స్వతహాగా తయారు చేసుకున్న సోలారు కారులో 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన కోలార్ తాత

By Anil

దేశ వ్యాప్తంగా ఎన్నో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అందులో వేళ మంది విద్యార్థులు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. కాని వారికి రాని ఆలోచన ఒక సాదారణ 63 ఏళ్ల వ్యక్తికి వచ్చింది. నిరక్ష్యరాస్యుడైన ఈ వ్యక్తి స్వతహాగా ఒక సొంత సోలార్ కారును రూపొందించుకుని దాదాపుగా 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి రికార్డ్ సృష్టించాడు.

ఇతని అధ్బుత ఆవిష్కరణ వెనకున్న అతి ముఖ్యమై విశయాలు, అతను ఎదిగిన తీరు, అతను సృష్టించిన ఈ రూపానికి దోహదపడిన అంశాలు వంటి ఇతర విషయాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

 సోలార్ కారులో కోలార్ తాత రికార్డ్ ప్రయాణం

ఇతని పేరు సైయ్యద్ సజ్జన్ అహ్మద్, బెంగళూరు నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్ లో జన్మించాడు. ఇతను 12 వ తరగతిలో చదువు మానేసి కుటుంబ భారం తన మీద వేసకున్నాని చెప్పుకుంటూ వచ్చాడు.

Picture credit: Spinning the Green Wheel

 సోలార్ కారులో కోలార్ తాత రికార్డ్ ప్రయాణం

ప్రారంభంలో పండ్ల వ్యాపారంతో మొదలైన ఇతని ప్రయాణం నెమ్మదిగా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేరి చేసే షాపును ప్రారంభించి ఆ తరువాత ట్రాన్సిస్టర్ల్, టేప్ రికార్డర్లు, టివి సెట్లు మరియు యాంటెన్నా వంటి వస్తువుల గురించి పూర్తిగా తెలుసుకున్న అహ్మద్ కంప్యూర్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు.

 సోలార్ కారులో కోలార్ తాత రికార్డ్ ప్రయాణం

నాకు 15 ఏళ్ల వయస్సున్నపుడు కుటుబం కోసం సంపాదించడం మొదలు పెట్టానని, కాని ఇప్పుడు నా వయస్సు దాటింది, నేను చనిపోయే లోపు సమాజం కోసం ఏదో ఒకటి సృష్టించాలని గట్టిగా నిర్ణయించుకున్నాని సయ్యద్ 2002 లో ఈ మాటలను అన్నడు. నేడు ఆ మాటలకు ప్రాణం పోశాడు.

 సోలార్ కారులో కోలార్ తాత రికార్డ్ ప్రయాణం

అందులో భాగంగా ఎలక్ట్రిక్ పవర్ ద్వారా టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్‌నున నడపడం చేశాడు. ఇతని ఆవిష్కరణలకు గాను కర్ణాటక ప్రభుత్వం నుండి పర్యావరణ పరిక్షణకు పాటు పడినందుకు ఇతనికి అవార్డు ఇచ్చింది. మరియు 2006 లో అప్పటి ప్రధాన మంత్రి అయిన అబ్దుల్ కలాం గాకి చేతుల మీదుగా ఇతని ప్రయాగాలకు గాను అవార్డు అందుకున్నాడు.

Picture credit: Solar Sound Bangalore

 సోలార్ కారులో కోలార్ తాత రికార్డ్ ప్రయాణం

అహ్మద్ దీని గురించి వివరిస్తూ ఇందులో ఐదు సోలార్ ప్యానెల్స్ ను ఉపయోగించానని తెలిపాడు ప్రతి ప్యానెల్ యొక్క కెపాసిటి 100 వ్యాట్స్. ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా విడుదలైన మొత్తం ఎనర్జీ ఇందులో గల ఆరు బ్యాటరీలలో నిలువ అవుతుంది. ప్రతి బ్యాటరీ యొక్క కెపాసిటి 12 వోల్ట్స్ మరియు 100 ఎయమ్‌పిఎస్.

Picture credit: Solar Sound Bangalore

 సోలార్ కారులో కోలార్ తాత రికార్డ్ ప్రయాణం

ఈ ఆరు బ్యాటరీలో నిల్వ ఉన్న ఎనర్జీ ఈ ఫోర్ వీల్ కారులోని రెండు చక్రాలు తిరగడానికి ఉపయోగపడుతుంది. ఈ సోలార్ కారు ద్వారా అహ్మద్ దాదాపుగా 3,000 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డ్ సృష్టించాడు.

దీని ద్వారా ఘాట్ రోడ్లలో, కొండ ప్రాంతాల్లో, ఇసుక రోడ్ల మీద ఇలా అన్ని రోడ్ల మీద ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రయాణిం చేశానని తెలిపాడు.

Picture credit: Solar Sound Bangalore

 సోలార్ కారులో కోలార్ తాత రికార్డ్ ప్రయాణం

అహ్మద్ తన ఢిల్లీ యాత్రకు బెంగళూరులోని రాజ్‌భవనం నుండి ఢిల్లీకి నవంబర్ 1 వ తేదిన ఈ సోలార్ కారు ద్వారా ప్రయాణం చేసినట్లు తెలిపాడు. ఈ సోలార్ కారును రూపొందించిన సమయం నుండి వ్యక్తిగత అవసరాల కోసం మొత్తం 1.1 లక్షల కిలోమీటర్లు తిరిగినట్లు తెలిపాడు.

 సోలార్ కారులో కోలార్ తాత రికార్డ్ ప్రయాణం

సోమ వారం నాడు ఢిల్లీలో సైన్స్ మరియు టెక్నాలజీకి చెందిన యూనియన్ మినిస్టర్ హర్షవర్ధన్ కు దీని గురించి అహ్మద్ స్వయంగా వివరించాడు. ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ కేవలం లక్ష రుపాయలకే దీనిని రూపొందించుకోవచ్చని తెలిపాడు.

Picture credit: Spinning the Green Wheel

 సోలార్ కారులో కోలార్ తాత రికార్డ్ ప్రయాణం

అబ్దుల్ కలాం గారి ప్రేరణతో: ఇతను ఇలా ఈ సోలార్ వాహనాలను రూపొందించడానికి కారణం అబ్దుల్ కలాం గారి ఆలోచనలు, అతని ప్రేరణలు వీటిని ఆవిష్కరించడానికి కారణం అయ్యాయని తెలిపాడు. దేశ వ్యాప్తంగా ఇతను చేసిన ప్రయాణం ద్వారా ఎంతో మంది విద్యార్థుల్లో మార్పు తీసుకు రావాలని , వారు ప్రయోగాల దిశగా అడుగులు వేసే విధంగా మోటివేట్ చేశానని తెలిపాడు.

Picture credit: Solar Sound Bangalore

లీటర్ పెట్రోల్‌తో 360 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల స్కూటర్‌
  • లీటర్ పెట్రోల్‌తో 360 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల స్కూటర్‌ను రూపొందించిన కన్నడ విద్యార్థి

More from DriveSpark

Article Published On: Wednesday, December 9, 2015, 11:01 [IST]
English summary
Bengaluru Man Travels 3000km Self Built Solar Car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+