క్యాబ్ డ్రైవర్ సంపాదన రోజుకి నాలుగు వేలా!.. విస్తుపోయే విషయాలు
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో బెంగళూరు ఒకటి. ప్రముఖ ఐటీ సిటీగా పేరు పొందిన ఈ నగరంలో వందలాది కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థల్లో రోజూ వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరూ రోజూ క్యాబ్ సర్వీసుల మీదనే ఆధారపడతారు. కాబట్టి బెంగళూరులో చాలామంది క్యాబ్ డ్రైవర్లు బాగా డబ్బు సంపాదిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్లు ఇతర ఉద్యోగులకంటే ఏ మాత్రం తక్కువ కాకుండా ఆర్జిస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఓ రెడ్డిచ్ పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఒక క్యాబ్ డ్రైవర్ ఎంత సంపాదిస్తాడు అని టైటిల్‌తో రెడ్డిచ్ యూజర్ ఓ పోస్ట్ చేసారు. ఒక సందర్భంలో తానూ క్యాబ్ బుక్ చేసుకున్నట్లు, క్యాబులో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్‌తో మాట్లాడుతూ.. రోజుకు ఎంత సంపాదిస్తావు అనే ప్రశ్న వేసినట్లు చెప్పాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆ డ్రైవర్ రోజుకు రూ. 3000 నుంచి రూ. 4000 సంపాదిస్తానని చెప్పాడు.

దీన్నిబట్టి రోజుకి మూడు వేల రూపాయలు సంపాదించినా.. డ్రైవర్ నెలకు 25 రోజులు పనిచేసిన సుమారు రూ. 75వేలు కంటే ఎక్కువే సంపాదిస్తారని తెలిసింది. కారుకు పెట్రోల్ పోసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తున్నట్లు, అయినా తనకు మంచి లాభమే వస్తున్నట్లు ఆ డ్రైవర్ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో తన పిల్లలకు మంచి స్కూల్లో చదివిస్తున్నట్లు కూడా చెప్పాడని యూజర్ తాను షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు.
ఎన్ని సంవత్సరాల నుంచి క్యాబ్ డ్రైవ్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు జవాబిస్తూ.. నేను 2019కి ముంది ఉద్యోగం చేశావాడిని. ఉద్యోగం కోల్పోయిన తరువాత క్యాబ్ డ్రైవింగ్ చేయడం ప్రారంభించినట్లు వెల్లడించాడు. మొత్తం మీద బాగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఉన్న క్యాబ్ డ్రైవర్లు బాగా ఆర్జిస్తూ జీవిస్తున్నారని అర్థమవుతోంది. కరోనా సమయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. ప్రస్తుతం వీరి జీవితాలు మెరుగుపడినట్లు తెలుస్తోంది.

ఈ పోస్ట్ చూసిన వారిలో కొందరు స్పందిస్తూ.. ఇది ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఓలా క్యాబ్ డ్రైవర్ కూడా రోజు కష్టపడి సంపాదిస్తున్నాడు. అతడు సాధారణంగా విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని గమ్యాన్ని చేరుస్తాడు. ఆయన అన్ని ఖర్చులు పోయినా (పెట్రోల్, ఈఎంఐ, మెయింటెనెన్స్) నెలకు రూ. 800000 మిగులుతుందని తెలుస్తోందని అన్నారు.
క్యాబ్ నడుపుతూనే జీవితాన్ని హాయిగా గడుపుతున్నవారు చాలామంది ఉన్నారు. వీరు మంచి ఇల్లు, వారి పిల్లలలు మంచి చదువులు చెప్పిస్తూ జీవితం గడుపుతున్నారు. సిటీలలో స్థలాలు, ఇల్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వారి జీవితాలు ఎలా మారుతున్నాయో, ఎలా సంపాదిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం అంత సులభమేమీ కాదు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సి ఉంటుంది. రాత్రి సమయం కావచ్చు, వర్షం పడే సమయం కావచ్చు, రద్దీగా ఉండే ట్రాఫిక్ సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నారు. కొందరు నెలకు లక్షల ఆదాయం కూడా గడించేవారి చాలామందే ఉన్నారు. ఓలా, ఉబర్ సర్వీసులు మొదలైన తరువాత చాలామంది జీవితాలు బాగుపడ్డాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో వీరు మరింత వృద్ధి చెందుతారని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








