కోట్లు విలువ చేసే లగ్జరీ బస్సులో ఒబామా 'బస్సు యాత్ర'

Obama Bus Tour
ఆర్థిక మాంద్యం కారణంగా సతమతమవుతున్న అమెరికన్ వాసులకు అభయ హస్తాన్ని ఇచ్చి తన రేటింగ్‌ను పెంచుకునేందుకు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా నానా తంటాలు పడుతున్నారు. ఇందులో భాగంగా మన దేశ నాయకుల మాదిరిగానే ఒబామా కూడా వాడవాడలా తిరిగి ప్రజలను కలుసుకునేందుకు బస్సు యాత్ర చేపట్టారు. అయితే, ఈ బస్సు సాధారణ బస్సుల లాంటిది కాదండోయ్...! ఎంతైనా అమెరికా అధ్యక్షుడు కదా.. ఆయన హోదాకు మరియు రక్షణకు తగినట్లుగానే ఈ విలాసవంతమైన బస్సును రూపొందించారు.

ప్రస్తుతం బరాక్ ఒబామా ఉపయోగిస్తున్న పొడవాటి అధ్యక్ష కారు (క్యాడిలాక్) మాదిరగానే ఈ బస్సును కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ బస్సులో ఓ మీటింగ్ రూమ్, ఒక రెస్ట్ రూమ్, బ్లడ్ బ్యాంక్, ఆహారాన్ని అందించేందుకు చిన్న పాటి ప్యాంట్రీ వంటి ఎన్నో వసతులు ఉన్నాయి. ఇందులో శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉంది. చెప్పడం అవసరం లేకపోయినా ఈ బస్సు కూడా ది బీస్ట్ (ఒబామా వాడే కారు ముద్దు పేరు) మాదిరిగానే బాంబ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, కెమికల్ అటాక్ ప్రూఫ్, పంక్చర్ ప్రూఫ్ టైర్లతో అధ్యక్షుడిని అత్యంత భధ్రంగా రక్షిస్తుంది.

ఈ బస్సును కెనడాకు చెందిన మోటార్ కోచ్ బిల్డర్ ప్రెవోస్ట్ కంపెనీ రూపొందించగా, ఇందులోని ఇంటీరియర్లను నాష్‌విల్లేకు చెందిన హెమ్‌ఫిల్ బ్రదర్స్ కో డిజైన్ చేసింది. మరి ఈ బస్సు ధర ఎంతో తెలుసా కేవలం 1.1 మిలియన్ (11 లక్షలు) అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన దేశ కరెన్సీలో సుమారు ఐదు కోట్ల రూపాయాలు అన్నమాట. ఇలాంటిదే మరొక బస్సు అమెరికా సీక్రెట్ సర్వీస్ వద్ద ఉన్నట్లు సమాచారం. దీనిని 2012లో రిపబ్లికన్ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే వారికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఒబామా ఈ బస్సులో వెళ్తున్నప్పుడు అతని కాన్వాయ్‌లో దాదాపు రెండు డజన్లకు పైగా వాహానాలు ఈ బస్సుకు ముందు మరియు వెనుక ఫాలో అవుతుంటాయి. మరి ఒబామానా మజాకా..!!

More from DriveSpark

Article Published On: Friday, August 19, 2011, 18:19 [IST]
English summary
US president Barack Obama has a new vehicle in his parking lot. a sparkling black bus that will carry the US President in his nationwide tour. The bus built by a Canadian coach builder is very much similar to the Cadillac limousine used by Obama. The bus costs a whopping $1.1 million (nearly Rs.5 Crores) and is equipped with puncture proof tyres. It is also bullet proof and bomb proof.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+