ఈ సిటీలలో ట్రాఫిక్‌కి చుక్కలు కనపడాల్సిందే.. భారత్‌లో అత్యంత రద్దీ ఉన్న నగరాల్లో ఇదే టాప్‌.!!

ట్రాఫిక్(Most Traffic Cities In India) పరంగా ప్రపంచంలోనే అత్యధిక వాహనాల రద్దీ ఉన్న నగరాల జాబితా వెల్లడైంది. ఈ లిస్ట్‌లో భారత్‌కు చెందిన 4 ప్రధాన నగరాలు ఉండటం.. అందరినీ షాక్‌కు గురించేసింది. దీనికి సంబంధించి ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. అయితే మరి ఆ లిస్ట్‌లో ఉన్న మన నాలుగు నగరాలేంటి.??

గత కొన్నేళ్లుగా, ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల జాబితాలో ఇంగ్లాండ్ రాజధాని లండన్ అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే లండన్‌లో 2023 లో అధ్యయనం ప్రకారం వాహనదారులు 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి సగటున 37 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుందని వెల్లడైంది.

London-The-Most-Traffic-Congested-City

ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన లొకేషన్-ఫైండింగ్ టెక్నాలజీ స్పెషలిస్ట్ అయిన టామ్‌టామ్ చేసిన అధ్యయనంలో ఈ సమాచారం వెల్లడైంది. లండన్‌లోని వాహనదారులు 2023లో ట్రాఫిక్‌(Bengaluru Traffic)లో దాదాపు 148 గంటలు వృధా చేశారని స్పెషలిస్టులు చెబుతున్నారు. 55 దేశాలకు చెందిన 387 నగరాల్లో ఈ అధ్యయనం చేశారు.

ఇక మన భారత్‌ విషయానికి వస్తే.. బెంగళూరులో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని తాజా అధ్యయనం చెబుతోంది. గత ఏడాది బెంగళూరులో రద్దీ కారణంగా వాహనదారులు 132 గంటలు ట్రాఫిక్‌లోనే గడిపారని నిపుణులు చెబుతున్నారు. బెంగుళూరులో 10 కి.మీ దూరం ప్రయాణించడానికి సగటున 28 నిమిషాల 10 సెకన్లు పడుతోందని అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

Bengaluru-The-Most-Traffic-Congested-City

అదేవిధంగా బెంగుళూరులో వాహనదారులు రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో సగటున 18 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడపగలరని అధ్యయనం చెబుతోంది. ప్రపంచంలోని చెత్త ట్రాఫిక్ జామ్‌ల టాప్-10(Top 10 Traffic List) జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయ నగరంగా పూణే స్థానం దక్కించుకుంది.

టామ్‌టామ్ విడుదల చేసిన జాబితాలో బెంగళూరు 6వ స్థానంలో ఉండగా, పుణె 7వ స్థానంలో ఉంది. గత ఏడాది పూణెలో వాహనదారులు ట్రాఫిక్‌లో 128 గంటలు గడిపారని నివేదిక వెల్లడిస్తోంది. మహారాష్ట్ర నగరంలో వాహనదారులు పీక్ అవర్స్‌లో 10 కి.మీ దూరానికి సగటున 27 నిమిషాల 50 సెకన్లు ప్రయాణించారని స్పష్టం చేసింది.

Bengaluru-The-Most-Traffic-Congested-City

పుణెలో రద్దీ సమయాల్లో వాహనదారులు గంటకు 19 కి.మీ కంటే ఎక్కువ వేగంతో నడపలేరని ఈ అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నారు. టామ్‌టామ్ యొక్క టాప్-100 జాబితాలోని ఇతర 2 భారతీయ నగరాలు న్యూ ఢిల్లీ మరియు ముంబయి. ఈ రెండు నగరాలు వరుసగా 44వ, 55వ ర్యాంకుల్లో నిలిచాయి. రాజధాని ఢిల్లీలో సగటున 10 కి.మీ దూరానికి 21 నిమిషాల 40 సెకన్ల సమయం పడుతుందని తేలింది.

2022 లో నిర్వహించిన అధ్యయనంతో పోలిస్తే.. గత ఏడాదిలో ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీ కాస్త తగ్గిందని తెలస్తోంది. 2023లో, ఢిల్లీలోని వాహనదారులు రద్దీ సమయంలో కేవలం 24 kmph వేగంతో ప్రయాణించేవారు. ట్రాఫిక్‌ కారణంగా తమ 81 గంటల సమయాన్ని నష్టపోయారు. ఇక టామ్‌టామ్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ముంబయిలో 10 కి.మీ సగటు ప్రయాణ సమయం 21 నిమిషాల 20 సెకన్లుగా తేలింది.

Bengaluru-The-Most-Traffic-Congested-City

విస్తీర్ణం మరియు జనాభా పరంగా అతి పెద్ద దేశాల్లో భారత్‌ ఒకటి.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అనేక నగరాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగానే ఉంటోంది. ఈ క్రమంలో ఈ జాబితాలో 4 భారతీయ నగరాలు ఉండటంలో ఆశ్చర్యమేమి లేదని అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ, బెంగళూరు ట్రాఫిక్‌ ఇటీవల విపరీతంగా ట్రోల్స్‌కు గురవుతున్న సంగతి తెలిసిందే.. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అవసరం.

More from DriveSpark

Article Published On: Monday, February 5, 2024, 14:19 [IST]
English summary
Bengaluru and pune are in the top 10 most traffic congested cities says the study
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+