భార్యపై ప్రేమతో భిక్షాటన చేసి టీవీఎస్ ఎక్స్ఎల్100 మోపెడ్ కొనుగోలు చేసిన భిక్షగాడు!

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచం నలుమూలలో ఏ చిన్న విషయం జరిగినా అది అందరికీ ఇట్టే తెలిసిపోతోంది. తాజాగా, బిక్షగాడి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నగరానికి చెందిన దివ్యాంగ్ సంతోష్ సాహు తన భార్యతో కలిసి ప్రతి ఊరు తిరుగుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. అయితే, ఇప్పుడు అతను తన భార్యపై ప్రేమతో ఆమె కోసం ఏకంగా రూ.90,000 ఖర్చు చేసి ఓ టీవీఎస్ ఎక్స్ఎల్100 మోపెడ్ కొనుగోలు చేశాడు. భిక్షాకటన చేసే వ్యక్తి దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేసి, బైక్ కొనడం ఏంటంని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

భార్యపై ప్రేమతో భిక్షాటన చేసి టీవీఎస్ ఎక్స్ఎల్100 మోపెడ్ కొనుగోలు చేసిన భిక్షగాడు!

ఈ దంపతులిద్దరూ మోపెడ్ కొనడానికి ముందు ట్రైసైకిల్ ని నడుపుకుంటూ భిక్షాటన చేసేవారు. అయితే, ఆ ఇటీవల తన భార్య నడుం నొప్పి గురించి ఫిర్యాదు చేయడంతో, ఆమె ప్రేమతో అతను భిక్షాటన చేసి సంపాదించిన డబ్బుతో ఓ మోపెడ్ కొని, దానికి ప్రత్యేకంగా మరో రెండు చక్రాలను అమర్చి ఆమె కోసం సిద్ధం చేయించాడు. ఇందుకోసం అతను దాదాపు నాలుగేళ్లకు పైగా పోగు చేసిన 90 వేల రూపాయల డబ్బును ఖర్చు చేశాడు. ఇప్పుడు వీరిద్దరూ ఈ మోపెడ్‌పై కొత్త ఊర్లలో సైతం తిరుగుతూ భిక్షాటన చేస్తున్నారు.

భిక్షాటనే జీవనాధారం

ఛింద్వారాలోని అమర్వాడలో నివసిస్తున్న సంతోష్ సాహు ఓ వికలాంగుడు. అతను తన భార్య మున్నీతో కలిసి చింద్వారా బస్టాండ్‌లో రోజూ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. మోపెడ్ కొనడానికి ముందు, సంతోష్ ట్రైసైకిల్ తొక్కేవాడు, మున్నీ దానిని నెట్టాల్సి వచ్చేది. ఇలా రోజుకి భిక్షాటన చేస్తూ వారు రోజుకు సుమారు రూ.300 నుండి రూ.400 సంపాదించే వారు. అలా వచ్చిన డబ్బుతోనే తామిద్దరూ బతుకుతున్నామని సంతోష్ తెలిపాడు.

భార్యపై ప్రేమతో భిక్షాటన చేసి టీవీఎస్ ఎక్స్ఎల్100 మోపెడ్ కొనుగోలు చేసిన భిక్షగాడు!

ఇంతకు ముందు ట్రై సైకిల్‌ నడిపేవారు

తాను ట్రై సైకిల్‌పై నడుచుకుంటూ భిక్షాటన చేస్తూ చాలా ఇబ్బందులు పడేవాడినని సంతోష్ తెలిపాడు. నగరంలోని ఘాట్ రోడ్లపై సంతోష్ ట్రైసైకిల్ తొక్కలేకపోయేవాడు. అలాంటి పరిస్థితిలో భార్య ట్రైసైకిల్ ను ముందుకు తోసుకుంటూ వెళ్లేది. ఈ విషయం సంతోష్‌కి నచ్చలేదు. ఒకరోజు భార్య మోపెడ్ కొనమని అడిగగా, ఆ తర్వాత సంతోష్ తన రోజువారీ సంపాదనలో డబ్బు ఆదా చేయడం ప్రారంభించాడు. సుమారు నాలుగేళ్ల పాటు డబ్బులు పోగుచేసి 90,000 వేల రూపాయలు ఆదా చేశాడు.

భార్యపై ప్రేమతో భిక్షాటన చేసి టీవీఎస్ ఎక్స్ఎల్100 మోపెడ్ కొనుగోలు చేసిన భిక్షగాడు!

భార్యకు మోపెడ్ టూర్ నచ్చింది

గతవారం శనివారం సంతోష్ తాను దాచుకున్న డబ్బుతో టీవీఎస్ ఎక్సెల్ 100 మోపెడ్ కొనుగోలు చేసి తన భార్యకు మోపెడ్ కానుకగా ఇచ్చాడు. ఇప్పుడు మోపెడ్‌లో ప్రయాణం సులువుగా మారిందని, అందుకే ఇండోర్‌, భోపాల్‌లకు వెళ్లి హాయిగా భిక్షాటన చేసుకోవచ్చని సంతోష్ చెబుతున్నాడు.

భార్యపై ప్రేమతో భిక్షాటన చేసి టీవీఎస్ ఎక్స్ఎల్100 మోపెడ్ కొనుగోలు చేసిన భిక్షగాడు!

TVS Excel 100 గురించి క్లుప్తంగా..

గత కొన్ని సంవత్సరాలుగా, టీవీఎస్ ఎక్స్‌ఎల్100 భారత టూవీలర్ మార్కెట్లో బలమైన నిర్మాణం కలిగిన మరియు మల్టీ-యుటిలిటీ సామర్ధ్యంతో పాటుగా డబ్బుకు తగిన విలువను కలిగిన ఉన్న మోపెడ్‌గా మంచి పేరును కలిగి ఉంది. చిన్న తరహా వ్యాపార యజమానులు, వ్యాపారులు మరియు రైతులకు ఇది అనువైన ద్విచక్ర వాహనంగా మారింది.

భార్యపై ప్రేమతో భిక్షాటన చేసి టీవీఎస్ ఎక్స్ఎల్100 మోపెడ్ కొనుగోలు చేసిన భిక్షగాడు!

ప్రస్తుతం, మార్కెట్లో కొత్త తరం టీవీఎస్ ఎక్స్ఎల్100 ఈజీ ఆన్-ఆఫ్ స్విచ్, ఆప్షనల్ యుఎస్‌బి ఛార్జర్ మరియు సౌకర్యవంతమైన రైడ్ అనుభవం వంటి కస్టమర్ ఫ్రెండ్లీ ఫీచర్ల కారణంగా ఇది ఆఫీసులకు వెళ్ళేవారు, మహిళా రైడర్లు మరియు సీనియర్ వ్యక్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ఇటి-ఫై) టెక్నాలజీతో వస్తుంది, ఇది 15 శాతం ఎక్కువ మైలేజీని ఆఫఱ్ చేస్తుంది.

భార్యపై ప్రేమతో భిక్షాటన చేసి టీవీఎస్ ఎక్స్ఎల్100 మోపెడ్ కొనుగోలు చేసిన భిక్షగాడు!

ఈ మోపెడ్ లోని ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ఐఎస్‌జి) వ్యవస్థ కారణంగా సున్నితమైన మరియు నిశ్శబ్దమైన ఇంజన్ స్టార్ట్ లభిస్తుంది. ఇందులో ఉపయోగించిన 99.7 సిసి ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 3.20 కిలోవాట్ (4.3 బిహెచ్‌పి) శక్తిని మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 6.5 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇదొక ఆటోమేటిక్ మోపెడ్, ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉండదు.

Most Read Articles

English summary
Beggar brought tvs xl 100 moped for his wife video goes viral
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X