పొల్యూషన్ ఎఫెక్ట్.. ఆ కార్లపై నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 20,000 ఫైన్.!!
అత్యధిక ట్రాఫిక్ రద్దీ, పొల్యూషన్ ఉన్న నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ ఒకటి. అందుకే ఢిల్లీలో పర్యారణ కాలుష్యం ఎప్పుడూ పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది వాహనదారులు షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు.
ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇక నుంచి BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలను ఢిల్లీ రోడ్లపై నడపకూడదని స్పష్టం చేసింది. ఈ వాహనాల నిర్వహణను నిషేధించాలని ఢిల్లీ రవాణా శాఖ ఆదేశించింది. ఈ ఉత్తర్వులు నవంబర్ 2(గత గురువారం) నుంచి అమల్లోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 20,000 జరిమానా విధించనుంది.

ఢిల్లీలో ఈ కార్లపై నిషేధం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమల్లో ఉంటుంది. నగరంలో గాలి నాణ్యత మెరుగుపడినప్పుడే ఈ నిషేధాన్ని రవాణా శాఖ ఎత్తివేయనుంది. ఈ నేపథ్యంలో BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లను కలిగి ఉన్నవారు ఆ వాహనాలను ఢిల్లీ రోడ్లపై నడపడానికి వీల్లేదు.
కానీ ఈ ఉత్తర్వుల ప్రకారం కొన్ని వాహనాలకు ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉంది. అంబులెన్స్, అగ్నిమాపక విభాగం, పోలీసు వాహనాలు, ప్రభుత్వ వాహనాలు వంటి అత్యవసర వాహనాలకు ఈ నిషేధం వర్తించదని గుర్తుంచుకోవాలి. దీని ప్రకారం పదేళ్లకు పైబడిన డీజిల్ కార్లు, 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ కార్లకు ఢిల్లీ రోడ్లపై అనుమతి లేదు.

ఢిల్లీతో సహా పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో కాలుష్యం కారణంగా గాలి నాణ్యత తీవ్రంగా తగ్గుతోంది. ఈ పరిస్థితి ప్రతి యేటా కొనసాగుతూనే ఉంది. ఇక దీపావళి పండుగ రోజుల్లో పొల్యూషన్ విపరీతంగా పెరుగుతోంది. దీనిపై ప్రతి యేటా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ అంత మంచి ఫలితాలు కనిపించడం లేదు.
ఢిల్లీలో వాయు కాలుష్యానికి ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగతో పాటు వాహనాలు కూడా ముఖ్య కారణమవుతున్నాయి. దీని కారణంగా గత కొన్నేళ్లుగా ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. వీటితో పాటు, CNG వంటి పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని కూడా ఢిల్లీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

వీటి వినియోగం ద్వారా పొల్యూషన్ సమస్య కొంతమేర తగ్గుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీలో, ప్రైవేట్ వాహనాలు లేదా ప్రజా రవాణా వాహనాలు అన్ని రకాలుగా పర్యావరణ అనుకూల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరి ఈ నిర్ణయం ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
ఢిల్లీలోనే కాదు యావత్ భారతదేశం అంతటా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. సబ్సిడీలు, రోడ్డు పన్ను నుంచి మినహాయింపులు, ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడం వంటి చర్యల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా కృషి చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తును ఎలక్ట్రిక్ వాహనాలే శాసిస్తాయనడంలో సందేహం లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








