ఇది మెట్రో ట్రైనా లేదంటే ముంబయి లోకల్‌ ట్రైనా.. ఈ వీడియోను చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.!!

సాధారణంగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఆర్టీసీ బస్సులు ఎంత రద్దీగా ఉంటాయో మనకు తెలిసిందే.. అందుకే ప్రత్యామ్నాయంగా లోకల్ రైళ్లు, మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ మెట్రో రైళ్లు కూడా రద్దీగా మారితే.. పరిస్థితి ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ప్రస్తుతం బెంగళూరు మెట్రో రద్దీకి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

దేశంలో రద్దీగా ఉండే ప్రధాన నగరాల్లో బెంగళూరు ముందు వరుసలో ఉంటుందనే చెప్పవచ్చు. ఐటీ సంస్థలకు నెలవుగా ఉన్న బెంగళూరులో రోడ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. అందుకే అక్కడ ట్రాఫిక్‌పై సోషల్‌ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్‌ వస్తుంటాయి. ఉద్యోగ రీత్యా నగరానికి వచ్చే జనాభాతో బెంగళూరు ఎప్పుడూ రద్దీగా ఉండటంతో ఈ సమస్య ఏర్పడుతుంది.

Bengaluru-Metro-Train-Viral-Video

ఈ క్రమంలో బెంగుళూరు మెట్రోలో మహిళా ప్రయాణికులతో రద్దీగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయి ట్రెండింగ్‌లో ఉంది. ఆశ్చర్యమేమిటంటే.. నెటిజన్లు దీనిని ముంబై లోకల్ రైళ్లతో పోల్చుతున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన పర్పుల్ లైన్ మెట్రో రైలు ముందు కంపార్ట్‌మెంట్ కూడా వారితో నిండిపోయి ఉండటమే కాకుండా.. ఇంకా చాలా మంది క్యూలో వేచి ఉండటాన్ని చూడవచ్చు.

ఇందుకు సంబంధించి 6 సెకన్ల నిడివి ఉన్న వీడియోను X(గతంలో ట్విట్టర్‌) పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 7,50,000 కు పైగా వ్యూస్‌ను సంపాదించి వైరల్‌గా మారడంతో ఈ వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Bengaluru-Metro-Train-Viral-Video

ముంబయి, ఢిల్లీతో పోలిస్తే బెంగళూరులో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందని కామెంట్‌ చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజల వలసల కారణంగా బెంగళూరు ఈ సమస్యను ఎదుర్కొంటోందని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ముంబయి లోకల్ ట్రైన్ కంటే మెట్రో ట్రైన్‌ సురక్షితమైనదని మరో నెటిజన్‌ అభిప్రాయపడ్డారు.

కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న ఏ నగరంలో నైనా ఇది సాధారణమే నంటూ మరో నెటిజన్‌ అన్నారు. ఎంతయినా ముంబయి లోకల్‌ ట్రైన్‌లోని వైబ్స్‌ బెంగళూరు మెట్రోలో లేవంటూ మరో నెటిజన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా నెటిజన్ల క్రేజీ కామెంట్లతో ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

Bengaluru-Metro-Train-Viral-Video

కాగా 2022కి సంబంధించి ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే నగరాల జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఆ జాబితాలో లండన్ మొదటి స్థానంలో ఉండగా 'సిలికాన్‌ వ్యాలీ' బెంగళూరు రెండో స్థానంలో ఉంది. నివేదికలు వెల్లడించిన వివరాల ప్రకారం బెంగళూరులో ప్రతి 10 కి.మీ ప్రయాణించడానికి 29 నిమిషాల 10 సెకన్లు పడుతుందని తేలింది.

అంతే కాకుండా ఇటీవల కదులుతున్న బైక్‌పై వెనుక సీటుపై కూర్చొని ఓ మహిళ ల్యాప్‌టాప్‌పై పని చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది బెంగళూరు ట్రాఫిక్‌కు అద్దం పడుతుంది. 'డెడ్ లైన్ & డెత్ ఇన్ సేమ్ ఫ్రేమ్' అని ఓ నెటిజన్‌ అక్కడి పరిస్థితులను క్లుప్తంగా వివరించారు.

More from DriveSpark

Article Published On: Saturday, October 28, 2023, 15:37 [IST]
English summary
Bengaluru metro train faces overcrowding like mumbai local train video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+