పునీత్ రాజ్‌కుమార్‌ను గౌరవిద్దాం.. నాణ్యమైన ISI హెల్మెట్లను మాత్రమే ధరిద్దాం: పోలీసులు

పునీత్ రాజ్‌కుమార్, కన్నడ సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని పేరు. దురృష్టవశాత్తు ఈ యువ హీరో అతిపిన్న వయస్సులో గుండెపోటుతో కాలం చేసిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ దివంగత నటుడి గౌరవార్థం హైక్వాలిటీ హెల్మెట్‌ల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బెంగళూరు పోలీసులు కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. నాణ్యమైన హెల్మెట్లను ధరించి, రోడ్లపై సురక్షితంగా ప్రయాణించడం వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

పునీత్ రాజ్‌కుమార్‌ను గౌరవిద్దాం.. నాణ్యమైన ISI హెల్మెట్లను మాత్రమే ధరిద్దాం: పోలీసులు

ఈ ప్రముఖ నటుడిని గౌరవించే క్రమంలో, మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లు వంటి ద్విచక్ర వాహనాలను నడుపుతున్నప్పుడు, రైడర్లు అధిక నాణ్యత గల హెల్మెట్‌లను ధరించడం యొక్క ప్రాముఖ్యత గురించి సాధారణ ప్రజలలో అవగాహన పెంచడానికి బెంగళూరు పోలీసులు ఇప్పుడు ఈ కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. బెంగుళూరు పోలీసులు ప్రారంభించిన ఈ ప్రజా అవగాహన ప్రచారం ప్రధానంగా రోడ్డు ప్రమాదాల సమయంలో ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను రక్షించడంలో అధిక-నాణ్యత హెల్మెట్‌ల పాత్రపై ప్రత్యేక దృష్టి పెడుతుంది.

పునీత్ రాజ్‌కుమార్‌ను గౌరవిద్దాం.. నాణ్యమైన ISI హెల్మెట్లను మాత్రమే ధరిద్దాం: పోలీసులు

పునీత్ రాజ్‌కుమార్‌ గౌరవార్థం ప్రారంభించిన ఈ ప్రజా చైతన్య ప్రచార కార్యక్రమాన్ని ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్ ప్రారంభించారు. ఈ హెల్మెట్ అవగాహన ప్రచార కార్యక్రమంలో బెంగళూరు పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా, దివంగత నటుడి వాయిస్‌తో కూడిన ఓ వీడియోను కూడా పంచుకున్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రజలందరూ (రైడర్ మరియు పిలియన్ రైడర్ ఇద్దరూ) తప్పనిసరిగా ISI ప్రమాణాలతో కూడిన హెల్మెట్‌ల వినియోగించాల్సిందిగా పోలీసులు కోరారు.

పునీత్ రాజ్‌కుమార్‌ను గౌరవిద్దాం.. నాణ్యమైన ISI హెల్మెట్లను మాత్రమే ధరిద్దాం: పోలీసులు

ప్రజలు ఈ నిబంధనలు పాటించడం వలన పైనున్న పునీత్ రాజ్‌కుమార్ ఆత్మ సంతోషిస్తుందని, ఇదే ఆయనకు మీరు ఇచ్చే గౌరవం అని అన్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఈ సూపర్ స్టార్ తన కుటుంబ సభ్యుల ప్రతిజ్ఞ మేరకు తన కళ్లను కూడా దానం చేసి మరో నలుగురికి కంటి చూపును అందించారు. అలాగే, నటుడి అంతిమ కార్యక్రమాలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

పునీత్ రాజ్‌కుమార్‌ను గౌరవిద్దాం.. నాణ్యమైన ISI హెల్మెట్లను మాత్రమే ధరిద్దాం: పోలీసులు

పునీత్ రాజ్‌కుమార్ భౌతిక కాయాన్ని 3 రోజుల పాటు కంఠీరవ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. దివంగత నటుడుకి బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లో తల్లిదండ్రులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దివంగత కన్నడ నటుడి చివరి చిత్రమైన జేమ్స్ ఇప్పటికే థియేటర్లలో విడుదలైంది మరియు యావత్ సినీ పరిశ్రమకు చాలా ఎమోషనల్ మూవీగా నిలిచింది.

