డీజిల్‌కు బదులు పెట్రోల్: రిపేరుకొచ్చిన ఒబామా కారు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కారు గుర్తుందా..? పొడవాటి ఈ క్యాడిలాక్ లీమోజైన్ ఇప్పుడు షెడ్డుకొచ్చింది. ఈ కారులో ఎవరో డీజిల్‌కు బదులు పెట్రోల్ నింపారు. దీంతో ఇంజన్ స్టార్ట్ కాలేదు. బరాక్ ఒబామా ఇజ్రాయిల్‌ పర్యటన నిమిత్తం, అధ్యక్షుడి కంటే ముందుగానే ఈ కారును ఇజ్రాయిల్‌కు తీసుకువచ్చారు. అయితే, దీని ఇంజన్ ఆన్ కాకపోవటంతో తక్షణమే జోర్డాన్ ఇలాంటిదే మరొక అధ్యక్ష వాహనాన్ని విమానంలో తెప్పించారు. కారు చెడిపోయే సమయంలో ఒబామా కారులో లేనట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టులో దిగిన ఒబామా కొసం జోర్డాన్ నుంచి తెప్పించిన మరొక క్యాడిలాక్ లీమోను అక్కడ ఉంచారు.

మాములుగా ఈ కారు డీజిల్ ఇంధనంతోనే నడుస్తుంది. అయితే, దాని స్థానంలో పెట్రోల్‌ను నింపే సరికి, ఫ్యూయెల్ ట్యాంకులో పెట్రోల్, డీజిల్ రెండూ కలిసిపోయి ఇంజన్ పనిచేయటం ఆగిపోయింది. డైలీ మిర్రర్ రిపోర్ట్ ప్రకారం, ఈ సాయుధ వాహనంలో కొన్ని యాంత్రిక సమస్యలు తలెత్తాయని, అందుకే అధ్యక్షుడితో తమ అన్ని ప్రయాణాల్లో బహుళ వాహనాలను, ఓ మెకానిక్‌ను వెంట తీసుకొని వెళ్తుంటామని సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఎడ్విన్ డొనొవాన్ తెలిపారు. బోరుకొచ్చిన చెవర్లే క్యాడిలాక్ లీమోజైన్‌ను ఎలా పికప్ ట్రక్కుపై ఎక్కించుకొని వెళ్తున్నారో మీరే చూడండి.

డీజిల్‌కు బదులు పెట్రోల్ పోశారు; రిపేరుకొచ్చిన ఒబామా కారు

డీజిల్‌కు బదులు పెట్రోల్ పోశారు; రిపేరుకొచ్చిన ఒబామా కారు

ఒబామా ఇజ్రాయిల్‌లో పర్యటిస్తున్నప్పుడు ఎవరో ఈ కారులో డీజిల్‌కు బదులు పెట్రోల్ నింపారు. దాంతో ఈ కారు మార్గమధ్యంలోనే ఆగిపోయింది.

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

మాములుగా ఈ కారు డీజిల్ ఇంధనంతోనే నడుస్తుంది. అయితే, దాని స్థానంలో పెట్రోల్‌ను నింపే సరికి, ఫ్యూయెల్ ట్యాంకులో పెట్రోల్, డీజిల్ రెండూ కలిసిపోయి ఇంజన్ పనిచేయటం ఆగిపోయింది.

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

ఇజ్రాయిల్‌లో టెల్ అవివ్‌కు ఒబామా తన తొలి పర్యటన చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మార్గమధ్యం లోనే కారు చెడిపోవటంతో ఒబామా రోడ్డుపైనే కారు దిగి వేరొక కారులోకి మారాల్సి వచ్చింది.

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బోరుకొచ్చిన చెవర్లే క్యాడిలాక్ లీమోజైన్‌ను ఎలా పికప్ ట్రక్కుపై ఎక్కించుకొని వెళ్తున్నారో మీరే చూడండి.

