Just In
Don't Miss
- Sports
ICC T20 Rankings: రాహుల్ ర్యాంక్ పదిలం.. దూసుకెళ్లిన కాన్వే
- News
దుస్తులు విప్పి చూపించాలని... ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు...
- Finance
పేపాల్ గుడ్న్యూస్, వెయ్యి ఇంజీనీర్ ఉద్యోగులు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఛాన్స్
- Movies
ప్రియాంక చోప్రా నాకు దూరంగా.. ప్రపంచం తలకిందులైనట్టుగా.. నిక్ జోనస్ షాకింగ్ కామెంట్
- Lifestyle
బెడ్ రూమ్ లో ఈ లోదుస్తులుంటే... రొమాన్స్ లో ఈజీగా రెచ్చిపోవచ్చని తెలుసా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువవుతోంది. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాలను సరిగ్గా పాటించకపోవడం. అంతే కాకుండా హెల్మెట్స్ ధరించకపోవడం, మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేయడం వంటివి కూడా రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఈ కారణంగా రోడ్డు ప్రమాదాల స్థాయిని తగ్గించడానికి కఠినమైన రోడ్డు నిబంధనలు అమలులోకి వచ్చాయి.

ఈ నిబంధలను వల్ల ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినట్లైతే భారీ జరిమానాలు విధించడమే కాకుండా వాహనదారులపై కేసు నమోదు చేయడం మరియు వాహనాన్ని జప్తుచేయడం వంటివి జరుగుతాయి. ఇదే విధంగా బెంగళూరులో ఒక సంఘ్తన వెలుగులోకి వచ్చింది.

బెంగళూరులోని మడివాల ప్రాంతానికి చెందిన ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకపోవడం, నంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల అరుణ్ కుమార్‌ను పోలీసులు ఆపారు.
MOST READ:ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?

పోలీసులు అతనికి జరిమానా విధించే క్రమంలో ఇప్పటికే తనమీద 75 కేసులు ఉన్నట్లు తెలుసుకున్నారు, శుక్రవారం ఉల్లంఘించిన రెండు కేసుల వల్ల మొత్తం 77 కేసులు నమోదు చేశారు.

రెండేళ్లుగా అరుణ్ కుమార్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు ట్రిపుల్ రైడింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. అందువల్ల అందువల్ల జరిమానా మొత్తం రూ. 42,500 చెల్లించాలని కోరారు. కానీ అరుణ్ కుమార్ ద్విచక్ర వాహనం విలువ రూ .30,000 కన్నా తక్కువ.
MOST READ:భారత మార్కెట్లో డుకాటీ మల్టీస్ట్రాడా 950 ఎస్ బిఎస్ 6 బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ట్రాఫిక్ పోలీసులు జరిమానా చెల్లించామని చెప్పారు, కానీ అరుణ్ కుమార్ జరిమానా చెల్లించడానికి నిరాకరించాడు. జరిమానా చెల్లించడానికి నిరాకరించిన తరువాత, పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనా ట్రాఫిక్ ఉల్లంఘించడం చట్టరీత్య నేరం, ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల కేవలం వాహనదారునికి మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.

ప్రపంచంలో ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాలలో భారతదేశం కూడా ప్రధానమైనది. ప్రతి ఏటా దాదాపు లక్షకు పైగా రోడ్డుప్రమాదాలలో మరణిస్తున్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించి కొంత వరకు అయినా ఈ ప్రమాదాలనుంచి బయట పడాలి.