ఆటో డ్రైవర్ స్మార్ట్ వాచ్‌లో క్యూ ఆర్ కోడ్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.!!
బెంగళూరు దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటి. బెంగళూరులో అన్ని వర్గాల ప్రజలు టెక్నాలజీపరంగా నిత్యం అప్‌డేట్ అవుతూనే ఉంటారు. అంతేకాకుండా స్టార్టప్‌లో రూపంలో కొత్తకొత్త ఆవిష్కరణలకు మహా నగరం నిలయంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో బెంగళూరు నగరం ఎల్లప్పుడూ 'పీక్ బెంగళూరు'గా వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో.. తాజాగా ఓ యువకుడు ట్విట్టర్(ఎక్స్) లో తన క్రేజీ అనుభవాన్ని పంచుకున్నారు. అది చూసిన నెటిజన్లు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరులో ఆటోలో ఎక్కిన ప్రయాణికుడు తన గమ్య స్థానానికి చేరుకున్నారు. ఆ తర్వాత డ్రైవర్‌కు డబ్బులు చెల్లించేందుకు 'నమ్మయాత్రి' సేవను ఎంచుకున్నాడు. అయితే, బార్‌కోడ్ స్కాన్ చేయడానికి ప్రయత్నించగా.. డ్రైవర్ ఒక్కసారిగా తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ చూపించారు. అదిచూసిన ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు.
బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ తన స్మార్ట్ వాచ్‌లో క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ప్రయాణికుడు ఫొటో తీసి ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ ఆటో డ్రైవర్ తెలివిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడంతో పాటు ఫిదా అవుతున్నారు.
ట్విటర్‌లో ఈ ఫొటోను సదరు యువకుడు షేర్ చేస్తూ.. 'ఈరోజు నేను ఆటోలో ప్రయాణించాను. ఆటో డ్రైవర్‌కు చెల్లింపులు చేసే సమయంలో క్యూ ఆర్ కోడ్‌ను అడిగాను. వెంటనే ఆ ఆటో డ్రైవర్ తనచేతికి ఉన్న స్మార్ట్‌వాచ్‌ని చూపించాడు. దానికి క్యూఆర్ కోడ్‌ను స్క్రీన్ సేవర్‌గా సేవ్ చేసుకున్నాడు. అతని తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయాను' అని ట్వీట్ చేశారు.
ట్విట్టర్‌లో ఈ ఫొటోను 3 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ఓ నెటిజన్.. బెంగళూరులోని ఆటో డ్రైవర్లు అక్కడి ఐటీ ఉద్యోగుల కంటే స్మార్ట్‌గా తయారయ్యారంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. మరో నెటిజన్ అతను ఆటో రాజా కాదు.. తెలివైనవాడు అని పేర్కొన్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు బెంగళూరులో మాత్రమే కనిపిస్తున్నాయి అనుకుంటా అని వినూత్నంగా కామెంట్ చేశారు.
వినూత్న కంటెంట్లతో బెంగళూరు నగరం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతుంటుంది. అక్కడి ట్రాఫిక్ రద్దీని ఫన్నీగా కొటేషన్ల రూపంలో వ్యక్తపరుస్తుంటారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో వేచి ఉండటంతో బస్సు డ్రైవర్ సైతం ట్రాఫిక్‌లోనే లంచ్ చేయడం ఇటీవల వైరల్‌గా మారింది. ఇంకా ఓ ఐటీ ఊద్యోగిని ర్యాపిడో బైక్‌పై కూర్చుని ల్యాప్‌టాప్‌లో వర్క్ చేయడం అక్కడి ట్రాఫిక్ పరిస్థితులకు అద్దం పడుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








