2022 బడ్జెట్‌లో 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ'కి గ్రీన్ సిగ్నెల్: పూర్తి వివరాలు

భారతదేశపు ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు ప్రకటించిన బడ్జెట్‌లో బ్యాటరీ మార్పిడి విధానాన్ని ప్రకటించారు. బడ్జెట్‌లో ప్రకటించిన బ్యాటరీ మార్పిడికి సంబంధించిన ఈ కొత్త విధానం పర్యావరణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందించడానికి చాలా ఉపయోగపడుతుంది. రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రజలకు చాలా వినియోగదాయకంగా ఉంటుంది.

2022 బడ్జెట్‌లో 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ'కి గ్రీన్ సిగ్నెల్: పూర్తి వివరాలు

ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం పెరిగితే క్రమంగా వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా దేశంలో కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. ఇందులో భాగంగానే ప్రజా రవాణాలో క్లీన్ టెక్నాలజీ పెంచుతామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్‌ను పెంచడంలో సహాయపడుతుంది, అదే సమయంలో బ్యాటరీలకు డిమాండ్‌ను పెంచుతుంది.

2022 బడ్జెట్‌లో 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ'కి గ్రీన్ సిగ్నెల్: పూర్తి వివరాలు

బ్యాటరీలు డిమాండ్ పెరిగిన పరిస్థితిలో, ప్రపంచంలోని అనేక దేశాలలో ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి బ్యాటరీ మార్పిడి అనేది సులభమైన మరియు మెరుగైన మార్గం. దేశంలో ఎలక్ట్రిక్ వాహన విభాగం క్రమంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది.

2022 బడ్జెట్‌లో 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ'కి గ్రీన్ సిగ్నెల్: పూర్తి వివరాలు

ఎలక్ట్రిక్ వాహన వినియోగం అయితే పెరుగుతోంది, కాని వాటికి కావాల్సిన మెలిక సదుపాయాలు ఇంకా కావలసినన్ని అందుబటులోకి రాలేదు. దీనిపైన కొన్ని సంస్థలు పనిచేస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో కేంద్రం ప్రకటించిన ఈ బ్యాటరీ మార్పిడి విధానం ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి.

2022 బడ్జెట్‌లో 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ'కి గ్రీన్ సిగ్నెల్: పూర్తి వివరాలు

ఇప్పుడు ప్రకటించిన ఈ విధానం ద్వారా ఎక్కువ సంఖ్యలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ రంగం యొక్క వేగవంతమైన విస్తరణ కోసం ప్రభుత్వం మరియు ప్రైవేట్ క్లయింట్లు ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించబడతారు, తద్వారా భవిష్యత్తులో ఇది మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా అందుబాటులో ఉంటుంది. కావున దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగం క్రమంగా పెరుగుతుంది.

2022 బడ్జెట్‌లో 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ'కి గ్రీన్ సిగ్నెల్: పూర్తి వివరాలు

బ్యాటరీ స్వాపింగ్ అంటే?

బ్యాటరీ స్వాపింగ్ అనేది ఒక సులభమైన ప్రక్రియ. ఒక వాహనంలో డిస్చార్జ్ చేయబడిన ఎలక్ట్రిక్ వాహనం యొక్క బ్యాటరీని ముందుగా ఛార్జ్ చేసిన బ్యాటరీతో భర్తీ చేస్తారు. ఈరోజు భారతదేశం అంతటా చమురు నింపే స్టేషన్లు ఉన్నాయి, అదేవిధంగా మీరు భారతదేశం అంతటా బ్యాటరీ మార్పిడి స్టేషన్లను త్వరలోనే చూస్తారు.

2022 బడ్జెట్‌లో 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ'కి గ్రీన్ సిగ్నెల్: పూర్తి వివరాలు

ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ వల్ల వాహన వినియోగదారుల యొక్క సమయాన్ని చాలా వరకు ఆదా చేస్తాయి. కావున ఇది వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ బ్యాటరీ స్వాపింగ్ ఎంతైనా అవసరం ఉంది.

2022 బడ్జెట్‌లో 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ'కి గ్రీన్ సిగ్నెల్: పూర్తి వివరాలు

బ్యాటరీ స్వాపింగ్ అవసరం ఏమిటి?

సాధారణంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన వినియోగం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఛార్జింగ్ స్టేషన్స్ కావాల్సినన్ని అందుబాటులో లేదు. అయితే ఉన్న వాటిలో ఛార్జింగ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. కావున దీనిని రూపుమాపడానికి ఈ బ్యాటరీ స్వాపింగ్ అనేది ఎంతనై అవసరం. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్లగ్-ఇన్ ఛార్జర్‌లు నెమ్మదిగా ఉంటాయి మరియు ఒకేసారి ఒక వాహనాన్ని ఛార్జ్ చేయగలవు.

2022 బడ్జెట్‌లో 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ'కి గ్రీన్ సిగ్నెల్: పూర్తి వివరాలు

బ్యాటరీ మార్పిడిలో, ఒకే సమయంలో చాలా బ్యాటరీలు ఛార్జ్ చేయబడతాయి, ఒక ప్రయాణీకుడు తన ఎలక్ట్రిక్ వాహనం యొక్క బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందని భావించినప్పుడు, అతను సమీపంలోని బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ కి వెళ్లి తన బ్యాటరీని మార్చుకోవచ్చు. మీ బ్యాటరీ అక్కడ ఛార్జ్ చేయబడుతుంది.

2022 బడ్జెట్‌లో 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ'కి గ్రీన్ సిగ్నెల్: పూర్తి వివరాలు

భారతదేశంలో ప్రస్తుతం చాలా తక్కువ కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. అయితే ఇటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రక్రియ ఈ రంగంలో చాలా కంపెనీలు పుట్టుకొస్థాయి. దేశంలోని అతిపెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, బౌన్స్ వంటి కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాయి.

2022 బడ్జెట్‌లో 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ'కి గ్రీన్ సిగ్నెల్: పూర్తి వివరాలు

ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన 'బ్యాటరీ స్వాపింగ్ పాలసీ' ప్రస్తుత తరానికి చాలా అవసరం. ఇది క్రమంగా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచుతుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాలను పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే చాలా వరకు ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుపైన డిస్కౌంట్స్ మరియు రాయితీలను అందిస్తున్నాయి. ప్రభుత్వాలు చేస్తున్న ఈ విధానాలన్నీ కూడా తప్పకుండా ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచుతాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, February 1, 2022, 14:55 [IST]
English summary
Battery swapping policy announced in budget 2022 benefit details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+