ఎద్దుల బండిపై షోరూమ్‌కి వచ్చిన రైతు.. అతను చేసిన పనికి అందరూ షాక్.. మాములోడు కాదు బాబోయ్
సోషల్ మీడియా ట్రెండ్స్ ఈ రోజుల్లో జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా వైరల్ చేస్తుంది. ముఖ్యంగా కొత్త కారు, బైక్, లేదా ఇతర వాహనాలను కొనుగోలు చేయడం ఇప్పుడు కేవలం వ్యక్తిగత అంశం మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో పెద్ద దృష్టిని ఆకర్షించే అవకాశంగా మారింది. ప్రతి కొత్త వాహన డెలివరీని కేవలం వ్యక్తిగత ఆనందం మాత్రమే కాకుండా, అందరికి తెలిసేలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రతి ఆన్‌లైన్ ఫీడ్‌లో కొత్త వాహనాలు, డెలివరీలు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటివి మరిన్ని కనిపించాయి. కొన్ని నెలల క్రితం, ఒక వ్యక్తి తన బెంట్లీ బెంటెగా SUV డెలివరీ కోసం హెలికాప్టర్‌లో దిగిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అది సోషల్ మీడియా వినియోగదారులను, ఇతరులను కూడా ఆకర్షించింది.
తాజాగా, మరో డెలివరీ వీడియో వైరల్‌గా మారింది. ఈసారి అది కేవలం కారు డెలివరీ మాత్రమే కాదు, ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన అంశం. కోట్ల విలువైన లగ్జరీ టయోటా MPV కొనేందుకు, ఎద్దుల బండిలో షోరూమ్‌కు వచ్చిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో చర్చిస్తున్నారు. ఇది మన దేశంలో కొత్త కారు కొనుగోలు, క్రియేటివ్ డెలివరీ ఐడియాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో మరోసారి చూపించింది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లయితే, SSR సంజు తన పేరున్న YouTube ఛానెల్‌లో టయోటా వెల్ఫేర్ ప్రత్యేకమైన డెలివరీ వీడియోను షేర్ చేశారు. ఇంతటి ప్రత్యేకమైన కారు డెలివరీ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. వీడియోలో అతను తన అనుచరులతో కలిసి కొత్త కార్ల డెలివరీ కోసం సిద్ధం కావాలని చెబుతాడు. ఆ తరువాత అనుచరుతు ఇంటి ముందు ఉన్న కార్లలో ఎక్కుతారు.
అయితే అనుచరులతో ఆ కార్లన్నీ అక్కడి నుంచి వెళ్లిపోతాయి. అందులో లగ్జరీ కార్లు అయినటువంటి పోర్స్చే పనామెరా, ఫోర్డ్ ముస్తాంగ్, మసెరటి లెవాంటే, టయోటా ఇన్నోవా హైక్రాస్, టయోటా ఫార్చ్యూనర్ వంటి ఖరీదైన SUVలు ఉన్నాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సంజు ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి ఒక్క కారు కూడా కనిపించదు. తన అనచరులు ఆ కార్లన్నీ తీసుకుని వెళ్లిపోయారని మరోక వ్యక్తి ఆయనకు చెబుతాడు.

తరువాత సంజు అకస్మాత్తుగా ఎద్దుల బండిపై కనిపిస్తారు. దానిని ఆయనే స్వయంగా నడుపుకుంటూ షోరూమ్ దగ్గరకు వెళ్తాడు. అయితే అప్పటికే ఆయన కార్లన్నీ కూడా షోరూమ్‌కు చేరగా, భద్రతా సిబ్బంది వచ్చి కార్ల డోర్లు ఓపెన్ చేస్తూ సంజు కోసం వెతుకుతారు. సడన్‌గా అక్కడికి సంజు ఎండ్లబండిపై రావడం చూస్తారు. వెంటనే సంజు బండి నుండి దిగగానే, అతని భద్రతా బృందం అతని వద్దకు పరుగెత్తి వచ్చి క్షమాపణలు తెలిపారు.
ఆ తర్వాత, డీలర్‌షిప్ సిబ్బంది సంజును సాదరంగా స్వాగతించారు. తరువాత, కారు సంబంధిత అన్ని పేపర్ వర్క్‌లు పూర్తయి, ఎర్రటి వస్త్రంతో కప్పబడిన టయోటా వెల్‌ఫైర్‌ను ఆవిష్కరించారు. తరువాత, కీ ఆయనకు అందిస్తారు. సంజు సాంప్రదాయ రీతిలో కొత్త కారును స్వాగతించాడు. చివరగా, అతను లగ్జరీ SUVలో అడుగుపెట్టి, కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ పూర్తి వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

టయోటా వెల్‌ఫైర్ రెండు వేరియంట్లలో లబిస్తుంది. హై వేరియంట్ ధర రూ. 1.19 కోట్లు. ఎక్కువ ప్రీమియం వేరియంట్, VIP విత్ ఎగ్జిక్యూటివ్ లాంచ్ ప్యాకేజీ ధర రూ.1.29 కోట్లు. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. సంజు ఏ వేరియంట్‌ను కొన్నాడో తెలీదు. ఇది 2.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో బలమైన హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడింది. దాదాపు 193 PS పవర్, 240 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








