నడిరోడ్డుపై పోలీస్ వేలు కొరికిన వ్యక్తి - నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సంఘటల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల మీద కొంత దురుసుగా ప్రవర్తించడం చూసే ఉంటారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియోలో మాత్రం దానికి భిన్నంగా జరిగింది. ఇక లేటెందుకు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మీరు గమనించినట్లతే.. విధుల్లో ఉన్న పోలీస్ అధికారుల్లో ఒకరు, హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద వస్తున్న వ్యక్తిని ఆపి, వెహికల్ కీ(తాళం) తీసుకున్నట్లు కనిపిస్తుంది. వెంటనే స్కూటర్ మీద ఉన్న వ్యక్తి కిందికి దిగి పోలీసు మీద కోపంగా ప్రవర్తించడమే కాకుండా అతని చేతిలో ఉన్న కీ లాక్కోవడానికి ప్రయత్నించాడు. పోలీస్ 'కీ'ను గట్టిగా పట్టుకుని ఉండటం వల్ల వేలిని కోరుకుతాడు.

Bengaluru Man Bites Traffic Police Hand

పోలీసులు మీద దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి 'సుజుకి యాక్సెస్' స్కూటర్ మీద రావడం చూడవచ్చు. ఆ వ్యక్తి పేరు 'సయ్యద్ సఫీ' అని తెలుస్తోంది. ఈ సంఘటన ఈ రోజు (మంగళవారం) బెంగళూరులోని విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ జరిగినట్లు సమాచారం. సదరు వ్యక్తి హెల్మెట్ తెచ్చుకోవడం మర్చిపోయాయని, వీడియో వైరల్ అయినా పరవాలేదని దురుసుగా చెప్పడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.

అక్కడ జరిగే సంఘటన చూసి ఒక వ్యక్తి, పోలీసులపై దురుసుగా ప్రవరించిన వ్యక్తిని ఎందుకు పోలీసును కొరికావు అని అడగ్గా.. నేను ఆసుపత్రికి వెళ్తున్నానని, స్కూటర్ కీ తీసుకోవడం వల్ల కొరికానని ఏవేవో చెప్పడం కూడా వీడియోలో చూడవచ్చు. ఏది ఏమైనా విధుల్లో ఉన్న పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం క్షమించరాని నేరం. తప్పకుండా ఇతన్ని కఠినంగా శిక్షించాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Bengaluru Man Bites Traffic Police Hand

పోలీసులు దగ్గర దురుసుగా ప్రవరించిన వ్యక్తి అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే.. పోలీసులను కొంత రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా సహరిస్తారు. అలా కాకుండా పోలీసులంటే ఏ మాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించడం ఏ మాత్రం సమంజసం కాదు. ఇతని ప్రవర్తనను, పోలీస్ మీద చేసిన దౌర్జన్యానికి, కొరికి గాయపరిచినందుకు మరియు శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు అతని మీద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

నిజం చెప్పాలంటే ట్రాఫిక్ పోలీసులు బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పడే కష్టాలు చూసిన వారికే అర్థమవుతుంది. అసలే రద్దీగా ఉండే ప్రదేశం, ప్రమాదాలను నివారించడంలో భాగంగా వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారిని గౌరవించడం వదిలేసి, దురుసుగా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఎవరికి వారు ప్రశించుకోవాల్సిన అంశం.

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు, లెక్కకు మించిన వాహనం వినియోగదారులు అంగవైకల్యానికి గురౌతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు కూడా కఠినమైన ట్రాఫిక్ రూల్స్ అమలు పరుస్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ రైడ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి వాటిలో పట్టుబడ్డ ఎవరైనా.. ఎంతవారైనా శిక్షార్హులే. ఇది నేటి సమాజంలో పోలీసులు పాటిస్తున్న సూత్రం.

హెల్మెట్ తప్పనిసరి

బెంగళూరు నగరంలో బైక్, లేదా స్కూటర్ రైడ్ చేసే వ్యక్తి మాత్రమే కాకుండా పిలియన్ కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలి. లేకుంటే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. ఈ కారణంగానే బెంగళూరులో దాదాపు రైడర్లు, పిలియన్స్ హెల్మెట్ వేసుకునే కనిపిస్తారు. నిజానికి హెల్మెట్ వేసుకోవడం అనేది రైడర్ తనకు తాను కాపాడుకోవడం కోసమే. అయితే దీన్ని మర్చిపోయి పోలీసులు జరిమానా విధించినా.. వారిపని వారు చేసినా కొందరు దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

ఇక చివరగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. మీరు రోడ్డుపై వెహికల్ మీద ప్రయాణించేటప్పుడు పోలీసులు ఆపితే తప్పకుండా వారికి సహకరించండి. పోలీసులు మీతో దురుసుగా లేదా కఠినంగా ప్రవరిస్తే వారి పేరు, పనిచేసే స్థలం తెలుసుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ హక్కును అందరూ ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఎప్పుడూ పోలీసులు మీద దురుసుగా ప్రవర్తించడం మానుకోవాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 13, 2024, 17:43 [IST]
English summary
Bengaluru man bites traffic police after being caught without helmet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+