TVS స్కూటర్‌పై 634 చలానాలు... రూ.3.25 లక్షల జరిమానా.. ఎలా ట్రాక్ చేశారంటే?
భారత్‌లో అత్యధిక ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్, సీసీ కెమెరాల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దాంతోపాటు అధునాతన వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి, చలానాలను విధిస్తున్నారు. అయితే తాజాగా ఆ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఓ ద్విచక్రవాహనంపై ఏకంగా మూడు లక్షలకుపైగా చలానా పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది.
634 ట్రాఫిక్ ఉల్లంఘనలు.. రూ.3.25 లక్షలు: ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. ఫిబ్రవరి 2022 నుంచి TVS స్కూటీ పెప్+ స్కూటర్‌పై (TVS scooty pep+) 634 ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలు నమోదయ్యాయి. దీంతో KA04 KF 9072 రిజిస్ట్రేషన్ కలిగిన స్కూటీని ట్రాక్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. చివరికి తాజాగా స్కూటర్‌ను ట్రాక్ చేశారు. బెంగుళూరులోని ఆర్టీనగర్ ట్రాఫిక్ పోలీసులు ఈ స్కూటర్‌ను ట్రాక్ చేశారు.

టీవీఎస్ స్కూటర్ ఉల్లంఘనలు అన్ని ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కెమెరాల్లో రికార్డు అయ్యాయని పోలీసులు వెల్లడించారు. స్కూటర్ యజమాని వివరాలను వెల్లడించారు. బెంగళూరులోని గగానగర్‌కు చెందిన దినేష్‌గా తెలిపారు. 2021 సంవత్సరంలో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ స్కూటర్‌పై 2022 ఫిబ్రవరి 23న తొలి చలాన్ జారీ అయిందని తెలిపారు.
ధర కంటే నాలుగు రెట్లు జరిమానా అధికం : ట్రాఫిక్ ఉల్లంఘనల్లో హెల్మెట్ ధరించకపోవడం, డ్రైవింగ్‌లో ఫోన్ మాట్లాడడం సహా మరిన్ని ఉల్లంఘనలు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అయితే తాజాగా డిసెంబర్ 17న మరొకటి నమోదైందని తెలిపింది. జరిమానా మొత్తం రూ.3.25 లక్షలుగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఈ జరిమానా స్కూటర్ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం.

స్కూటర్ యజమానికి నోటీసులు : అయితే ఈ స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అంత మొత్తంలో జరిమానా చెల్లించలేనని.. పోలీసులను కోరినట్లు తెలిసింది. అయితే స్కూటర్ యజమాని విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. జరిమానా మొత్తాన్ని చెల్లించిన తర్వాతే స్కూటర్‌ను విడుదల చేస్తామని తెలిపారు. దీంతోపాటు యజమానికి నోటీసులు జారీచేశారు.
భారత్‌లో ప్రస్తుతం అన్ని ప్రధాన రోడ్లపై సీసీ టీవీ కెమెరాలు అమర్చబడ్డాయి. దీని ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా వీడియోల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా వాహనాలను ట్రాక్ చేసి జరిమానా విధిస్తారు. అయితే కొన్నిసార్లు తప్పుడు చలానాలు జారీ అయ్యే అవకాశం ఉంది. వీటిని ఆన్‌లైన్ ద్వారా సవాల్ చేయవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








