వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

బెంగుళూరులో చోటు చేసుకున్న ఒక విషయం ఏమిటంటే రహదారుల్లో వాహనాలలో ప్రయాణించే వ్యక్తులు మద్యం తాగి వాహనాలను నడుపుతున్నారా,ఒకవేళ మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లైతే వారు తాగిన మద్యం స్థాయి ఎంత అనేవి నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తూ నలుగురు పోలీసులు పట్టుబడ్డారు. వీరిదగ్గర 3 నకిలీ ఆల్కో మీటర్లు ఉన్నాయి. ఇంకా బైకర్లనుండి వసూలుచేసి 32000 రూపాయల నగదు, కొన్ని డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. ఈ విధంగా అనధికారంగా తనిఖీ చేస్తున్న ఈ నలుగురు పోలీసులు సస్పెండ్ చేయబడ్డారు.

వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

ప్రయాణికుల్లో మద్యం స్థాయిని గుర్తించడానికి నకిలీ ఆల్కోమీటర్లను ఉపయోగించినందుకు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు ముగ్గురు కానిస్టేబుళ్లను పట్టుకున్నారు. ఈ నలుగురు పోలీసులలో ఏఎస్ఐ మునియప్ప, కానిస్టేబుల్స్ గంగరాజ్, నాగరాజ్ మరియు హర్ష ఉన్నారు.

వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

సస్పెండ్ చేయబడిన పోలీసు సిబ్బంది డిపార్ట్మెంట్ లో కాకుండా కొంతమంది బయటివ్యక్తులను నియమించి ప్రయాణికులను వేధించడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను బనాయించి వారివద్ద జారీమానాలు వాసులు చేస్తున్నారు. వీరి వద్ద ప్రైవేటుగా కొనుగోలు చేసిన ఆల్కోమీటర్లు ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించడానికి ప్రభుత్వం జారీ చేసిన వాటికి వ్యతిరేకంగా వీరు ఆల్కో మీటర్లు ఉపయోగిస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే వాహనదారులనుండి ఎటువంటి చలానాలు జారీ చేయకుండానే జరిమాణాలు వసూలు చేస్తున్నారు

వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

ఈ విధంగా నియమాలకు వ్యతిరేకంగా డ్రంక్ అండ్ & డ్రైవ్ టెస్టులు చేయడం, చలనాలు ఇవ్వకుండా జరిమానాలు వసూలు చేయడం వంటి పిర్యాదులు ఈ పోలీసుల మీద వచ్చిన తరువాత నలుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు మనకు తెలుస్తుంది.

వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

ఈ నలుగురు పోలీసులు అశోక్ నగర్ పరిధిలోకి వచ్చే శ్రీనివాగిలు జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారని గుర్తించారు. వచ్చిన సమాచారం ప్రకారం ఎసిపి సతీష్, కవితా నేతృత్వంలో ట్రాఫిక్ పోలీసుల బృందంతో సంఘటన స్థలానికి వెళ్లి వీరిని సస్పెండ్ చేసారు. సస్పెండ్ చేయబడిన పోలీసులకు 5 మంది ప్రయివేట్ వ్యక్తులు కూడా సహాయం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

సహాయం చేసిన ఐదు మంది ప్రయివేటు ఉద్యోగులు తప్పించుకున్నారు. కానీ విధుల్లో ఉన్న పోలీసుసు పట్టుబడ్డారు. వారిదగ్గరున్న ప్రయివేట్ ఆల్కోమీటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వాహనదారులనుంచి వసూలు చేసిన 32000 రూపాయలతో పాటు కొన్ని డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి. వీటినన్నిటిని పోలీసు బృందం వారు స్వాధీనం చేసుకుని నియమాలకు వ్యతిరేకంగా ప్రజలను మోసం చేసిన ఈ నలుగురి పోలీసులను సస్పెండ్ చేసారు.

వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

సస్పెండ్ చేయబడిన పోలీసులకు సహాయం చేస్తున్న ఐదు మంది ప్రయివేట్ వ్యక్తులు సాధారణ దుస్తులలో ఉండి, వాహనదారులను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేసి ఏఎస్ఐ మునియప్పకు పంపుతారు. ఇదేకాకుండా ఈ ఐదు మంది ప్రయివేటు వ్యక్తులు వాహనదారులనుండి భారీ జరిమానాలు విధించడం లేకుంటే వాహనాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో 15000 జరిమానా కట్టాలని భయపెట్టడం వంటివి చేసేవారు.

వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

ఈ విధంగా వాహనదారులను ఇబ్బందిపెడుతున్న పోలీసులను సస్పెండ్ చేసి, వారిపై తదుపరి విచారణ చేపడతామన్నారు. సస్పెండ్ చేసిన వారిలో వివేక్ నగర్ కి చెందిన ఏఎస్ఐ మునియప్ప కానిస్టేబుల్స్ గంగరాజ్, నాగరాజ్ మరియు హర్షలు ఉన్నారు. వీరిపై అశోక్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వ్యతిరేకంగా దోపిడీ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసిన కేసును నమోదు చేశారు.

Read More: 5 లక్షల రూపాయలు ధర తగ్గించిన మిత్సుబిషి

వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

బెంగుళూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు సర్వసాధారణంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం బయటపడినది డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ రాకెట్. ఇది పోలీసుల చేత నిర్వహించబడింది. కానీ వీరు నియమాలకు వ్యతిరేఖంగా తనిఖీలు జరిపి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వీరి దగ్గర అనుమతించబడిన నాల్కో మీటర్లు లేవు, వీరి దగ్గర ఉన్నవి కేవలం ప్రయివేటు వ్యక్తులు కొనుగోలు చేసినవి మాత్రమే. ఈ విధమైన డ్రంక్ & డ్రైవ్ రాకెట్టు నెల రోజులుగా జరుగుతోంది అని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Read More:బహిరంగ ప్రదర్శనకు ముందు పరీక్షించనున్న 2020 హ్యుండాయ్ ఆరా కార్లు

వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

డ్రగ్స్ లేదా ఆల్కహాల్ సేవించి వాహనాలను నడపడం అనేది శిక్షార్హమైన నేరం. ఎందుకంటే ఆల్కహాల్ సేవించి వాహనాలను నడిపితే వాహనదారుడికి ప్రమాదం జరగవచ్చు లేదా వాహనదారుడి వల్ల ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఇది శిక్షించబడేటువంటి నేరం.

Read More:టాటా అల్ట్రోజ్ రివ్యూ: ఈ కారును కొనచ్చా.. కొనకూడదా..?

వాహనదారుల మద్యం స్థాయిని నకిలీ పరికరాలతో తనిఖీ చేస్తున్న బెంగళూరు పోలీసుల సస్పెండ్!

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మొదటి కేసులో 2000 రూపాయల జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇది తిరిగి మూడు సంవత్సరాలలోపు పునరావృతమైతే దానికి 3000 రూపాయల జరిమానా 2 సంవత్సరాలవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. సాదరంగా 100 మిల్లీలీటర్ రక్తంలో 30 మిల్లి గ్రాములను మించి ఆల్కహాల్ ఉన్నట్లు స్వాస పరీక్షలో తెలిస్తే ఆ వ్యక్తిని శిక్షించవచ్చు.

Most Read Articles

English summary
Policemen caught with fake devices to check alcohol level – Suspended- Read in telugu
Story first published: Wednesday, December 18, 2019, 11:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X