Just In
- 47 min ago
ఓలా ఎలక్ట్రిక్ కారు (Ola Electric Car) చవకైనదేమీ కాదు.. ధరను వెల్లడించిన కంపెనీ బాస్..!
- 1 hr ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 2 hrs ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 4 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
Don't Miss
- Sports
హార్దిక్ పాండ్యా ఉంటే ఇండియా వేరే లెవెల్ టీం.. పాండ్యాను ప్రశంసలతో ముంచెత్తిన లాన్స్ క్లూసెనర్
- Technology
Reliance నుంచి Jio 5G Phone ..! ధర & స్పెసిఫికేషన్లు వివరాలు
- Finance
Srilanka crisis: ప్రజలకు లంకంత కష్టం.. కిలో చికెన్ రూ.1,200, ఒక్కో గుడ్డు రూ.62.. ఎందుకంటే..
- Lifestyle
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
- Movies
Macherla Niyojakavargam day 4 collections: మాస్ ఇమేజ్ తో నితిన్ పోరాటం.. తట్టుకున్నాడు కానీ?
- News
ఆంధ్రప్రదేశ్ వైపు అదానీ అడుగులు... వెల్లడించిన సీఎం జగన్
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
కోట్లు ఖరీదు చేసే లాంబోర్ఘిని కారుతో మరో కాస్ట్లీ కారును ఢీకొట్టిన 10 ఏళ్ల బాలుడు!
కార్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కారు అంటే ఓ సరదా. అందులోనూ కొత్త కారును చూసినప్పుడు అందులో ప్రయాణించాలని లేదా దానిని నడపాలని అనిపిస్తుంది. అయితే, ఈ సరదా ఒక్కోసారి మనల్ని చిక్కుల్లో పడేస్తుంది. ఖరీదైన లాంబోర్గినీ కారుని చూసి, ఆగలేని ఓ రిచ్ సెలబ్రిటీ కిడ్, దాని యాక్సిలరేటర్ పెడల్ పై కాలు వేశాడు, అంతే క్షణాల్లో అది రయ్యిమంటూ దూసుకుపోయి మరొక ఖరీదైన కారును గుద్దుకుంది.

వివరాల్లోకి వెళితే హాలీవుడ్ నటుడు, దర్శకుడు మరియు రచయిత అయిన బెన్ అఫ్లెక్ యొక్క 10 ఏళ్ల కుమారుడు శామ్యూల్ గార్నర్ అఫ్లెక్‌ను అతని భార్య జెన్నిఫర్ లోపెజ్‌తో కలిసి కారు డీలర్‌షిప్‌కి తీసుకెళ్లారు. ఈ సమయంలో, డీలర్ షాపు వద్ద కార్లను చూడటానికి వెళ్లిన బెన్ అఫ్లెక్ తన కొడుకు మరియు భార్యను కారులో వదిలి వెళ్ళాడు. ఆ సమయంలో శామ్యూల్ చేసిన పనికి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

లాంబోర్గినీ ఉరుస్ కారు డ్రైవర్ సీటులోకి వెళ్లిన బెన్ కుమారుడు శామ్యూల్ రివర్స్ గేర్ వేసి వాహనాన్ని వెనక్కి తిప్పాడు. దీంతో అది వెనుక ఆగి ఉన్న బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ సమయంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు మరియు ప్రమాదంలో ఎక్కువ ఆస్తి నష్టం కూడా జరగలేదు. బెవర్లీ హిల్స్ లగ్జరీ కార్ రెంటల్ డీలర్షిప్ - 777 ఎక్సోటిక్స్ వద్ద ఈ సంఘటన జరిగింది.
బెన్ అఫ్లెక్ తన కొడుకు శామ్యూల్‌ను లంబోర్ఘిని ఉరస్లో విడిచిపెట్టి వేర్వేరు కార్లను చూస్తున్నాడు. ఆ సమయంలో అతని తల్లి కూడా కారులో కుమారుడితో పాటు ఉంది. అయితే, ఆమె తన కుమారుడు నిజంగా కారు ఆన్ చేస్తాడని ఆమె ఊహించలేదు. ఘటన జరిగిన తర్వాత భయాందోళనకు గురైన బాలుడు కారు నుండి దిగిపోయాడు. ఆ సమయంలో బెన్ తన కుమారుడిని దగ్గరకు తీసుకుని ఒదారుస్తున్న ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని బెన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. స్థానిక సమాచారం ప్రకారం, ఇంజన్ ఆన్ లో ఉన్న సమయంలో శామ్యూల్ డ్రైవర్ సీటులోకి ఎక్కి వాహనం రివర్స్ గేర్‌లోకి నెట్టాడు, అది పార్కింగ్ స్థలంలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ కారుని గుద్దుకొని, దానిని కొద్ది దూరం ముందుకు నెట్టింది. ఈ ఘటన పై 777 ఎక్సోటిక్స్ డీలర్షిప్ ఉద్యోగి స్పందిస్తూ.. శామ్యూల్ కారు ఎక్కగానే అది అటు ఇటు కదులుతోంది. పార్కింగ్ స్థలంలో కార్లు ఒకదానికొకటి దగ్గరగా పార్క్ చేయడమే ఈ సంఘటనకు కారణం. బెన్ అఫ్లెక్కి కార్లంటే చాలా ఇష్టం. కొత్త కార్లు వచ్చినప్పుడల్లా అతను ఇక్కడకు వచ్చి వాటిని సందర్శిస్తాడని చెప్పారు.

లాంబోర్గినీ ఉరుస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు వేగంగా అమ్ముడవుతున్న ఇటాలియన్ స్పోర్ట్స్ ఎస్యూవీ. భారత మార్కెట్లో ఈ కారు ధర ఎక్స్-షోరూమ్ సుమారు మూడు కోట్ల రూపాయల నుండి నాలుగు కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. మన టాలీవుడ్ లో హీరో ఎన్టీఆర్ కూడా ఇలాంటి ఓ కారును కొనుగోలు చేశారు. సెలబ్రిటీలు సైతం ఎక్కువగా ఇష్టపడే పెర్ఫార్మెన్స్ కారు ఇది. లాంబోర్గిని ఉరుస్ పనితీరుతో పాటుగా మంచి లగ్జరీని కూడా అందిస్తుంది.

ఈ కారు డిజైన్ లంబోర్ఘిని హురాకాన్ సూపర్ కార్ నుండి ప్రేరణ పొందింది. లంబోర్ఘిని ఉరుస్ 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 22 మరియు 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆప్సన్ లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్యూవీ లో శక్తివంతమైన 4-లీటర్ ట్విన్-టర్బో వి 8 ఇంజన్ ఉంటుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 650 బిహెచ్పి పవర్ మరియు 2,250 ఆర్‌పిఎమ్ వద్ద 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. అలాగే, 12.8 సెకన్లలో 0 నుంచి 200 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది.