పల్సర్ బైక్ మీద అమ్మాయితో ఆటలు.. ఓవరాక్షన్‌కు బుద్ధి చెప్పిన పోలీసులు
కదిలే బైకుపై రొమాన్స్ చేసుకోవడం ఓ ఫ్యాషన్ అనుకుంటూ.. దాని వెనుక ఎంత ప్రమాదం పొంచి ఉందో మరచిపోతున్నారు. ఇలాంటి వారికి పోలీసులు ఎప్పటికప్పుడు సరైన గుణపాఠం చెబుతున్నారు. ఇటీవల బెంగళూరు పోలీసులు ఇలాంటి చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నారు.
సోషల్ మీడియాలో వెల్లడైన వీడియోలో బైక్ రైడ్ చేస్తున్న రైడర్ ఒడిలో.. ఓ యువతి కూర్చుని ఉండటం చూడవచ్చు. ఆ యువతి బైక్ రైడ్ చేసే యువకుని మెడను చేతులతో చుట్టేసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ ఘటన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో జరిగింది. బజాజ్ పల్సర్ బైకుపై వెల్తూ యువతి.. యువకులు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయిపోయింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ వీడియో బెంగళూరు పోలీసుల కంట పడింది. పోలీసులు వెంటనే బైకును, రైడర్‌ను ఇద్దరినీ గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ వీడియోను బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ ఎక్స్ (ట్విటర్) పేజీలో షేర్ చేస్తూ.. ఇది థ్రిల్ కోసం కాదు, రోడ్డు ఉన్నది ఇలాంటి విన్యాసాలు చేయడానికి కాదు, ఇతర రైడర్లకు హాని కలిగించకుండా.. సురక్షితమైన రైడ్ చేద్దాం అని ట్వీట్ చేశారు.
హెబ్బాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో వీరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఎంత జరిమానా విధించారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకూడదని పోలీసులు పబ్లిక్ రోడ్డుపై ఇలాంటి విన్యాసాలను చేసేవారికి మంచి గుణపాఠం చెబుతున్నారు. వీడియోలో కనిపించే వారికి తప్పకుండా జరిమానా విధించి ఉంటారని భావిస్తున్నాము.

రోడ్డుపై ఇలాంటి చర్యకు పాల్పడిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవటంతో.. నెటిజన్లు పోలీసులను తెగ పొగిడేస్తున్నారు. బైక్ రైడ్ చేస్తున్న సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి ఇదే సరైన గుణపాఠం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
పబ్లిక్ రోడ్డపైన బైక్ రైడ్ చేస్తూ.. విన్యాసాలు చేయడం చాలా మంది రైడర్‌లలో కొత్త ఆనవాయితీగా మారింది. పోలీసులు మరియు ఇతర సంబంధిత అధికారులు ఇటువంటి ప్రవర్తనలపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొంతమంది యువత మాత్రం బాధ్యతరహితంగానే ప్రవర్తిస్తున్నారు. ఇది కేవలం ఆ బైక్ రైడర్లకు మాత్రమే కాకుండా.. రోడ్డుపైన ప్రయాణించే ఇతరులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది.
గతంలో అహ్మదాబాద్‌కు చెందిన ఓ జంట కదులుతున్న బైక్‌పై రొమాంటిక్ యాక్టివిటీస్‌లో నిమగ్నమై ఉన్నారు. దానికి సమ్బద్నహించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి వారికి రూ. 21000 జరిమానా విధించారు. ఇలాంటి చర్యలను ఆపడానికి పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కొంతమంది మాత్రం ఇదేదో ఫ్యాషన్ మాదిరిగా ఫీలయిపోతూ ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో ఇండియా కూడా ఒకటి. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి సంబంధిత ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ.. మోటార్ వెహికల్ చట్టాన్ని విధిగా అమలు పరుస్తున్నారు. అయితే రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ప్రజలు కూడా తప్పకుండా సహకరించాలి. లేకుంటే మన దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం లేదు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