పునీత్ రాజ్‌కుమార్‌ను గౌరవిద్దాం.. నాణ్యమైన ISI హెల్మెట్లను మాత్రమే ధరిద్దాం: పోలీసులు

జేమ్స్ చిత్రంలో శ్రీకాంత్ ఆర్ శరత్‌కుమార్, హరీష్ పేరడి, ప్రియా ఆనంద మరియు మరికొంత మంది ఇతర నటీనటులు నటించారు. అలాగే, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించేందుకు కన్నడ చిత్ర పరిశ్రమ జేమ్స్‌ను సోలోగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం మరియు హిందీ వంటి అనేక ఇతర భాషలలో కూడా డబ్ చేయబడింది.

పునీత్ రాజ్‌కుమార్‌ను గౌరవిద్దాం.. నాణ్యమైన ISI హెల్మెట్లను మాత్రమే ధరిద్దాం: పోలీసులు

కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం, 2023 నుంచి అమలు

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి, భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సేఫ్టీ నిబంధనలను అప్‌డేట్ చేస్తూ వస్తోంది. తాజాగా, ఇప్పుడు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ హెల్మెట్ వినియోగం విషయంలో కూడా కొత్త సేఫ్టీ నిబంధనలను అమలు చేయబోతోంది. అదేంటంటే, నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లడానికి కొత్త భద్రతా నియమాలను వెల్లడించింది.

పునీత్ రాజ్‌కుమార్‌ను గౌరవిద్దాం.. నాణ్యమైన ISI హెల్మెట్లను మాత్రమే ధరిద్దాం: పోలీసులు

ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో బైక్ ప్రయాణిస్తున్నట్లయితే, ఆ పిల్లలకి కూడా తప్పనిసరిగా హెల్మెట్ మరియు సేఫ్టీ బెల్ట్ వంటి వాటిని తప్నిసరిగా ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతే కాకుండా పిల్లలతో పాటు బైక్ నడుపుతున్నప్పుడు బైక్ గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లకు మించకూడదని పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు 2023 నుండి అమలులోకి రానున్నాయి.

పునీత్ రాజ్‌కుమార్‌ను గౌరవిద్దాం.. నాణ్యమైన ISI హెల్మెట్లను మాత్రమే ధరిద్దాం: పోలీసులు

రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించడానికి, ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చుని ప్రయాణించే పిల్లలకు మరింత మెరుగైన భద్రతను కల్పించేందుకు కేంద్ర మోటారు వాహన చట్టాన్ని సవరించారు. ఈ నియమం నాలుగు సంవత్సరాల వయస్సు పైబడిన పిల్లలకు వర్తిస్తుంది. ప్రభుత్వం వెల్లడించిన ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘిస్తే వారికి గరిష్టంగా రూ. 1,000 వరకూ జరిమానా విధించబడుతుంది. అంతే కాకుండా మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది.

పునీత్ రాజ్‌కుమార్‌ను గౌరవిద్దాం.. నాణ్యమైన ISI హెల్మెట్లను మాత్రమే ధరిద్దాం: పోలీసులు

అలాగే, కొత్త నిబంధనల ప్రకారం, రైడర్ తన చిన్నారులను పట్టి ఉంచేందుకు ఉపయోగించే సేఫ్టీ హార్నెస్ అనేది తేలికైనది, వాటర్ ప్రూఫ్ మరియు మంచి కుషన్‌ ను కలిగి ఉండటంతో పాటు 30 కేజీల వరకు బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. రైడింగ్ సమయంలో పిల్లలను సురక్షితంగా ఉంచడానికి రైడర్ రెండు పట్టీలతో వచ్చే చైల్డ్ సేఫ్టీ హార్నెస్ తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది పిల్లల భద్రతకు భరోసాను ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 18, 2022, 19:04 [IST]
English summary
Bengaluru police intiates helmet campaign to honour late actor puneeth rajkumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+