హాట్ 'హ్యార్లీ' భామలు: హ్యార్లీ డేవిడ్‌సన్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లంటే ఇష్టపడని మగాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. అమెరికాకు చెందిన 110 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లకు అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా అట్రాక్ట్ అవుతారు. వాస్తవానికి హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లకు అందమైన అమ్మాయిలకు ఏదో తెలియని కెనక్షన్ ఉందనే చెప్పాలి.

అమ్మాయిల వంపు సొంపుల నుంచి స్ఫూర్తి పొంది హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లను డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. మరి ఈ అందమైన అమ్మాయిలను, హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లను పక్కపక్కనే ఉంచి చూస్తే ఎలా ఉంటుంది.. ఎవరైనా కెవ్వు కేక.. అనాల్సిందే కదా..! మరి ఈ హ్యార్లీ భామలను అందాలను, ఈ టూవీలర్ కంపెనీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్ కంపెనీకు నాంది పలికింది 21 ఏళ్ల విలియమ్ ఎస్ హ్యార్లీ. సైకిల్ ఫ్రేమ్‌లో అమరే ఇంజన్‌కు ఈయన 1901లో బ్లూప్రింట్ తయారు చేశారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

విలియం ఎస్ హ్యార్లీ, ఆర్థర్ డేవిడ్‌సన్‌లు భాగస్వాములుగా ఏర్పడి 1904లో హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్ కంపెనీను ప్రారంభించారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ మొట్టమొదటి ఫ్యాక్టరీని 1904వ సంవత్సరంలో 10 x 15 అడుగులు విస్తీర్ణంలో చక్కలతో చేయబడిన నిర్మాణంలో తమ తొలి బైక్‌కు రూపకల్పన చేశారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

తొలి హ్యార్లీ డేవిడ్‌సన్‌ ఇంజన్‌లో ఉపయోగించిన మొదటి కార్బురేటర్‌ను టొమోటో క్యాన్ నుంచి తయారు చేశారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

మొట్టమొదటి హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్ సీరియల్ నెంబర్ ఒకటి. 1903వ సంవత్సరానికి చెందిన ఈ బైక్ మారు పేరు 'సైలెంట్ గ్రే ఫెలో'.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఉన్న మిల్వాకీకు చెందిన హెన్రీ మేయర్ తొలి హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను కొనుగోలు చేశారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

అమెరికాలోని చికాగోలో సి.హెచ్. లాంగ్ తొలి హ్యార్లీ డేవిడ్‌సన్ డీలర్‌షిప్‌ను 1904లో ప్రారంభించాడు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

జులై 4, 1905లో చికాగోలో జరిగిన 15 మైళ్ల రేసులో హ్యార్లీ డేవిడ్‌సన్ పాల్గొని విజయం సాధించింది. ఈ విజయంతో హ్యార్లీ డేవిడ్‌సన్ బ్రాండ్ మంచి పాపులారిటీ దక్కించుకుని, కొనుగోలుదారుల దృష్టిని ఆకట్టుకుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ 1906వ సంవత్సరంలో 6 మంది వర్కర్లతో ఓ కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. అదే సంవత్సరంలో కంపెనీ క్యాటలాగ్‌ను కూడా విడుదల చేసింది. 1910లో హ్యార్లీ డేవిడ్‌సన్ తమ ఫుల్ టైమ్ ఉద్యోగులను నియమించుకుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

వాల్టర్ డేవిడ్‌సన్ 1908 జూన్ నెలలో న్యూయార్క్ లోని క్యాట్‌స్కిల్ మౌంటైన్స్‌లో జరిగిన రెండు రోజుల రేసులో పాల్గొని 1000 పాయింట్ల స్కోరుతో విజయం సాధించాడు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

1908వ సంవత్సరంలో అమెరికాలో హ్యార్లీ డేవిడ్‌సైన్ మోటార్‌సైకిళ్లను ఉపయోగించిన తొలి పోలీస్ ఫోర్స్‌గా డెట్రాయిట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నిలిచింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ 1909వ సంవత్సరంలో తొలి వి-ట్విన్ ఇంజన్ కలిగి మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. అప్పట్లో ఈ ఇంజన్ గరిష్టంగా 7 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసేది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫేమస్ 'బార్ అండ్ షీల్డ్' లోగోను తొలిసారిగా 1910లో ఉపయోగించారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

