ఒకేసారి మూడు బెంజ్ కార్లు కొన్న బెంగళూరు బార్బర్.. ఇతనెవరో తెలుసా?
రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన బెంగళూరు బార్బర్ ఇప్పుడు ఒకేసారి ఏకంగా మూడు మెర్సిడెస్ బెంజ్ కార్లు కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..
సాధారణ బార్బర్ స్థాయి నుంచి గొప్ప ధనవంతుడు వరకు ఎదిగిన 'రమేష్ బాబు' గురించి చాలామందికి తెలుసు. ఈయన జీవితం ఎంతోమందికి ఆదర్శం కూడా. సామాన్య బార్బర్‌గా జీవితం స్టార్ట్ చేసి నేడు 200 కంటే ఎక్కువ కార్లను కలిగి ఉన్నారు. కాగా ఇప్పుడు ఈయన గ్యారేజిలో 'మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్' సెడాన్‌లను కొనుగోలు చేశారు. ఈయన సారథ్యంలో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ నడుస్తోంది.

రమేష్ బాబు మూడు కార్లను డెలివరీ చేసుకుంటున్న ఫోటోలను బెంగళూరుకు చెందిన సుందరం మోటార్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రమేష్ బాబుకు డీలర్‌షిప్ ఉద్యోగి పుష్పగుచ్చం అందిస్తున్న దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. ఫోటోలలో ఆయన భార్య కూడా ఉండటం చూడవచ్చు. మూడు కార్లను వరుసగా నిలిపి ఉంచి ఉండటం కూడా ఇక్కడ గమనించవచ్చు. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం చూడవచ్చు.
మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ (Mercedes Benz E-Class)
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలలో మెర్సిడెస్ బెంజ్ ఒకటి. ఈ కంపెనీకి చెందిన ఈ క్లాస్ సెడాన్లను రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ రమేష్ బాబు ఒకేసారి కొనుగోలు చేశారు. ఈ మూడు కూడా హైటెక్ సిల్వర్ మెటాలిక్ కలర్ ఆప్షన్ పొందాయి. ఇవన్నీ బ్లాక్ లెదర్ అపోల్స్ట్రేని కలిగి ఉన్నాయి.

రమేష్ బాబు ఎంచుకున్న మోడల్ ఈ క్లాస్ LWB 220d. ఈ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 192 Bhp పవర్ మరియు 400 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉఉంటుంది. ఈ క్లాస్ LWD ధర రూ. 72.8 లక్షలు (ఎక్స్ షోరూమ్).
రోల్స్ రాయిస్ ఘోస్ట్
ఇక రమేష్ బాబు రోల్స్ రాయిస్ ఘోస్ట్ విషయానికి వస్తే.. దీనిని రమేష్ బాబు 2011 ఫిబ్రవరిలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుపు రంగులో కనిపించే ఈ కారు ధర రూ.3 కోట్లు. ఇది 6.6-లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 562 Bhp పవర్ మరియు 780 Nm టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది.
రమేష్ బాబు గ్యారేజిలో రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా దాదాపు 200 ఇతర కార్లు ఉన్నాయి. ఇందులో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ (రూ. 2.7 కోట్లు), బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, ఈ క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, అనేక వోల్వో కార్లు, టయోటా క్యామ్రి, హోండా అకార్డ్ మరియు హోండా సీఆర్-వీ మొదలైనవి ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








