వీడియో: ట్రాఫిక్ జామ్‌ను ఇలా దాటితే..!
ట్రాఫిక్ జామ్.. నగరాలను పట్టి పీడిస్తున్న పెనుభూతం. ట్రాఫిక్ జామ్‌ల వలన పిల్లలు స్కూలుకు ఆలస్యంగా వెళ్తుంటే, ఉద్యోగస్తులు ఆఫీసులకు ఆలస్యంగా వెళ్తున్నారు. పేషంట్లయితే అంబులెన్స్ వాహనాలు సరైన సమయానికి అస్పత్రి చేరుకోని కారణంగా అందులోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. మరి ఈ ట్రాఫిక్ ఇక్కట్లకు చెక్ పెట్టలేమా?
సరే ఆ సమస్య అటుంచితే, ఇప్పుడో విచిత్రమైన వీడియోని చూద్దాం రండి. ట్రాఫిక్ జామ్ అంటే చిరాకు చెందిన కొందరు వ్యక్తులు ట్రాఫిక్‌లో కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయి ఉండే వాహనాలపై తమ ప్రతాపం చూపాలనుకున్నారు (పబ్లిక్ రోడ్లపై కాదులెండి). అనుకున్నదే తడవుగా ఓ ఆఫ్-రోడర్ వాహనంలో వరుసగా లైనులో ఉంచిన కార్లపై (కార్లలో ఎవ్వరూ లేరు) నడిపేశారు.
ఇది కూడా చూడండి: అంబులెన్స్ అంటే చులకన ఎందుకు?
చూసేవారికి ఈ స్టంట్ ఏదో సినిమాల్లో చూసినట్లుగా అనిపిస్తుంది. అయితే, ఇక్కడ కేవలం ఆఫ్-రోడర్ వాహన సామర్థ్యాన్ని వివరించేందుకు, ట్రాఫిక్ జామ్‌లను ఇలాంటి వాహనాలతో ఎలా అధిగమించవచ్చనే ఉదహరించేందుకు మాత్రమే వీళ్లు ఓ క్లోజ్డ్ ప్రాంతంలో ఈ స్టంట్ చేశారు. ఇందులో ఉపయోగించిన కార్లన్నీ కూడా పనికి రానివి, పాతవి. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రాఫిక్ జామ్‌పై చిరాకు తెచ్చుకొని ఇలాంటి ప్రయత్నం మాత్రం చేయకండే.. సరదా కోసం ఈ వీడియోని చూడండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/0gGPROkwZnQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