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

అమెరికా సైన్యం ముద్దుగా ది బీస్ట్ (దెయ్యం) అని పిలుచుకునే ఈ అత్యంత సురక్షితమైన, సాయుధ మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్యాడిలాక్ లీమోజైన్‌ను అమెరికా అధ్యక్షుడి కోసం జనరల్ మోటార్స్ ప్రత్యేకంగా కస్టమైజ్ చేసింది.

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్, కెమికల్ ప్రూఫ్. రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించే శక్తివంతమైన పేలుడు పదార్థాలను సైతం ఇది ఎదుర్కోగలదు. కారు చుట్టపక్కల హ్యాండ్ గ్రనేడ్ విసిరినా కూడా కారులోని ప్రయాణికులకు ఎలాంటి హాని జరగదు.

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్క బటన్ నొక్కడం ద్వారా అధ్యక్షుడి చుట్టూ 10 అంగుళాల మందం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ ద్వారాలు తెరచుకొని ఆయన చుట్టూ రక్షణగా నిలుస్తాయి. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ప్రమాదంలో గాయపడిన అధ్యక్షుడికి అత్యవసరంగా రక్తాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కారులో అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని కూడా స్టోర్ చేసి ఉంచుతారు

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్

బరాక్ ఒబామా క్యాడిలాక్ లీమోజైన్


అమెరికా సైన్యం ముద్దుగా ది బీస్ట్ (దెయ్యం) అని పిలుచుకునే ఈ అత్యంత సురక్షితమైన, సాయుధ మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్యాడిలాక్ లీమోజైన్‌ను అమెరికా అధ్యక్షుడి కోసం జనరల్ మోటార్స్ ప్రత్యేకంగా కస్టమైజ్ చేసింది. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్, కెమికల్ ప్రూఫ్. రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించే శక్తివంతమైన పేలుడు పదార్థాలను సైతం ఇది ఎదుర్కోగలదు. కారు చుట్టపక్కల హ్యాండ్ గ్రనేడ్ విసిరినా కూడా కారులోని ప్రయాణికులకు ఎలాంటి హాని జరగదు.

ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్క బటన్ నొక్కడం ద్వారా అధ్యక్షుడి చుట్టూ 10 అంగుళాల మందం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ ద్వారాలు తెరచుకొని ఆయన చుట్టూ రక్షణగా నిలుస్తాయి. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ప్రమాదంలో గాయపడిన అధ్యక్షుడికి అత్యవసరంగా రక్తాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కారులో అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని కూడా స్టోర్ చేసి ఉంచుతారు. సుమారు మూడు టన్నుల బరువు ఉండే ఈ నలుపు రంగు కాడిలాక్ కారు గంటకు 60 మైళ్ల వేగంతో (గంటకు 96.5 కి.మీ.) ప్రయాణిస్తుంది.

అమెరికా గూఢచార సంస్థ (సీఐఏ)కు చెందిన నిపుణుడైన ఏజెంట్ ఈ కారును డ్రైవ్ చేస్తాడు. ప్రమాదంలో కారు టైర్లు పేలిపోయినా వాహనం మాత్రం ఆగకుండా దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇంకా ఈ కారులో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. జస్ట్ ఈ కారు వెనుక సీటులో కూర్చునే ఒబామా ప్రపంచంలో ఏ మూల నుంచైనా అమెరికాను పాలించే వెసులుబాటు ఉంటుంది. లాప్‌టాప్, వైర్‌లెస్ ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఎల్లప్పుడూ అమెరికాలోని వైట్‌హౌస్‌కు కనెక్ట్ చేయబడి ఉంటాయి. మన దేశ కరెన్సీలో ఈ కారు ధర సుమారు రూ.2.6 కోట్లకు పైమాటే.

More from DriveSpark

Article Published On: Thursday, March 21, 2013, 16:38 [IST]
English summary
US President Barack Obama's Cadillac limousine car limo broke down during his visit to Israel after somebody filled it up with petrol instead of diesel.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+