ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

రోజురోజుకి వాహనాలు పెరిగిపోతూనే ఉన్నాయి, పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. పెరుగుతున్న ఈ ట్రాఫిక్ నియంత్రించడానికి పోలీసులు మాత్రమే సరిపోవడం లేదు . ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సిగ్నల్ లైట్లు ట్రాఫిక్ పోలీసులు లేనప్పుడు ట్రాఫిక్ రద్దీని నిర్ధారిస్తాయి.

టాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

ఈ సిగ్నల్ లైట్లు వాహనాలను నిలపడానికి మరియు ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండమని నిర్ణయిస్తాయి. ఈ లైట్స్ లో రెడ్, ఎల్లో మరియు గ్రీన్ వంటి సింబల్స్ వాహనదారులు గమనించి ఉంటారు. రెడ్ సిగ్నెల్ వచ్చినప్పుడు ఆగమని, ఎల్లో వచ్చినప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని మరియు గ్రీన్ సిగ్నెల్ వస్తే ముందుకు వెళ్ళమని అర్థం. ఈ సిగ్నల్ లైట్లలో ఇప్పుడు టైమర్ ఉంటుంది. గతంలో, ట్రాఫిక్ పోలీసులు బటన్లతో సిగ్నల్ లైట్లను నియంత్రిస్తున్నారు.

టాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

సిగ్నల్ లైట్స్ ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా ఆటోమేటెడ్ అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులకు సిగ్నల్ లైట్లు నిజంగా ఒక వరం. ఎందుకంటే వారి పడే శ్రమను కొంతవరకు తగ్గిస్తాయి. ట్రాఫిక్ నియంత్రణలో ఇంత గొప్ప పాత్ర వహిస్తున్న ఈ సిగ్నెల్ లైట్స్ కి ఇటీవల బెంగళూరు పోలీసులు సెలబ్రేషన్స్ చేశారు.

MOST READ:ఏప్రిల్ 7 న భారత మార్కెట్లో విడుదల కానున్న 'సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్' ; పూర్తి వివరాలు

టాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

ఈ సిగ్నల్ లైట్లను మొదట బెంగళూరులో ఉపయోగించారు. ఈ కారణంగా, బెంగళూరు నగర పోలీసులు సిగ్నల్ పోల్‌కు ప్రత్యేక నివాళి అర్పించారు. బెంగుళూరులో మొట్టమొదట ఉపయోగించిన సిగ్నల్ లైట్ పోల్ ఎన్ఆర్ జంక్షన్ వద్ద ఉంది. ఈ స్తంభం దాదాపు 60 సంవత్సరాలుగా వాడుకలో ఉంది.

టాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

గత సోమవారం ఈ సిగ్నల్ పోల్‌కు బెంగళూరు నగర పోలీసులు ప్రత్యేక నివాళి అర్పించారు. ఈ సిగ్నల్ లైట్ పోల్ 1963 లో వాడుకలోకి వచ్చినట్లు నగర పోలీసు అధికారి తెలిపారు. సి. చాందీ ఆ సంవత్సరం నగర పోలీసు కమిషనర్‌గా ఉండగా, బిఎన్ గరుడచార్ ట్రాఫిక్ విభాగం డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు.

MOST READ:కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

టాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

60 సంవత్సరాల క్రితం, ఎన్ఆర్ జంక్షన్ చాలా బిజీగా ఉన్న రద్దీ రహదారి. ఈ రహదారి భారీ ట్రాఫిక్ రద్దీకి కారణమైంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, అప్పటి పోలీసు కమిషనర్లు ఈ ప్రాంతంలో సిగ్నల్ పోల్ ఏర్పాటు చేశారు.

టాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

సిగ్నల్ పోల్ ఏర్పాటు చేసిన తరువాత ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గిందని మాజీ పోలీసు అధికారి, శాసనసభ్యుడు ఉదయ్ గరుడాచార్ తండ్రి బిఎన్ గరుడచార్ అన్నారు. బెంగుళూరులో మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్ కోసం చెన్నై నుండి కొన్ని ముఖ్యమైన వస్తువులను తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. తరువాత, నగరంలోని అనేక ప్రాంతాల్లో దశల వారీ ట్రాఫిక్ సిగ్నల్స్ అమలు చేయబడ్డాయి.

MOST READ:ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

టాఫిక్ సిగ్నల్ పోల్‌కి సెలబ్రేషన్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఎందుకో తెలుసా?

సిగ్నల్ లైట్ పోల్‌కు సెలబ్రెషన్స్ చేసిన బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీసుల పనిని బెంగళూరు ప్రజలు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న వాహనం;ఆకూ ఈ సిగ్నెల్ లైట్స్ లేకపోతే ఏమవుతుందో ఊహించలేము. కావున నిజంగా ట్రాఫిక్ సింగిల్ ఇప్పటి సమాజంలో చాలా పెద్ద పాత్ర వహిస్తున్నాయి, అనటంలో సందేహం లేదు.

Source: DH

Most Read Articles

English summary
Bengaluru Police Commemorate City's First Ever Traffic Signal Pole. Read in Telugu.
Story first published: Wednesday, March 17, 2021, 19:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X