Accident Viral Video కారును ఓవర్‌టేక్‌ చేయబోయి బారికేడ్‌ను ఢీకొట్టిన స్పోర్ట్స్‌ బైకర్‌.. వీడియో వైరల్‌

పబ్లిక్‌ రోడ్లపై బైక్‌లు, కార్లతో విన్యాసాలు చేస్తూ ఆకతాయిల ఆగడాలు రోజురోజుకీ మీరిపోతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వారితో పాటు ఇతరులకూ ముప్పు కలిగిస్తున్నారు. తాజాగా ఓ స్పోర్ట్స్‌ బైకర్‌ కూడా ఇలాగే తన విచ్చలవిడి డ్రైవింగ్‌తో ప్రమాదానికి గురయ్యాడు.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం కోసం రిస్కీ స్టంట్స్‌కు పాల్పడుతున్నారు కొందరు యువకులు. బైక్‌ రైడింగ్‌ సమయంలో హెల్మెట్‌ కెమెరాల ద్వారా విన్యాసాలను రికార్డ్‌ చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తరచూ ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డుపై ఇతర వాహనాలను ప్రమాదకరంగా ఓవర్‌టేక్‌ చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు.

Bike-Hits-Barricade

తాజాగా హ్యుందాయ్‌ అల్కాజర్‌(Hyundai Alcazar) కారును ఓవర్‌టేక్‌ చేసే ప్రయత్నంలో బారికేడ్‌ను ఢీకొట్టాడు బెనెల్లీ TNT 300 బైక్‌ రైడర్‌. ఇందుకు సంబంధించిన వీడియోను కేటీఎం RC 390 బైక్‌పై వెళ్తున్న యూట్యూబర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశారు. వీడియోలో కేటీఎం, టీవీఎస్‌ అపాచీ RR310, Benelli TNT 300 బైక్‌లపై యువకులు మార్నింగ్‌ రైడ్‌కు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

ఉదయం పూట రోడ్డుపై వాహనాలు తక్కువగా ఉండటంతో ఈ మూడు బైక్‌లపై పిలియన్‌లతో కలిసి రైడ్‌కు బయలుదేరారు యువకులు. ఈ క్రమంలో రోడ్డుపై వాహనాలు తక్కువగా ఉండటంతో హై స్పీడ్‌లో వెళ్తున్నారు. హెల్మెట్లు ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా రైడ్‌ చేస్తున్నారు. అయితే ఈ బైక్‌లను ఆఫ్టర్‌ మార్కెట్‌ ద్వారా కొన్ని మార్పులను చేసినట్లు తెలుస్తోంది.

Bike-Hits-Barricade

బెనెల్లీ TNT 300 బైకర్ RC 390 రైడర్‌తో పబ్లిక్‌ రోడ్డుపై రేసింగ్ చేస్తున్నప్పుడు.. బెనెల్లీ రైడర్‌ హై స్పీడ్‌తో లేన్‌లు మారుస్తూ వెళ్తున్నాడు. 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ మధ్యమధ్యలో రెండు సార్లు బ్రేకులు వేశాడు. కాగా ఈ సమయంలో అల్కాజర్‌ డ్రైవర్‌ సడెన్‌గా లేన్‌ను మార్చేందుకు యత్నించాడు.

అయితే ఎస్‌యూవీ డ్రైవర్‌ లేన్‌ను ఎందుకు మారుస్తున్నాడో తెలియకుండా.. బెనెల్లీ రైడర్ SUV డ్రైవర్‌పై కొంచెం ఆగ్రహం ప్రదర్శించడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత బైక్‌ రైడర్‌ ముందుకెళ్లాడు. అలా ముందుకెళ్లిన సెకన్ల వ్యవధిలోనే TNT 300 రైడర్‌ రోడ్డు మధ్యలో ఉన్న బారికేడ్‌ను ఢీకొట్టాడు.

Bike-Hits-Barricade

అంతకుముందుగా రోడ్డు మధ్యలో బారికేడ్‌ను గమనించిన అల్కాజర్‌ డ్రైవర్‌.. దానిని ఢీకొట్టకుండా లేన్‌ను మార్చేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఇది గమనించని బైక్‌ రైడర్‌ రాంగ్‌ రూట్‌లో కారును ఓవర్‌టేక్‌ చేసేందుకు యత్నించి బారికేడ్‌ను ఢీకొట్టాడు. 50 కి.మీ వేగంతో ఆ యువకుడు బారికేడ్‌ను ఢీకొట్టాడు.

దీంతో మెటల్‌ బారికేడ్‌ విరిగిపోయింది. బైకర్‌, పిలియన్‌ ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. బైక్‌ ముందు మడ్‌గార్డ్ డ్యామేజ్‌ అయింది. రైడర్ మోకాలికి గాయాలయ్యాయి. అది తప్ప పెద్దగా ప్రమాదాలేవి జరగలేదు. అయితే ఇక్కడ బైకర్ మరియు అల్కాజర్ డ్రైవర్ ఇద్దరి తప్పూ ఉన్నట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది.

Bike-Hits-Barricade

అల్కాజర్ డ్రైవర్.. లేన్‌ను మార్చడానికి ముందు స్పీడ్‌ తగ్గించి టర్న్‌ సిగ్నల్‌ను ఉపయోగించాల్సి ఉంది. అతను ఇక్కడ ఈ పని చేయలేదు. ఇంకా బెనెల్లీ TNT 300 బైకర్ విషయానికొస్తే, అతి వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌ ప్రమాదానికి దారితీసింది. దీంతో అతను బారికేడ్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు.

రోడ్డు ప్రమాదాలను నివారించేటప్పుడు ఎవరైనా సరే ఎల్లప్పుడూ పబ్లిక్ రోడ్లపై నిర్దేశించిన, సురక్షితమైన వేగాన్ని మాత్రమే కొనసాగించాలి. రేసింగ్‌పై ఆసక్తి ఉన్న వారి రేస్ చేయాలనుకుంటే లేదంటే మీ రైడింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాలనుకుంటే ప్రైవేట్‌ ట్రాక్‌లపై ఇలాంటివి చేయాలి. కానీ పబ్లిక్‌ రోడ్లపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గుర్తుంచుకోవాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 19, 2023, 12:59 [IST]
English summary
Benelli tnt 300 bike rider crashes into barricade while overtaking hyundai alcazar viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+