Bengaluru to Tirupati Helicopter Service బెంగళూరు టు తిరుపతికి హెలికాప్టర్ సర్వీస్.. ఛార్జెస్ రూ.3.50 లక్షలు

తిరుమల తీర్థయాత్రను సులభతరం చేయడానికి కొత్తగా బెంగళూరు నుంచి తిరుపతికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించారు. బెంగళూరు నుంచి తిరుపతికి ప్రయాణం సుమారు 4 గంటల నుంచి 5 గంటలు పడుతుంది. హెలికాప్టర్ సేవతో తిరుమల వెళ్లే భక్తులు దాదాపు గంటన్నర సమయంలో తిరుపతి చేరుకోవడానికి అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు అంటున్నారు.

ఫ్లైబ్లేడ్ ఇండియా అనే సంస్థ బెంగళూరు మరియు తిరుపతి విమానాశ్రయాలను కలుపుతూ అదే రోజు తిరిగి వచ్చే హెలికాప్టర్ సేవలను ప్రారంభించింది. ఈ హెలికాప్టర్ సర్వీస్ రూ. 3,50,000కి అందుబాటులో ఉంది. ఈ ప్రయాణంలో హెలికాప్టర్‌లో ఒకేసారి 5 మంది ప్రయాణికులకు వసతి కల్పిస్తుంది.

Bengaluru to Tirupati Helicopter Service

అదనంగా బెంగళూరు మరియు తిరుపతి మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్లైబ్లేడ్ సంస్థ హెలికాప్టర్ సేవలు ఆన్ డిమాండ్ ప్రాతిపదికన అందుబాటులో ఉన్నాయి. ఇవి క్రౌడ్‌సోర్స్ లేదా చార్టర్డ్ కావచ్చు. ఈ కొత్త హెలికాప్టర్ సేవ యాత్రికుల సౌకర్యాన్ని మెరుగుపరుస్తుందని సంస్థ అధికారులు భావిస్తున్నారు.

ఫ్లైబ్లేడ్‌ సంస్థ అందించే హెలికాప్టర్ సర్వీస్ కారణంగా బెంగళూరు మరియు తిరుపతి మధ్య మెరుగైన కనెక్టివిటీ పెరిగి పర్యాటకాన్ని పెంచుతుందని సంస్థ ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ హెలికాప్టర్ సేవ ప్రధానంగా బెంగళూరు మరియు చుట్టుపక్కల ఉన్న వృద్ధ యాత్రికులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఇక ఈ హెలికాప్టర్ సర్వీస్ విషయానికొస్తే.. బెంగళూరు నుంచి ఉదయం 09:15 నుంచి 09:30 గంటల మధ్య HAL నుంచి ప్రారంభమవుతుంది. కొద్ది నిమిషాల్లోనే భక్తులు తిరుపతికి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 04:00 నుంచి 04:15 గంటల మధ్య బెంగళూరుకు పయనమవుతుంది.

ఫ్లైబ్లేడ్ హంచ్ వెంచర్స్ మరియు బ్లేడ్ ఎయిర్ మొబిలిటీ మధ్య జాయింట్ వెంచర్. ఇంకా, కంపెనీకి కర్ణాటకలో ఇతర హెలికాప్టర్ కనెక్టివిటీ సేవలు ఉన్నాయి. వీటిలో కొన్ని బెంగళూరు నుంచి కూర్గ్ వరకు, బెంగళూరు నుండి కబిని మరియు మరిన్ని సేవలు అందిస్తున్నాయి.

ఫ్లైబేడ్‌ కంపెనీ కేవలం రూ. 4,500 నుంచి బై ది సీట్ హెలికాప్టర్ సేవలను కూడా అందిస్తోంది. ఈ సేవ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (BIAL) మరియు సిటీ సెంటర్‌ను కలుపుతుంది. తాజాగా బెంగళూరు నుంచి కూర్గ్ మరియు కబినిని కలుపుతూ హెలికాప్టర్ సర్వీసులో వ్యక్తికి రూ. 20 వేలు ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఇది కాకుండా కొన్ని స్థానిక హెలికాప్టర్ సేవలను కూడా అందిస్తుంది.

భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో తిరుపతి దేవస్థానం ఒకటి. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. తిరుపతి దేవస్థానానికి విమాన సర్వీసును ప్రారంభించిన సంస్థ బ్లేడ్ ఇండియా సర్వీసు ఖరీదైన రవాణా సేవ కావడంతో ధనవంతులు మాత్రమే వినియోగించే సేవగా దీన్ని చూస్తారు.

ఫ్లైబ్లేడ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా బుకింగ్‌లు చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. BLADE India వెబ్‌సైట్‌లో లేదా 1800-102-5233లో బుకింగ్‌లు చేయవచ్చు. ఈ బుకింగ్‌లు కనీసం 24 గంటల ముందుగానే చేయాలి. దేశవ్యాప్తంగా యాత్రికులు తిరుపతి నగరానికి చేరుకుని తరువాత తిరుమల వెళ్లడానికి అవకాశం ఉంటుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నాక తరువాత తిరుమల వెళుతున్నారు.

భవిష్యత్తులో తిరుపతి ఆలయాన్ని కనెక్ట్ చేయడానికి ప్రముఖ కంపెనీలు వైమానిక సేవలను ప్రారంభించాలని చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అప్పుడు, భక్తులను అతి తక్కువ రుసుముతో తిరుపతి ఆలయానికి తీసుకెళ్లవచ్చు. ఆ రోజు త్వరలోనే రావాలని భక్తులు ఎదురుచూస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, June 9, 2023, 18:09 [IST]
English summary
Bengaluru to tirupati helicopter service full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+