వీడియో: ట్రైక్ నడుపుతూ కెమెరాకి చిక్కిన బ్యాట్‌మ్యాన్
రీల్ లైఫ్‌లో కనిపించే బ్యాట్‌మ్యాన్ రియల్ లైఫ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. వినడానికి చిత్రంగా ఉన్న జపాన్‌లో మాత్రం ఇలాంటి చోద్యమే చోటు చేసుకుంది. బ్యాట్‌మ్యాన్ వేషం వేసుకొని ఓ ట్రైక్ (మోటార్‌సైకిల్ మాదిరిగా ఉండే ఓ మూడు చక్రాల వాహనం)తో హైవే పరుగులు తీస్తుండగా, పక్కనే వెళ్తున్న మరో మోటార్‌సైక్లిస్ట్ తన కెమెరాలో ఈ దృశ్యాన్ని బంధించాడు.
వాస్తవానికి బ్యాట్‌మ్యాన్ క్యారెక్టర్, అతను నడిపే వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్న విషయం మనందరికీ తెలిసినదే. బ్యాట్‌మ్యాన్ అన్నా అతని నడిపే భారీ వాహనాలన్నా పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఎంతో మక్కువ. ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒకచోట చాలా మంది బ్యాట్‌మ్యాన్ దుస్తులు ధరించి సంతోషం పొందుతుంటారు.
మరికొందరైతే, ఏకంగా బ్యాట్‌మొబైల్ (బ్యాట్‌మ్యాన్ ఉపయోగించే వాహనాలు) నుంచి స్ఫూర్తి కస్టమైజ్డ్ వాహనాలను కూడా తయారు చేసేస్తుంటారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కూడా అలాంటి బ్యాట్‌మ్యాన్ అభిమానే ఇలా దస్తులు ధరించి, ప్రత్యేకంగా తయారు చేసిన ఓ ట్రైక్‌పై తన సరదా తీర్చుకున్నాడు. మరి మనం కూడా ఆ వీడియోని చూసేద్దామా..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/ElDZ3ZPgflQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








