్చు. ఈ సినిమాలో అడ్వెంచర్ ట్రావెల్ సన్నివేశాలకు ఎలాంటి లోటు ఉండదని భావిస్తున్నారు.

హాలీవుడ్ సినిమాలో కనిపించనున్న దేశీయ కారు 'బజాజ్ క్యూట్‌'.. సూపర్ కదా..!!

ఈ సినిమాను దట్టమైన అడవిలో చాలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ ప్రదేశాలలో బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ ఉపయోగించబడుతుంది. నిజం చెప్పాలంటే, అటువంటి కఠినమైన, కఠినమైన భూభాగంలో సరైన ఆఫ్-రోడ్ SUVని ఉపయోగించడం తప్పనిసరి. కానీ 'ది లాస్ట్ సిటీ' చిత్ర బృందం ఆఫ్-రోడ్ ఎస్‌యూవీకి బదులుగా బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్‌ను ఉపయోగించింది.

హాలీవుడ్ సినిమాలో కనిపించనున్న దేశీయ కారు 'బజాజ్ క్యూట్‌'.. సూపర్ కదా..!!

అయితే ఈ సన్నివేశాల్లో బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ చూడటం బాగుంది. అదే సమయంలో, ట్రైలర్‌లో బజాజ్ అందమైన క్వాడ్రిసైకిల్ కొండపై నుండి దొర్లుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సీన్లు హాలీవుడ్‌లోనే కాదు అన్ని సినిమాల్లోనూ సాధారణంగా మనం చూసి ఉంటాము.

హాలీవుడ్ సినిమాలో కనిపించనున్న దేశీయ కారు 'బజాజ్ క్యూట్‌'.. సూపర్ కదా..!!

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈకారు యొక్క పొడవు 2,752 మిమీ, వెడల్పు 1,312 మిమీ మరియు ఎత్తు 1,652 మిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ యొక్క వీల్‌బేస్ పొడవు 1,925 మిమీ వరకు ఉంటుంది. కావున వినియోగించడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

హాలీవుడ్ సినిమాలో కనిపించనున్న దేశీయ కారు 'బజాజ్ క్యూట్‌'.. సూపర్ కదా..!!

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ 12 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. ఈ కారులోని క్యాబిన్‌లో కేవలం 4 మంది వ్యక్తులు మాత్రమే కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇది తక్కువ దూరాలకు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది, కానీ సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ఇది అంత అనుకూలంగా ఉండదు.

హాలీవుడ్ సినిమాలో కనిపించనున్న దేశీయ కారు 'బజాజ్ క్యూట్‌'.. సూపర్ కదా..!!

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ 216.6 సిసి పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. అయితే వినియోగదారులు CNG మరియు LPG వెర్షన్‌లను కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ యొక్క గరిష్ట వేగం గంటకు 70 కి.మీ వరకు ఉంటుంది. అయితే ఈ చిన్న కారు ఈ వేగంతో ప్రయాణించడం చాలా కష్టమని అంటున్నారు.

హాలీవుడ్ సినిమాలో కనిపించనున్న దేశీయ కారు 'బజాజ్ క్యూట్‌'.. సూపర్ కదా..!!

బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ అత్యంత రద్దీగా ఉండే నగర రోడ్లపై ప్రజలను తీసుకెళ్లేందుకు రూపొందించబడింది. కానీ సాధారణ కార్ల కంటే ఇది మరింత అనుకూలంగా ఉంటుంది. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో బజాజ్ క్యూట్ క్వాడ్రిసైకిల్ ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది.

హాలీవుడ్ సినిమాలో కనిపించనున్న దేశీయ కారు 'బజాజ్ క్యూట్‌'.. సూపర్ కదా..!!

అయితే ఇప్పుడు ఏకంగా ఈ హాలీవుడ్ సినిమాలో కనిపించడం వల్ల దీనికున్న ఆదరణ మరింత పెడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సినిమాలో విడుదలైతే ఈ వాహనం అక్కడ దర్శనమిస్తుంది, తద్వారా దీని ఆదరణ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.అయితే ఈ సినిమా వల్ల ఎంతవరకు ఈ కారు ప్రాచుర్యం పొందుతుంది ఏ విషయం తెలియరావాలి, త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Bajaj qute spotted in upcoming hollywood movie the lost city details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X