లాక్ డౌన్ లో వినూత్నమైన చర్య చేపట్టిన బెంగళూరు పోలీసులు, ఇంతకీ ఏంచేసారో తెలుసా..!

భారతదేశంలో కరోనా వైరస్ వల్ల మరణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ భయంకరమైన వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి దాదాపు ఇప్పటికే 43,272 మంది ప్రాణాలను తీసింది. అంతే కాకుండా 8,00,000 మందికి పైగా ప్రజలు ఈ వైరస్ భారిన పడ్డారు. ఈ వైరస్ మహమ్మారి వల్ల మరణాల రేటు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.

లాక్ డౌన్ లో వినూత్నమైన చర్య చేపట్టిన బెంగళూరు పోలీసులు, ఇంతకీ ఏంచేసారో తెలుసా..!

భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించింది. ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి బయటికి రాకుండా వుండే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇల్లు వదిలి వెళ్లకూడదని సూచించారు.

లాక్ డౌన్ లో వినూత్నమైన చర్య చేపట్టిన బెంగళూరు పోలీసులు, ఇంతకీ ఏంచేసారో తెలుసా..!

భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ కొంతమంది పరిస్థితిని అర్థం చేసుకోకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. ప్రజలు యొక్క రక్షణను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఎంత కఠినమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ ఇలాంటివి అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.

లాక్ డౌన్ లో వినూత్నమైన చర్య చేపట్టిన బెంగళూరు పోలీసులు, ఇంతకీ ఏంచేసారో తెలుసా..!

అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను పోలీసులు కఠినంగా శిక్షంచడమే కాకుండా వాహనదారులను కొట్టిన వీడియోలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా చేస్తున్న పోలీసులపై కొంత వ్యతిరేఖ చర్య కూడా ఉంది.

లాక్ డౌన్ లో వినూత్నమైన చర్య చేపట్టిన బెంగళూరు పోలీసులు, ఇంతకీ ఏంచేసారో తెలుసా..!

పోలీసులు కొట్టడం వల్ల దీనికి ప్రజలు వ్యతిరేఖంగా ఉండటం వల్ల, పోలీసులు కొత్త చర్యలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భాగంగా వాహనాలను జప్తు చేసి జరిమానా విధించారు. అంతే కాకుండా వీరిపై కేసులు కూడా బుక్ చేయడం జరిగింది.

వీటన్నిటి కంటే కొంత వ్యతిరేఖంగా మరియు ప్రజలలో కొంత అవగాహన కల్పించడానికి కొరోనా వైరస్ హెల్మెట్ ధరించి విన్నూత ప్రదర్శనలు చేసారు. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విధంగా కొద్ది రోజుల క్రితం తమిళనాడు పోలీసులు కూడా ఇటువంటి చర్యనే అమలు చేసారు. దీనినే కర్ణాటక పోలీసులు కొంత విభిన్నంగా చేశారు.

లాక్ డౌన్ లో వినూత్నమైన చర్య చేపట్టిన బెంగళూరు పోలీసులు, ఇంతకీ ఏంచేసారో తెలుసా..!

కర్ణాట పోలీసులు చేసినా ఈ చర్య చూడటానికి చాలా సరదాగా ఉంటుంది కానీ మరణ భయాన్ని మాత్రం చూపిస్తుంది. ప్రజల్లో అవగాహన పెంచడానికి పోలీసులు విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లాక్ డౌన్ లో వినూత్నమైన చర్య చేపట్టిన బెంగళూరు పోలీసులు, ఇంతకీ ఏంచేసారో తెలుసా..!

వీడియోలో పోలీసులు కరోనా వైరస్ వంటి హెల్మెట్ ధరించారు. అప్పుడు ఒక యువకుడు బైక్ మీద వస్తాడు. కరోనా హెల్మెట్‌తో ఉన్న ఒక పోలీసు అతని వెనుక కూర్చున్నాడు. ఇంకొక పోలీస్ చావు గంట కొడతారు. కరోనా వైరస్ ఉన్నప్పుడు ఇంటి నుండి వాయతికి వస్తే మరణానికి కారణమవుతుందని పోలీసులు ఈ విధంగా చేసారు.

లాక్ డౌన్ లో వినూత్నమైన చర్య చేపట్టిన బెంగళూరు పోలీసులు, ఇంతకీ ఏంచేసారో తెలుసా..!

ఈ వీడియో చూసిన తర్వాత కూడా ప్రజలు ఇల్లు వదిలి వెళ్ళే అవకాశం తక్కువ ఉంది. పోలీసులు లాఠీ రుచి చూపించకుండా కొత్త రకమైన చర్య చేపట్టడం వల్ల ప్రజలలో ఎక్కువ అవగాహన కల్పించినట్లు కూడా అవుతుంది.

Most Read Articles

English summary
Bangalore police creates Corona Virus awareness. Read in Telugu.
Story first published: Thursday, April 2, 2020, 13:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X