1912లో హ్యార్లీ డేవిడ్‌సన్ మిల్వాకీలోని జునియా అవెన్యూలో నిర్మించిన 6 అంతస్థుల భవనం సంస్థ హెడ్ క్వార్టర్స్‌గా నిలిచింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

ఆ తర్వాత 1913లో హ్యార్లీ డేవిడ్‌సన్ సంవత్సరానికి 17,000 బైక్‌లను ఉత్పత్తి చేయటం ప్రారంభించింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ బట్టలను తొలిసారిగా 1914లోనే తయారు చేశారు. అయితే, అప్పట్లో రేస్ బృంద సభ్యులకు మాత్రమే ఇచ్చేవారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

1914 నుంచి 1918 మధ్య కాలంలో యుద్ధ సైనికుల కోసం సుమారు 20,000 లకు పైగా హ్యార్లీ డేవిడ్‌సైన్ బైక్‌లను తయారు చేశారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సైన్ రైడర్లు 1916లో తమ స్వంత మ్యాగజైన్‌ను పొందేవారు. 'ది హ్యార్లీ డేవిడ్‌సన్ ఎంథూసియస్ట్' అనే పేరుతో ప్రచురించబడే ఈ మ్యాగజైన్ ప్రపంచంలో కెల్లా అత్యంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా ప్రచురించబడుతున్న మ్యాగజైన్‌గా నిలిచింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిల్‌ను రైడ్ చేసిన మొట్టమొదటి మహిళ జనెట్ డేవిడ్‌సన్. ఈమె ఆర్థర్ డేవిడ్‌సన్ అత్త. ఈమె హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లపై బ్రాండ్ పేరును వ్రాయటం, పిన్ స్ట్రిప్పింగ్ చేయటంలో సాయం చేస్తుండేంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

అన్ని హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లు వి-ట్విన్‌లు కావు. 1919-1922 మధ్య కాలంలో ట్విన్ సిస్టమ్‌కు బదులుగా ఎలక్ట్రిక్ స్పోర్ట్‌ను ప్రవేశపెట్టారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

1920లో హ్యార్లీ డేవిడ్‌సన్ ప్రపంచంలో కెల్లా అత్యధికంగా మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేసే సంస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం హ్యార్లీ డేవిడ్‌సన్‌కు 67కు పైగా దేశాల్లో 2000 లకు పైగా డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

1921లో హ్యార్లీ డేవిడ్‌సన్ సగటున గంటకు 100 మైళ్లకు పైగా వేగంతో పరుగులు తీసి రేసును గెలిచిన బైక్‌గా నిలిచింది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

1925లో తయారైన అన్ని హ్యార్లీ డేవిడ్‌సన్ బైకులు టియర్ డ్రాప్ షేపులో ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ కలిగి ఉండేవి. అనేక కస్టమైజేషన్ బైక్‌లలోను ఈ డిజైన్ అత్యంత పాపులరాటీని దక్కించుకుంది.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

1928 మోడళ్ల నుంచి ముందు చక్రాలలో బ్రేకులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

తొలి ఫ్లాట్‌హెడ్ ఇంజన్‌ను 1929లో విడుదల చేశారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ తమ మోటార్‌సైకిళ్లను విడుదల చేసిన కొద్ది సంవత్సరాల్లోనే కల్ట్ క్లాసిక్స్‌గా మారిపోయింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫోర్బ్స్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు మాల్కోమ్ ఫోర్బ్స్ హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లకు పెద్ద అభిమాని. ఈయన వద్ద సుమారు 50కు పైగా హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లు ఉన్నాయి. అంతేకాదు, ఈయన అనేక హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లను తన స్నేహితులకు బహుమతిగా ఇచ్చారు.

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లలో అత్యంత ఖరీదైన మోడల్ 'సివివో ఆల్ట్రా క్లాసిక్ ఎలక్ట్రా గ్లైడ్'. దీని ధర 40,000 అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.22 లక్షలు).

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాక్ట్స్

More from DriveSpark

Article Published On: Saturday, July 20, 2013, 13:15 [IST]
English summary
Does Harley Davidson girls & Harley Davidson facts interest you? Step right in & check-out this Beauty & the Beast Harley Davidson Special gallery.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+