ఓలా, ఉబర్‌కు షాకిచ్చిన క్యాబ్ డ్రైవర్.. 'నానో ట్రావెల్స్' పేరుతో సొంతంగా యాప్.!!
భారత్‌లో ఆన్‌లైన్ ట్యాక్సీ సర్వీసుల గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం క్యాబ్స్ అనగానే అందరికీ ఓలా(Ola), ఉబర్(Uber) గుర్తొస్తాయి. భారత్‌లో ఇవి దిగ్గజ ఆన్‌లైన్ ట్యాక్సీ సర్వీస్ సంస్థలుగా పేరుగాంచాయి. తాజాగా ర్యాపిడో(Rapido) కూడా క్యాబ్ సర్వీస్‌లోకి చేరింది. కానీ ఇప్పుడు వీటికి పోటీగా మరొకరు వచ్చారు.
కస్టమర్లకు నాణ్యమైన సేవలందించేందుకు ఇప్పటికే ఓలా, ఉబర్, ర్యాపిడోలు విపరీతంగా పోటీపడుతున్నాయి. అటు పార్ట్‌నర్ డ్రైవర్లు పేమెంట్ల విషయంలో సంతృప్తి చెందేలా.. ఇటు తక్కువ ఛార్జీల వసూలుతో కస్టమర్లకు సర్వీసులు అందించేలా చేసేందుకు ఒకదానితో మరొకటి పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో వీటిని సవాల్ చేస్తూ ఓ క్యాబ్ డ్రైవర్ సొంతంగా యాప్‌ను ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓలా, ఉబర్, ర్యాపిడోలు సక్సెస్ అయ్యాయంటే దానికి కారణం.. వాటిలో పనిచేసే డ్రైవర్లు అనే చెప్పాలి. అయితే ఒకప్పుడు ఆ యాప్స్‌లోని ఓ దాంట్లో పని చేసిన డ్రైవర్ ఇప్పుడు ఓలా, ఉబర్ కంపెనీలకు గట్టి షాక్‌నే ఇచ్చాడు. తనకంటూ ఒక సొంత యాప్(Cab Driver Develops App)ని తయారు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదెలా అంటే..
దేశంలోనే ఐటీ హబ్‌గా బెంగళూరు అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో నగరం వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు ట్రాఫిక్ సమస్య కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో ఇది స్థానిక క్యాబ్ డ్రైవర్లకు పెద్ద సవాల్‌గా మారింది. దీని కారణంగా బెంగళూరు క్యాబ్ డ్రైవర్(Cab Driver Own App) సొంత మొబైల్ యాప్‌ని ప్రారంభించేలా చేసింది.
బెంగళూరులో ఓలా- ఉబర్ కంపెనీల్లో డ్రైవర్‌గా చేసిన లోకేశ్ తాజాగా 'నానో ట్రావెల్స్(Nano Travels)' పేరుతో సొంతంగా యాప్‌ను విడుదల చేశారు. ఓ రకంగా ఇది సొంతంగా స్టార్టప్ కంపెనీ లాంటిదే అని చెప్పవచ్చు. సొంత యాప్‌ను తీసుకురావడంతో ప్రస్తుతం ఈ లోకేశ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఓ నెటిజన్ తన ప్రొఫైల్‌లో లోకేశ్ గురించి రాసుకొచ్చాడు.
"నేను రైడ్ బుక్ చేసుకున్న ఉబర్ యాప్ డ్రైవర్ నాతో ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు. అతను ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో పోటీ పడేందుకు సొంతంగా ఒక యాప్‌ని రూపొందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటికే అతని యాప్‌లో 600కు పైగా డ్రైవర్స్ ఉన్నారంటూ లోకేశ్ వివరించారు. వాళ్లు తాజాగా వారి iOS వర్షన్ యాప్‌ని కూడా విడుదల చేశారు" అంటూ నెటిజన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఈ పోస్ట్‌తో లోకేశ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాడు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. లోకేశ్ ఆ iOS యాప్‌ని స్వయంగా డెవలప్ చేసినట్లు చెప్పడంతో ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతైంది. ఒక క్యాబ్ డ్రైవర్ స్టార్టప్ పెట్టడం మాత్రమే కాకుండా.. తన యాప్‌ని తానే స్వయంగా రూపొందించుకోవడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. లోకేశ్‌ని అభినందిస్తున్నారు. లోకేశ్ లాంటి ప్రతిభ కలిగిన యువకులు.. దేశాభివృద్ధికి ఎంతో అవసరం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఒకరి కింద పనిచేయడం కాకుండా.. ఇలా నలుగురికీ ఉపాధి అందించే స్థాయికి ఎదగడం అభినందనీయమని కొనియాడారు.
పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా ఇలాంటి మరిన్ని రైడింగ్ యాప్స్ మార్కెట్‌లోకి అందుబాటులోకి రావాలని నెటిజన్స్‌తో పాటు, క్యాబ్ డ్రైవర్లు కూడా ఆకాంక్షిస్తున్నారు. వీటి ద్వారా రైడ్ ఫేర్ కూడా తక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తేం చేస్తున్నారు. పలు సందర్భాల్లో కొన్ని కంపెనీలు ప్రయాణికులకు రైడ్స్ అందించడంలో విఫలం కూడా అవుతున్నాయి.
ఇలాంటి సందర్భాల్లో ఓ సాధారణ వ్యక్తి, క్యాబ్ డ్రైవర్ ఇలా ఓ యాప్‌ను డెవలప్ చేసి సర్వీస్ అందించడం ఆశ్చర్యకరంగా ఉంది. ఈ పోస్ట్‌కి ఇప్పటికే 51 వేలకు పైగా వ్యూస్ మరియు 879కి పైగా లైక్‌లు వచ్చాయి. ఆండ్రాయిడ్ వెర్షన్ జూలై నుంచే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications








