బెంగుళూరు-చెన్నై ఏసి డబుల్ డెక్కర్ ట్రైన్: ఫొటోలు, వివరాలు

By Ravi

బెంగుళూరు, చెన్నై వాసులకు గుడ్ న్యూస్. ఇకపై ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం ఎంతో సునాయాసంగా, సౌకర్యవంతంగా సాగిపోనుంది. గడచిన 2012-2013 రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన ఏసి డబుల్ డెక్కర్ డైలీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సర్వీసులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగుళూరు-చెన్నై, చెన్నై-బెంగుళూరు సర్వీసుల కోసం ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి.

ఈ ఏసి డబుల్ డెక్కర్ ట్రైన్ గరిష్ట వేగాన్ని గంటకు 110 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇందులో మొత్తం 10 ఏసి చైర్ కార్ కోచ్‌లు ఉంటాయి. చెన్నై-బెంగుళూరు ట్రైన్ ఛార్జ్‌ను రూ.470 లుగా నిర్ణయించారు. ఈ ధర బృందావన్, లాల్ భాగ్ లేదా బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వసూలు చేస్తున్న ఏసి ఛైర్ కార్ ధరలతో సమానంగా ఉంటుంది. ఈ ట్రైన్‌లో 362 కి.మీ. దూరాన్ని చేరుకోవటానికి దాదాపు 6 గంటల సమయం పడుతుంది.

ఈ ట్రైన్ (ట్రైన్ నెం.22625) ఉదయం చెన్నై సెంట్రల్ నుంచి 7.25 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1.30 నిమిషాలకు బెంగుళూరు సిటీకు చేరుతుంది. అలాగే, ఇది (ట్రైన్ నెం.22626) మధ్యాహ్నం 2.40 నిమిషాలకు బెంగుళూరు సిటీ నుంచి బయలుదేరి రాత్రి 8.45 నిమిషాలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది. అరకోణం, కటపడి, అంబూర్, జోలార్‌పెట్టయ్, బంగారుపేట్, క్రిష్ణరాజపురం (కెఆర్ పురం), బెంగుళూరు కంటోన్మెంట్, పెరంబూర్‌లలో ఈ ట్రైన్‌కు స్టాపింగ్ పాయింట్స్ ఉన్నాయి.

ఈ డబుల్ డెక్కర్ ఏసి ట్రైన్‌లో 120 సీట్లు ఉంటాయి. ఈ రూట్లో ప్రయాణిస్తున్న సాధారణ ట్రైన్లతో పోల్చుకుంటే ఇది చాలా అధికం. ఎరుపు, పసుపు రంగుల కలయికతో ఉండే ఈ ఏసి డబుల్ డెక్కర్ రైలును ధృడమైన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించారు. దీనిని రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా తయారు చేసింది. ఇందులో రైలు వేగం, దూరం, తర్వాతి స్టేషన్ వంటి వివరాలను తెలిపే రియల్ టైమ్ రన్నింగ్ పొజిషన్‌ను చూపించే జిపిఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్, త్వరగా ఓపెన్ చేసుకునే వీలున్న ఎమర్జేన్సీ కిటికీ అద్దాలు, ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్, స్మూత్ రైడ్ కోసం మల్టిపుల్ షాక్ అబ్జార్వర్స్, అన్ని కోచ్‌‌లలో మంటలను ఆర్పే యంత్రాలు వంటి సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లున్నాయి.

బెంగుళూరు-చెన్నై ఏసి డబుల్ డెక్కర్ ట్రైన్

More from DriveSpark

Article Published On: Tuesday, April 23, 2013, 18:10 [IST]
English summary
The much-anticipated AC Double Decker daily express train to Bangalore will commence operations on Thursday, bringing to fruition a proposal announced in the 2012-13 Railway Budget.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+