హెల్మెట్ ధరించనందుకు రైడర్ మీదకు చెప్పులు విసిరిన ట్రాఫిక్ పోలీస్
ప్రజలకు చెప్పి చెప్పి విసిగిపోయిన కొంత మంది ట్రాఫిక్ పోలీసులు కోపంలో ఏవేవో చేస్తుంటారు. ఎంత చెప్పినా మాట వినని రైడర్ల మీద విపరీతమైన కోపంతో ఊగిపోతుంటారు. అచ్చం ఇలాంటి లక్షణాలున్న ఓ ట్రాఫిక్ పోలీస్ రైడర
ఈ మధ్య కాలంలో ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో హెల్మెట్ ధరించకుండా బైక్ రైడ్ చేసే రైడర్లు మీద ట్రాఫిక్ పోలీసుల దృష్టి ఎక్కువయ్యిందని చెప్పవచ్చు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎన్నో రకాల క్యాంపెయిన్లతో పాటు కఠినమైన రూల్స్ కూడా అమలు చేస్తుంటారు.

ఫేస్‌బుక్ మరియు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికగా హెల్మెట్ ధరించడం మరియు దాని ప్రాముఖ్యత గురించి ట్రాఫిక్ పోలీసులు ఎన్నో రకాల పోస్టులు చేస్తుంటారు. అయినా కూడా, హెల్మెట్ లేని రైడర్ల భరతం పట్టేందుకు రోడ్డెక్కే పోలీసులకు హెల్మెట్ లేని రైడర్లు కోకొల్లలుగా పట్టుబడుతుంటారు.

ప్రజలకు చెప్పి చెప్పి విసిగిపోయిన కొంత మంది ట్రాఫిక్ పోలీసులు కోపంలో ఏవేవో చేస్తుంటారు. ఎంత చెప్పినా మాట వినని రైడర్ల మీద విపరీతమైన కోపంతో ఊగిపోతుంటారు. అచ్చం ఇలాంటి లక్షణాలున్న ఓ ట్రాఫిక్ పోలీస్ రైడర్‌కు గుణపాఠం చెప్పేందుకు తన కాలి చెప్పుతో రైడర్ మీద దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

రిషబ్ ఛటర్జీ అనే ఓ యూట్యూబర్ తన కారు డ్యాష్ కెమెరాలో హెల్మెట్ ధరించకుండా ఒకే బైకు మీద ముగ్గురు వెళుతుండటంతో ఆక్రోశంతో రెచ్చిపోయిన ట్రాఫిక్ పోలీస్ రైడర్ మీదకు తన కాలి చెప్పును విసరడం రికార్డయ్యింది.

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు రైడర్లందరూ ఐఎస్ఐ గుర్తు కలిగి ఉన్నహెల్మెట్ ధరించేలా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. హెల్మెట్ ధరించని రైడర్లకు జరిమానా విధించడంతో పాటు, నాణ్యమైన హెల్మెట్ ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా రహదారి నియమాలను ఉల్లంఘించే వారి సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. హెల్మెట్ లేకుండా రైడింగ్ చేయడం ఇండియన్ రోడ్ల మీద సర్వసాధారణం. రైడర్లు కనీసం తమ సొంత భద్రతకే ప్రాధాన్యమివ్వకపోవడం చాలా దారుణం.
2016 గణాంకాలను పరిశీలిస్తే, ఆ ఒక్క ఏడాదిలోనే సుమారుగా 50,000 మంది ద్విచక్ర వాహనదారులు మరణించారు. ప్రమాదం జరిగినపుడు హెల్మెట్ ధరించకపోవడం వలనే ఎక్కువ మంది మరణించారు.

హెల్మెట్ లేకుండా పోలీసులకు పట్టుబడితే ఫైన్ వేస్తారని నామమాత్రపు నాణ్యత ఉన్న హెల్మెట్లను ఎంచుకోకండి. ప్రయాణంలో మన తలకు రక్షణ మన బాధ్యత. కాబట్టి, ఐఎస్ఐ మార్కు కలిగి ఉన్న నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే ధరించండి.
హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న బైకర్ మీదకు చెప్పు విసిరిన పోలీసు, మరి ఆ రైడర్‌ను పట్టుకుని జరిమానా విధించాడా లేదా... అన్నది తెలియరాలేదు. ఏదేమైనప్పటికీ, ఎన్నిసార్లు చెప్పినా హెల్మెట్ ధరించకుండా వెళ్లే వారి కారణంగా ట్రాఫిక్ పోలీసుల మరింత విసుగు చెందుతున్నారు. ఒక్కోసారి ఇలాంటి ఘటనలకు కూడా పాల్పడుతున్నారు.
హెల్మెట్ ధరించకుండా బైక్ రైడింగ్ చేసిన వ్యక్తి మీదకు ట్రాఫిక్ పోలీస్ చెప్పు విసరడాన్ని ఇక్కడున్న వీడియోలో గమనించగలరు.


Click it and Unblock the Notifications








