ఈ బార్బర్.. ఓ రోల్స్ రాయిస్‌తో పాటు 67 కార్లకు యజమాని

అతను చేసేది మంగలి పని (బార్బర్). కానీ అతనొక కోటీశ్వరుడు. అతని వద్ద కోట్ల రూపాయల విలువ చేసే ఓ రోల్స్ రాయిస్ కారుతో పాటు మొత్తం 67 కార్లు ఉన్నాయి. ఇంతకీ ఎవరీ మిస్టరీ మ్యాన్ అనుకుంటున్నారా..!! ఇతని పేరు రమేష్ బాబు, బెంగుళూరు నివాసి. ఒకప్పుడు వంద రూపాయలు సంపాధించడానికి రోజంతా కష్టపడి పనిచేసే రమేష్ బాబుకి ఇప్పుడు రోజుకు ఎంత సంపాదన వస్తుందో కూడా లెక్కకట్టలేని పరిస్థితి.

తంతే బూరెల బుట్టలో పడ్డట్లు అన్న సామెత చందంగా అదృష్టం కలిసి రావాలే కానీ భిక్షాధికారి కూడా లక్షాధికారి కావడం చిటికెలో పని. అయితే, రమేష్ బాబు విషయం వేరు. అదృష్టంతో పాటు కష్టించి పనిచేసే గుణం కూడా ఉన్నందువలన ఆయన ఈరోజు ఇంత ఎత్తుకు ఎదగగలిగాడు. రమేష్ బాబు వద్ద మూడు కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారుతో పాటుగా 67 ఇతర కార్లు ఉన్నాయి.

ఈ కార్లన్నింటినీ రమేష్ అద్దెకు ఇస్తుంటాడు. ఈ వ్యాపారం ద్వారా బాగా ఆర్జిస్తున్నప్పటికీ, తన స్వంత వృత్తి అయిన మంగలి పనిని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. రమేష్ బాబు కస్టమర్ల జాబితాలో ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీసు అధికారులతో పాటుగా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, ఐశ్యర్వా రాయ్ బచ్చన్ వంటి సినీ తారలు కూడా ఉన్నారు.

భవిష్యత్తులో ఇతని నిజజీవితం ఆధారంగా మూడు భాషలలో ఓ చిత్రాన్ని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. 1979వ సంతవ్సరంలో రమేష్ బాబు తండ్రి కాలం చేశారు. అప్పట్లో వారిది చాలా పేద కుటుంబం. పూట గడవటమే కష్టంగా ఉండేది. అప్పుడు అతని వయస్సు తొమ్మిదేళ్లు. ఆ రోజుల్లో బెంగుళూరులోని బ్రిగేడ్ రోడ్‌లో ఓ బార్బర్ షాపులో పార్ట్ టైమ్‌గా పనిచేస్తూ రోజుకు రూ.5 సంపాధించేవాడు.

కానీ సదరు సంపాదనతో కుటుంబాన్ని పోషించడం కష్టం కావడంతో, తర్వాతి కాలంలో 10వ తరగతి తర్వాత విద్యాభ్యాసం మానేసి పూర్తిగా మంగలి వృత్తిని పైనే ఆధారపడ్డాడు. ఆ తర్వాత 1991లో స్వంతగా ఓ షాపును ప్రారంభించి అంచెలంచలుగా ఎదుగుతూ వచ్చాడు. 1994లో తొలిసారిగా ఓ మారుతి ఓమ్నీ వ్యాన్‌ను కోనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం ప్రారంభించాడు.

అలా మంగలి వృత్తితో పాటు కార్లను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే సొమ్మును జమచేసుకుంటూ తన రెండు వ్యాపారాలను విస్తరించుకుంటూ ఎదగసాగాడు. ఇప్పుడు రమేష్ బాబు దగ్గర ఓ రోల్స్ రాయిస్‌తో పాటుగా నాలుగు మెర్సిడెస్ బెంజ్ కార్లు, నాలుగు బిఎమ్‌డబ్ల్యూ కార్లు, 50 టొయోటా ఇన్నోవాలు ఉన్నాయి. రోల్స్ రోయిస్ కారును ఒక్క రోజు అద్దెకు ఇవ్వడం ద్వారా రమేష్ బాబు దాదాపు రూ.50,000 వరకూ సంపాధిస్తాడు.

మన రమేష్ బాబు కధ విన్న తర్వాత నాకు... "కృషి ఉంటే మనషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు.." అనే పాట గుర్తుకు వచ్చింది. అయితే, ప్రస్తుత రోజుల్లో కేవలం కృషి మాత్రమే సరిపోదు, కృషితో పాటు కూసింత అదృష్టం (ఆంగ్లంలో లక్) ఉండాల్సిందే. మరి మీరేమంటారు..??

More from DriveSpark

Article Published On: Wednesday, December 7, 2011, 15:48 [IST]
English summary
Bangalore based barber Ramesh Babu owns Rs.3 crore Rolls Royce Ghost luxury Car . He is not a ordinary barber. He is a billionaire barber, who owns a rent car fleet. It includes 68 cars include Rolls Royce Ghost, BMW and Benz luxury cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+