నంబర్ కోసం జరిగిన యాక్షన్.. హీరో బాలయ్య విన్నర్! ఒక్క నంబర్ కోసం భారీ ఖర్చు.. ధర వింటే షాక్!
కారు అనేది చాలామందికి ఒక సాధారణ ప్రయాణనికి ఉపయోడేది అయినా, కొందరికి అది సమాజంలో ఒక సోషల్ సింబాలిక్‌గా చూపించుకునేందుకు ఇష్టపడుతుంటారు. చాలా మంది తమ డ్రిమ్ కారును కొనుగోలు చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు. అయితే తమకు నచ్చిన కారును సొంతం చేసుకోవడంతో పాటు, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబరు కూడా తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలనుకోవడం చూస్తున్నాం. దేశంలోని పలు ప్రాంతాల్లో ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలంలో లక్షలు ఖర్చు చేయడం సాధారణంగా మారిపోయింది. కారు నెంబర్ అంటే అది వ్యక్తి అభిరుచి, స్టేటస్ సింబల్, అలాగే ప్రత్యేకతను ప్రతిబింబించే ఒక గుర్తుగా నిలుస్తోంది. సినిమా తారలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇలా ప్రముఖులు తమ ఇష్టమైన నంబర్ల కోసం వేలం లాంటి పోటీల్లో పాల్గొనడం ఇటీవల కాలంలో ఎక్కువ అయింది.
తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకరైన నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా తన కారు నెంబర్ కోసం భారీ మొత్తాన్ని వెచ్చించారు. ఎన్టీఆర్ వారసుడిగా మాత్రమే కాక, తన నటన, ఎనర్జీ, రాజకీయాల్లో కూడా ఉన్నతస్థాయికి చేరిన వ్యక్తిగా ఆయనకు విభిన్నమైన ఫాలోయింగ్ ఉంది. ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుండి MLAగా కూడా ఉన్నారు.

ఇప్పుడు కారు కోసం ఆయన స్పెషల్ నంబర్ల పట్ల ఆసక్తి చూపడం వార్తల్లోకెక్కింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రవాణా శాఖ నిర్వహించిన వేలంలో తనకు ఇష్టమైన వాహన నంబర్‌ను పొందేందుకు భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తుంది. వేలంలో పాల్గొని అత్యధిక ధర చెల్లించి ఆ నంబర్‌ను సొంతం చేసుకున్నారు. ఇది చూసి అభిమానులు గర్వంగా భావించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే బాలకృష్ణ ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చూపించడంలో ముందుంటారు
తెలంగాణ ప్రాంతీయ రవాణా అధికార (RTA) ఖైరతాబాద్ కార్యాలయంలో శనివారం జరిగిన ఆన్‌లైన్ వేలంలో నటుడు బాలకృష్ణ ఫ్యాన్సీ కారు రిజిస్ట్రేషన్ నంబర్ 'TG09 F0001'ను రూ.7.75 లక్షలు చెల్లించి కొనుగోలు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నంబర్ ఆయన కారుకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. కేవలం బాలకృష్ణ మాత్రమే కాదు, ఈ వేలంలో కార్ ప్రియుల దృష్టిని ఆకర్షించిన మరెన్నో ఆకర్షణీయ నంబర్లు ఉన్నాయి.

గత శనివారం జరిగిన ఈ వేలం ద్వారా రవాణా శాఖ దాదాపు రూ.37.15 లక్షల రూపాయలను సేకరించిందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇది నెంబర్లు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న వ్యాపార అవకాశాలను తెలియజేస్తుంది. బిలియనీర్లు, సెలబ్రిటీలకు మాత్రమే కాక, వ్యాపార ప్రపంచంలోనూ ఈ ఫ్యాన్సీ నంబర్లు ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రిజిస్ట్రేషన్ నంబర్లకు ఉన్న విశిష్టతను ఇది పేర్కొంటుంది.
మరో విషయం ఏమిటంటే ఈ వేలంలో ఎక్కువ నెంబర్లు కంపెనీల ఆధీనంలోకి వెళ్లాయి. కమలాలయ హిసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ TG09 F0009 నంబర్‌ను రూ.6.70 లక్షలకు వేలం వేసింది. TG09 F9999 నంబర్ కోసం ఎకో డిజైన్ స్టూడియో దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేసింది. అలాగే, TG09 F0005 నెంబర్ కోసం జెట్టీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1.49 లక్షలు చెల్లించింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








