శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

భారతదేశంలో కరోనా వైరస్ తీవ్రత చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఎంతోమంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు కఠినమైన చర్యలను విధిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా రాష్ట్రల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది.

శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

కరోనా వేళ ప్రజలకు సేవలు చేయడానికి కొంతమంది వ్యక్తులు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ఇటీవల ఆక్సిజన్ మ్యాన్ గా పిలువబడిన బీహార్ కి చెందిన 'గౌరవ్ రాయ్' రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు.

శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

అయితే బెంగళూరుకు చెందిన ఒక అంబులెన్స్ డ్రైవర్ కరోనా వల్ల చనిపోయిన మృతదేహాన్ని స్మశానానికి తరలించడానికి చాలా మొత్తం డబ్బుని అడిగి మృతుని కుటుంభ సభ్యులకు చాలా ఇబ్బందిని కలిగించాడు.

MOST READ:బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ: ఫుల్ వీడియో.. ఇప్పుడు మీకోసం

శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

నివేదికల ప్రకారం ఈ సంఘటన 2021 ఏప్రిల్ 20 న జరిగింది. 29 ఏళ్ల భవ్య తండ్రి ప్రసాద్ (57) ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్-19 కారణంగా మరణించాడు. మృతదేహాన్ని పీన్యలోని శ్మశానవాటికకు తీసుకెళ్లాలని ఆమె అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. జై హనుమాన్ అంబులెన్స్ యజమాని హముమంతప్ప ఈ పనిని నిర్వహించడానికి ఏకంగా 60,000 రూపాయలు డిమాండ్ చేశారు.

శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

అడిగిన మొత్తం 60,000 రూపాయలు ఇవ్వకుంటే మృతదేహాన్ని రోడ్డుపై వదిలివేస్తామని చెప్పాడు. ప్రస్తుత ఆమె వద్ద డబ్బు లేదని ఖచ్చితంగా ఇస్తానని ముందు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి సహాయం చేయమని వేడుకుంది. అయితే కనికరం లేని ఆ అంబులెన్స్ డ్రైవర్ ససేమిరా ఒప్పుకోలేదు.

MOST READ:కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి

శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

అప్పుడు భవ్య పాపం ఇక ఏమి చేయాలో తోచక ఒక పోలీసుని పిలిచి వారికి సమాచారం ఇచ్చింది. అక్కడ పరిస్థితిని గమనించిన ఆ పోలీస్ వారి వద్ద నుంచి అంబులెన్స్ డ్రైవర్ కి 16,000 ఇవ్వాలని చెప్పాడు. ఈ డబ్బు చెల్లించిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లారు.

శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

ఈ సంఘటన జరిగిన తరువాత అమృతహళ్లి పోలీసులు అంబులెన్స్‌ స్వాధీనం చేసుకున్నారు మరియు ఇద్దరు నిందితులపైనా ఐపిసి సెక్షన్ 384, 269, 270 మరియు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం (ఎన్‌ఎంఏ) కింద అరెస్ట్ చేశారు.

MOST READ:పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!

శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

నిందితులు ఇదేవిధంగా చాలా మంది నుండి డబ్బు డిమాండ్ చేశారు. దీనిపైనా కూడా దర్యాప్తు జరుగుతుందని సిటీ నార్తెస్ట్ డివిజన్ డిసిపి సికె బాబా మీడియాకు తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు జరిగితే దయచేసి పోలీసులకు తెలియజేయండి అని కూడా తెలిపారు.

శవాన్ని తీసుకెళ్లడానికి రూ. 60 వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందంటే?

కరోనా మహమ్మరి గుప్పెట్లో చిక్కి కొట్టు మిట్టాడుతున్న వేళ ఇలాంటి మన్సులేని మనసులు ప్రజలను డబ్బుకోసం మరింత పీక్కుతింటున్నారు. ఇలాంటి సంఘటనలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలి, అప్పుడే ఇలాంటి వాటిని నివారించవచ్చు. ఇలాంటి సంఘటనలు ప్రజల దృష్టిలో పడితే పోలీసులకు తెలియజేయాలి.

MOST READ:వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం

Source: The New Indian Express

Most Read Articles

English summary
Ambulance Owner Held, Vehicle Seized For Demanding Rs 60,000 To Ferry Body. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X