బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా పారిపోయిన విమానం చాలా పవర్‌ఫుల్‌.. ఇలాంటివి ప్రతీ దేశంలోనూ ఉంటాయి!

బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు ఆమెను దేశం విడిచి వెళ్లేలా చేశాయి. గత రెండు వారాలుగా ప్రపంచ దేశాలన్నీ బంగ్లాదేశ్ వైపు చూస్తున్నాయి. ఇంకా ఆ రాష్ట్రంలో పరిస్థితిని అదుపు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో ప్రతిపక్షంలో ఉన్న బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీకి చెందిన మహమ్మద్‌ యూనస్ తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే విపరీతమైన వ్యతిరేకతల మధ్య ఉన్న జనాలకు చిక్కకుండా షేక్ హసీనా తప్పించుకున్న తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అయితే ఆమె తప్పించుకునేందుకు వినియోగించిన విమానం గురించి ఇప్పుడు ఎక్కువ మంది వెతుకుతున్నారు. అంత సులువుగా ఆమె ఎలా తప్పించుకున్నారనే ప్రశ్న జనాలను వెంటాడుతోంది. అయితే ఆమె అత్యాధునిక విమానాన్ని ఉపయోగించి తప్పించుకున్నట్లు సమాచారం. ఆ విమానంతో ప్రత్యేక సందర్భాల్లో సులువుగా, వేగంగా ప్రయాణించవచ్చు. ఇంతకు ఆ విమానం పేరు ఏమిటి దాని ప్రత్యేకతలు ఈ కథనంలో..

Sheikh-Hassina-Prime-Minister

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విమానాలు ప్రయాణించే విధానాలను ట్రాక్ చేయడానికి అనేక సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఆందోళనలను ఉధృతం అవుతుండటంతో ఆమె AJAX1431 కోడ్‌ గల దేశ వైమానిక దళానికి చెందిన అత్యంత పవర్‌ఫుల్‌ సీ-130 జే హెర్క్యూలస్ (C-130J Hercules) విమానంలో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. వెంటనే అందుబాటులోని టెక్నాలజీ ఆధారంగా ఆమె విమానాన్ని ట్రాక్ చేయడం ప్రారంభించారు.

ఈ C-130J హెర్క్యూలస్ మధ్యాహ్నం సమయంలో బంగ్లాదేశ్ నుంచి బయలుదేరి కోల్‌కతా వైపు వెళ్తున్నట్లు చూపించింది. ఆ తర్వాత 5 గంటలకు లక్నో మీదుగా 5:30 నిమిషాలకు న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ఆ తర్వాత విమానంలో ఎటువంటి కదలికలు గమనించలేదు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఆమె భారత్‌లోనే ఉన్నట్లు భావిస్తున్నారు.

Sheikh-Hasina-Escape-On-Flight-AJAX1431

సీ-130జే హెర్క్యూలస్: ఆమె ప్రయాణిస్తున్న సీ-130జే హెర్క్యూలస్ విమానం అత్యాధునిక విమానం. ఈ విమానం గంటకు 670 కిలోమీటర్ల వేగంతో 362 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. ఇది వివిధ కార్యకలాపాలకు, ముఖ్యంగా శత్రువులకు తెలియకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వేగంగా ప్రయాణించడానికి ఉపయోగిస్తారు. ఒక్కసారి టేకాఫ్ అయిన తర్వాత ఈ విమానం 1600 నాటికల్ మైళ్లు (2963 కిలోమీటర్లు) ప్రయాణించగలదు.

సీ-130జే విమానంలో 92 మంది ప్రయాణికులు లేదా 64 ఏరో బృందాలు ప్రయాణించవచ్చు. అదేవిధంగా 20 టన్నుల సరుకును కూడా రవాణా చేయవచ్చు. ఇందులో డిజిటల్ ఏవియానిక్స్, అడ్వాన్స్ డ్ నావిగేషన్ సిస్టమ్, గ్లాస్ కాక్ పిట్ ఉన్నాయి. అంతేకాక, ఎవరికైనా వైద్య సహాయం అవసరమైతే ఈ విమానాలను ఉపయోగిస్తారు. దేశంలో వరద బాధితులకు సహాయక సామగ్రిని పంపిణీ చేయడానికి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు.

బంగ్లాదేశ్‌లో ఏం జరిగింది?: ప్రభుత్వ ఉద్యోగాల్లో వివాదాస్పద రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ లో విద్యార్థి సంఘాలు గత నెల నుంచి ఆందోళన చేస్తున్నాయి. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారి బంగ్లాదేశ్ మొత్తాన్ని ప్రభావితం చేశాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 13, 2024, 10:26 [IST]
English summary
Bangladesh ex prime minister sheikh hasina escaped on flight ajax1431 from dhaka details
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+