టెక్నాలజీలో మరో అడుగు.. త్వరలో డ్రైవర్‌లెస్ మెట్రో - మొదట అక్కడే స్టార్ట్

భారతదేశంలో టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతోంది. ఈ తరుణంలో డ్రైవర్‌లెస్ మెట్రో ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మనం డ్రైవర్‌లెస్ కార్లను గురించి విన్నాం.. ఇక సమీప భవిష్యత్తులో డ్రైవర్‌లెస్ మెట్రో ట్రైన్లలో ప్రయాణించబోతున్నాం. ఇది వినటానికి ఎంతో ఎగ్జైట్మెంట్ అనిపిస్తోంది. ఇదే నిజమైతే.. అద్భుతంగా ఉంటుంది. ఈ డ్రైవర్‌లెస్ ట్రైన్లు అందుబాటులో రావడానికి ఇక ఎన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) మొదటి డ్రైవర్‌లెస్ మెట్రోను బెంగళూరులో ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) బెంగళూరులో తన మొదటి డ్రైవర్‌లెస్ ట్రైన్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి కావాల్సిన కోచ్‌లకు దిగుమతి చేసుకున్నట్లు, వాటిని టెస్ట్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే త్వరలోనే బెంగళూరులో డ్రైవర్‌లెస్ ట్రైన్లు పరుగులు తీయనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టెస్టింగ్ పూర్తయిన తరువాత డ్రైవర్ లేకుండా నడపగలవని నిర్ధారించడానికి సిగ్నలింగ్ టెస్టులను చేయనున్నారు.

Driverless Metro

ప్రస్తుతం భారతదేశం అంతటా మెట్రో ట్రైన్ల వినియోగం పెరుగుతోంది. మెట్రో రైల్ కార్పొరేషన్లు తమ నెట్‌వర్క్‌లను ఎప్పటికప్పుడు విస్తరించే దిశలో అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న మెట్రో ట్రైన్లను డ్రైవర్లు ఆపరేట్ చేస్తున్నారు. రాబోయే మెట్రోల్ ట్రైన్లు డ్రైవర్ అవసరం లేకుండా పనిచేస్తాయి. డ్రైవర్‌లెస్ మెట్రో భారతదేశంలో మొదటిసారి బెంగళూరులో ప్రారంభం కానుంది. దీన్ని బట్టి చూస్తే టెక్నాలజీ విస్తరణలో బెంగళూరు ఎంత అభివృద్ధి చెందుతోందో అర్థం చేసుకోవచ్చు.

బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్.. డ్రైవర్‌లెస్ మెట్రోలను టెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఎల్లో లైన్ నిర్మించినట్లు సమాచారం. ఇది బొమ్మసంద్ర నుంచి ఆర్వీ రోడ్ వరకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బీఎంఆర్‌సీఎల్ ఈ డ్రైవర్‌లెస్ ట్రైన్ కోచ్‌లను చైనా నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందులోని ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లను, లైట్లను బీఎంఆర్‌సీఎల్ అధికారులు టెస్ట్ చేస్తున్నారు.

Bengaluru Metro Train

బీఎంఆర్‌సీఎల్ కొనుగోలు చేసిన డ్రైవర్‌లెస్ ట్రైన్ కోచ్‌లు గత ఫిబ్రవరిలో బెంగళూరుకు చేరుకున్నాయి. డ్రైవర్‌లెస్ ట్రైన్లను నడపటానికి సిగ్నలింగ్ టెక్నాలజీ ప్రధానమైంది. కాబట్టి దీనిని సంబంధిత అధికారులు పలుమార్లు టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ.. రైలు కదులుతున్న సమయంలో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డ్రైవర్‌లెస్ ట్రైన్ ప్రమాదాలకు గురవుతుందేమో అనే సందేహం అవసరం లేదు.

డ్రైవర్‌లెస్ ట్రైన్లను పరీక్షించడానికి మౌలిక సదుపాయాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే బీఎంఆర్‌సీఎల్ ఎల్లో లైన్‌లో సిగ్నలింగ్ వ్యవస్థకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల చివరి నాటికి టెస్టింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టెస్టింగ్ పూర్తయిన తరువాత బొమ్మసంద్ర నుంచి ఎలక్ట్రానిక్ సిటీ, సిల్క్ బోర్డ్ మరియు జయదేవ గుండా ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

Bengaluru Metro Train

బెంగళూరులో ఈ డ్రైవర్‌లెస్ ట్రైన్ ప్రారంభమైతే.. ఐటీ కంపెనీ ఉద్యోగులకు చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఎందుకంటే ఎల్లో లైన్ ఎలక్ట్రాన్ సిటీ, సిల్క్ బోర్డు ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఆ తరువాత డ్రైవర్‌లెస్ ట్రైన్ సేవలు నగరంలోని అన్ని ప్రాంతాల్లోకి అందుబాటులో వస్తాయి. ప్రారంభంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయబడినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌లెస్ మెట్రో బెంగళూరు తరువాత దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 12, 2024, 13:40 [IST]
English summary
Bengaluru set to launch first driverless metro train in india
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+