Viral Video ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే కారులో Dash Camను అమర్చుకుంటారు..!!

ప్రస్తుతం అందుబాటులో వస్తున్న కార్లు అనేక సౌకర్యాలు, భద్రతా ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. కార్లలో ఉన్న కొన్ని రకాల డివైస్‌లు ప్రతిరోజు ఉపయోగపడకపోవచ్చు కానీ వాటి అవసరం ఎప్పుడో ఓసారి కచ్చితంగా వస్తుంది. అలాంటి వాటిలో డ్యాష్ క్యామ్‌ ఒకటి (Car Dash cam). ఈ కెమెరా కారణంగా ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.

ఈ తాజా ఘటన బెంగళూరులో జరిగింది. ఓ దొంగ బారి నుంచి తనను తాను కాపాడుకొనేందుకు కారు డ్యాష్‌ కెమెరా ఉపయోగపడింది. ఈ వీడియోను బెంగళూరు సిటిజన్ మూవెంట్‌ అనే X (ట్విట్టర్‌) హ్యాండిల్‌ను పోస్టు అయింది. 31 సెకన్లపాటు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. డ్యాష్‌ కెమెరా ఎంత ఉపయోగమో ఈ సంఘటన పెద్ద ఉదాహరణ.

bangalore car dash cam video viral

బెంగళూరులోని రాత్రి సమయంలో ఇరుకైన రోడ్డుపై వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి. రాత్రి కావడంతో ఆ ప్రాంతంలో సరైన వెలుతురు కూడా లేదు. లైట్లు కూడా అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. అలా ఓ కారు కొంచెం వేగంగా దూసుకెళ్తోంది. అయితే ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి చేతిలో రాయి పట్టుకొని అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చాడు. దీంతో అప్రమత్తం అయిన కారు డ్రైవర్‌ వాహనం వేగాన్ని తగ్గించాడు.

ఆ వ్యక్తిని సరిగా గమనిస్తే.. ఆ రాయితో కారుపై దాడి చేసి వాహనంలోని వ్యక్తుల దగ్గర దొంగతనం చేయాలనే ప్రయత్నంగా కనిపిస్తోంది. అయితే కారు వైపు అలా చూసిన సదరు వ్యక్తి.. వాహనంలో డ్యాష్‌ క్యామ్‌ను గుర్తించడాన్ని మనం గమనించవచ్చు. దీంతో నెమ్మదిగా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియో అంతా డ్యాష్‌ క్యామ్‌లో రికార్డు అయింది.

thief holding a stone and stops car in bengalore

ఈ ఘటన అక్టోబర్‌ 9వ తేదీన సాయంత్రం 6:40 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే సదరు వ్యక్తి ట్విట్టర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోడ్లుపై లైట్లు సరిగా లేవని, పెట్రోలింగ్ పెంచాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బెల్లందూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలోనే జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన ఆధారంగా డ్యాష్‌ కెమెరా ఎంతో ఉపయోగమో తెలుస్తోంది. ఈ కెమెరాను దొంగతనం చేసేందుకు వచ్చిన వ్యక్తి గమనించకుంటే.. ఆ కారులోని వ్యక్తులపై దాడి చేసే అవకాశం ఉండేది. ఈ కెమెరా వల్ల చాలా ఉపయోగం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. కారణం ఏంటనేది తెలిసే అవకాశం కూడా ఉంటుంది.

సాధారణంగా మహిళలు నడిపై కార్లనే దొంగలు ఎక్కువగా టార్కెట్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటన బారిన పడకుండా డ్యాష్‌ కెమెరా ఉపయోగపడనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇటువంటి కెమెరాల అందుబాటులో ఉన్నాయి. పార్కింగ్‌ చేసినప్పుడు సేఫ్టీ ఫీచర్‌గా కూడా ఉపయోగపడతాయి. ఈ కెమెరాలను గుర్తించకుండా ప్రయాణికులపై ఎవరైనా దాడిచేసినా.. ఘటన అనంతరం సులభంగా పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, October 12, 2023, 11:11 [IST]
English summary
Bangalore robber with stone stops car and backs after seeing dash cam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+