ఆటోడ్రైవర్ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు.. ప్రభుత్వ నిర్ణయమే కారణమా?

రోజుకు ఎంత సంపాదిస్తున్నావు.. అని ఆటో డ్రైవర్‌ను ఎవరిని అడిగినా వారున్న ప్రాంతాన్ని బట్టి సమాధానం చెబుతారు. గ్రామీణ ప్రాంత ఆటోడ్రైవర్‌ అయితే 400-500 రూపాయలు, అదే పట్టణ ప్రాంతాల్లోని డ్రైవర్లు అయితే సుమారుగా 700-800 రూపాయలు, నగరాల్లో అయితే ఇంకా కొంచెం ఎక్కువగా వచ్చే ఉందని చెబుతారు. కానీ బెంగళూరు ఆటో డ్రైవర్‌ సంపాదన వింటే మాత్రం కొంచెం బాధ ఆపై కన్నీళ్లు వచ్చే అవకాశం ఉంది.

ఉదయం 8 నుంచి 1 గంట వరకు విధుల్లో ఉన్నానని, ఆ ఐదు గంటల సమయంలో తాను రూ.40 మాత్రమే సంపాదించినట్లు బెంగళూరు ఆటో డ్రైవర్‌ చెప్పాడు. ఈ విషయం చెబుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. బెంగళూరు పెద్ద నగరం.. అలాంటి ప్రాంతంలో కేవలం 40 రూపాయల సంపాదన ఏంటని ఆశ్యర్యపోతున్నారా..? అయితే ఈ స్టోరీ చదివేయండి మరి.

Bengaluru auto driver earns RS 40 in 5 hours

కర్ణాటకలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తన ఎన్నికల హామీలను అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా "శక్తి" పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, ట్రాన్స్‌జెండర్‌లకు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణం కల్పించడం ఈ శక్తి పథకం ముఖ్య ఉద్దేశం.

ఈ పథకమే తమ పరిస్థితికి కారణమని ఆటో డ్రైవర్‌ చెబుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అయితే వీడియో ఎప్పుడు రికార్డు చేయబడిందో పూర్తి స్పష్టత లేదు. ఈ వీడియోపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది నెటిజన్లు ఆటో డ్రైవర్‌పై సానుభూతి వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం భిన్నంగా స్పందించారు. అవకాశం వచ్చినప్పుడు కస్టమర్ల దగ్గర ఆటో డ్రైవర్లు దోచుకుంటారని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Bengaluru auto driver earns RS 40 in 5 hours

కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పథకం ద్వారా రోజుకు 41.8 లక్షల మంది మహిళలకు సాయంగా ఉంటుందని నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఈ పథకం కోసం సంవత్సరానికి రూ.4,051.56 కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. మైనారిటీలు, అణగారిన వర్గాల మహిళల పరిస్థితిని మెరుగుపరచడం ఈ పథకం ఉద్దేశమని సిద్ధరామయ్య తెలిపారు.

అయితే బెంగళూరు ఆటో డ్రైవర్‌ కన్నీరు పెట్టడం కాస్త బాధించిన విషయం. మరియు ఈ పథకం ఆటోడ్రైవర్ల రోజువారీ సంపాదనపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరిన్ని చూడాల్సి రావొచ్చు. అయినా మహిళల కోణంలో చూస్తే ఈ పథకానికి మంచి స్పందన వస్తోంది. వారికి ప్రయాణ భద్రత కలగడంతో పాటు నెలవారిగా కొంత నగదు ఆదా అవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, June 29, 2023, 17:47 [IST]
English summary
Bengaluru auto driver earns rs 40 in 5 hours due to shakti scheme video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+