ఆర్‌టిఓ అధికారులు సీజ్ చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన బైక్; పూర్తి వివరాలు

భారతదేశంలో మాడిఫైడ్ బైకులు మరియు మాడిఫైడ్ కార్లు ఎక్కువయ్యాయి. అయితే ఇవన్నీ చట్ట బద్దం కాదు. మాడిఫైడ్ వాహనాలు ఖచ్చితంగా సంబంధిత ఆర్‌టిఓ పర్మిషన్ తీసుకుని ఉండాలి. అవి కూడా నిర్దేశించిన నియమాలను తప్పకుండా పాటించాలి. లేకుంటే వాటిని తప్పకుండా సీజ్ చేయడం జరుగుతుంది. ఇటీవల ఒక బైక్ ఈ విధంగానే సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

ఆర్‌టిఓ అధికారులు సీజ్ చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన బైక్

నివేదికల ప్రకారం ప్రపంచ రికార్డు కోసం రూపొందించిన ఒక పొడవైన మాడిఫైడ్ బైక్‌ను బెంగళూరు సిటీ ఆర్‌టిఓ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోడిఫైడ్ మోటార్ సైకిల్ 13 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంది. ఈ మాడిఫైడ్ బైక్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఆర్‌టిఓ అధికారులు సీజ్ చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన బైక్

ఇది చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. ఆ బైక్‌ను అధికారులు స్వాధీనం చేసుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇది నియమాలకు అనుగుణంగా మాడిఫైడ్ చేయబడలేదు. భారతదేశంలో వాహన సవరణ చట్టవిరుద్ధం. ఇంకా కొందరు వ్యక్తులు ఈ నిబంధనను ఉల్లంఘించి తమ వాహనాలను మాడిఫై చేసుకుంటున్నారు.

ఆర్‌టిఓ అధికారులు సీజ్ చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన బైక్

ఈ బైక్ ఇప్పుడు సంబంధిత అధికారులు సొంతం చేసుకున్నారు. అయితే నియమాలను ఉల్లంఘించినందుకు వీరు తప్పకుండా జరిమానా విధిస్తారు. ఈ వాహనాన్ని బెంగళూరుకు చెందిన జాకీర్ ఖాన్ రూపొందించారు. అతను తన ద్విచక్ర వాహనాల మెకానిక్ షాప్ లో ఈ బైక్‌ను అభివృద్ధి చేశాడు.

ఆర్‌టిఓ అధికారులు సీజ్ చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన బైక్

జాకీర్ ఖాన్ బైక్ ను గిన్నిస్ రికార్డు కోసం తయారు చేసినట్లు తెలిసింది. ఈ బైక్ లో అదనపు పరికరాలు కూడా ఉన్నాయి. ఇటివంటి సూపర్ స్పెషల్ బైక్‌ను రవాణా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ను మాడిఫైడ్ చేయడం వల్ల అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు.

ఆర్‌టిఓ అధికారులు సీజ్ చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన బైక్

అయితే కొన్ని నిబంధనల ప్రకారం ప్రైవేట్ పార్కింగ్, వర్క్‌షాప్, ఆటోమొబైల్ డిస్‌ప్లే, ప్రైవేట్ రోడ్ మరియు రేసింగ్ ట్రాక్ ఉన్న వాహనాలను జప్తు చేయరాదనే నియమం ఉంది. భారతదేశంలో సిలికాన్ సిటీ ఫేమ్ కార్యక్రమం బెంగళూరులో జరిగింది. ఆర్టీఓ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయానికి వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌టిఓ అధికారులు సీజ్ చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన బైక్

మోటార్ వాహన చ్ఛత్తం ప్రకారం ఇలాంటి మాడిఫైడ్ వాహనాలు పబ్లిక్ రోడ్డుపై తిరిగే సమయంలో మాత్రమే వాటిని చట్ట విరుద్ధంగా భావించి వాటిని జప్తుచేయడం జరుగుతుంది. ఈ నియమం బైక్‌లకు మాత్రమే కాకుండా కార్లకు కూడా వర్తిస్తుంది. ఏదైనా సవరించిన వాహనం ప్రజా రహదారిపై ప్రయాణించడం చట్టవిరుద్ధం.

ఆర్‌టిఓ అధికారులు సీజ్ చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన బైక్

సంబంధిత అధికారుల ఆమోదం లేని సమయంలో మాడిఫైడ్ వాహనాలు పబ్లిక్ రోడ్లపై ఉపయోగించరాదు. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్న బైక్ ఇలాంటి చట్టవిరుద్ధంగా పబ్లిక్ రోడ్డులో ప్రయాణించ్చలేదు. అయినప్పటికీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, దీనిని తయారుచేసిన జాకీర్ ఖాన్ చేప్పాడు.

ఆర్‌టిఓ అధికారులు సీజ్ చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన బైక్

అంతే కాకుండా తాను తాయారుచేసుకున్న ఈ బైక్ తిరిగి ఇవ్వాలని కోరాడు. అతను తన బైక్ యొక్క ప్రపంచ రికార్డు వీడియోను ఆర్‌టిఓ కమిషనర్ శివకుమార్ దృష్టికి కూడా తీసుకుని వచ్చాడు. ఈ బైక్ తయారుచేయడానికి అతనికి దాదాపు 6 లక్షల వరకు ఖర్చు అయినట్లు అతడు తెలిపాడు.

ఈ మాడిఫైడ్ బైక్ యొక్క అసలు బైక్ బజాజ్ అవెంజర్. జాకీర్ ఖాన్ బజాజ్ అవెంజర్ బైక్ ని 13 అడుగుల పొడవైన బైక్‌ను డిజైన్ చేశారు. ఈ బైక్‌లో 220 సీసీ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. అయితే ఇందులో బైక్ టైర్ మరియు చాసిస్ వంటివి మాడిఫైడ్ చేయడం జరిగింది. ఈ బైక్ లో 50 లీటర్ల సామర్థ్యం కలిగిన భారీ ఇంధన ట్యాంక్ అమర్చబడి ఉంటుంది.

ఆర్‌టిఓ అధికారులు సీజ్ చేసిన ప్రపంచంలోనే అతి పొడవైన బైక్

ఈ బైక్ మొత్తం బరువు 450 కేజీలు. ఈ బైక్ బరువు చిన్న కారు కంటే తక్కువ. అన్ని ప్రత్యేకతలతో కూడిన బైక్‌ను బెంగళూరు నగరంలో ఆర్‌టిఒ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాడిఫైడ్ వాహనాలపై ఆర్టీఓ అధికారులు చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ బైక్ తిరిగి జాకీర్ ఖాన్ కి ఇస్తారా లేకపోతే ఏదైనా చర్య తీసుకుంటారా అనే విషయం ఇంకా తెలియరాలేదు.

Image Courtesy: Dr-Zakir Khan And Ruptly

Most Read Articles

English summary
Bangalore rto officials seizes modified chopper bike designed for world record details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X