Bath on Scooter మీరెక్కడ దొరికారు రా సామీ.. స్కూటర్లపై నడిరోడ్డులో స్నానం.. ఫన్నీ వీడియోలు మీకోసం

ప్రస్తుత సమాజంపై సోషల్‌ మీడియా ప్రభావం చాలా ఉంది. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియాలో వింత తరహా సంఘటనలను షేర్‌ చేసుకుంటున్నారు. ఫేమస్‌ అయ్యేందుకు వింత చేష్టలకు పాల్పడుతున్నారు. వాటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే మరికొన్ని వెగటు పుట్టిస్తున్నాయి. తాజాగా ఓ జంట బైక్‌పై వెళ్తూ అసభ్యకరంగా హగ్‌ చేసుకుంటూ కనిపిస్తే.. మరికొంతమంది ఎండ వేడిమి తట్టుకోలేక స్కూటర్‌లపై వెళ్తూ చేసిన పని నవ్వు తెప్పిస్తోంది.

మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో స్కూటర్‌పై ఓ జంట వెళ్తూ స్నానం చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ సంఘటనను తోటి వాహనదారుడు రికార్డు చేసి ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ముందు కూర్చుని భర్త డ్రైవింగ్‌ చేస్తుండగా వెనుక సీట్లో కూర్చున్న భార్య మధ్యలో బకెట్‌ పెట్టుకుని మగ్గు సాయంతో ఒంటిపై తమ ఇద్దరికీ నీళ్లు పోస్తున్న దృశ్యాలు వీడియోలో చూడవచ్చు. ఇదంతా స్కూటర్‌ రన్నింగ్‌లో ఉండగానే జరుగుతోంది.

Bath on Scooter

ఆ జంటపై స్కూటర్‌పై స్నానం చేస్తుండగా.. రోడ్డుపై ఉన్నవారు వారి చేష్టలను వింతగా చూస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. నడిరోడ్డుపై వాహనదారులకు ఇబ్బంది కలిగేలా ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ట్యాగ్‌ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ సంఘటనపై సంబంధిత పీఎస్‌కు పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. కానీ దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.

కాగా వీరు స్కూటర్‌పై వెళ్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించలేదు. కనీసం హెల్మెట్‌ కూడా పెట్టుకోలేదు. ఈ ఘటనలో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కూడా కనపడుతోంది. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించలేదు. పబ్లిక్‌ రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేయడం తీవ్ర సంఘటనలకు దారితీస్తుంది. పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా, ఇతరుల భద్రతకు ముప్పును కలిగిస్తుంది.

Bath on Scooter

తాజాగా తమిళనాడులోని తంజావూరు వీధుల్లోనూ ఇలాంటి వింత సంఘటన చోటుచేసుకుంది. స్కూటర్‌పై వెళుతున్న వ్యక్తి స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను తన స్నేహితుడు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరిపై తమిళనాడు పోలీసులు రూ.2,000 చొప్పున జరిమానా విధించారు.

ఈ వీడియోలో షర్ట్, హాఫ్ ప్యాంట్ ధరించిన ఒక వ్యక్తి స్కూటర్‌ను నడుపుతూ, బకెట్ నిండా నీళ్ళు మరియు మగ్‌ని తీసుకువెళుతున్నాడు. వీడియో సాగుతుండగా, వ్యక్తి ఒక చేత్తో తన ఒంటిపై నీరు పోసుకుని, మరో చేత్తో తన స్కూటర్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈ ఘటనను తన స్నేహితుడు వీడియో తీస్తున్నాడు.

వీడియో వైరల్ కావడంతో, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేశారు. వీడియోలో ఉన్న యువకుడు అరుణాచలం అని వీడియోను చిత్రీకరించిన వ్యక్తి ప్రసన్న అని గుర్తించారు. ప్రమాదకరంగా ప్రయాణించి ఇతర ప్రయాణికులకు విఘాతం కలిగించినందుకు ఇద్దరికీ జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలుల పరిస్థితుల ప్రభావాన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశంతోనే వీరు ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పవచ్చు.

నిబంధనలు ఉల్లంఘించినవారికి జైలు శిక్ష, జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఔత్సాహికులు ఇలాంటి విన్యాసాలు చేయాలి అనుకున్నప్పుడు.. ప్రైవేట్ రేస్ ట్రాక్‌లు లేదా ఫామ్‌హౌస్‌ల వంటి నిర్దేశిత ప్రాంతాల్లో చేయడం ఉత్తమం. ఇలా పబ్లిక్‌ ప్రాంతాల్లో విన్యాసాలలో పాల్గొనడం చాలా ప్రమాదకరం.

మెట్రోపాలిటన్ నగరాల్లో, CCTV కెమెరాల యొక్క సమగ్ర నెట్‌వర్క్ ఇప్పుడు అమలులో ఉంది, దీనిని ప్రత్యేక పోలీసు సిబ్బంది బృందం నిశితంగా పర్యవేక్షిస్తుంది. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ట్రాక్ చేయడం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడంలో ఈ కెమెరాలు సహకరిస్తాయి. రహదారి భద్రతను ప్రోత్సహించడానికి మరియు ఉల్లంఘనలను అరికట్టడానికి, ప్రభుత్వం మరియు అధికారులు ఇటీవల ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెరిగిన జరిమానాలను అమలు చేశారు.

More from DriveSpark

Article Published On: Friday, May 19, 2023, 19:06 [IST]
English summary
Bath on scooters visuals gone viral full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+