అత్యంత వరెస్ట్ ట్రాఫిక్ నగరాల్లో రెండు భారత్‌‌‌వే.. 10 కిమీలకు 27 నిమిషాలు.. ఐదున్నర రోజులు రోడ్లపైనే..

ఇండియాలో నగర జనాభా విపరీతంగా పెరుగుతుంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం నగరాలకు తరలి రావడం, అలాగే, విద్యార్ధులు తమ పై చదువుల కోసం, నిరుద్యోగులు ఉద్యోగాలు, కోచింగ్‌ల కోసం నగరాలకు వస్తుండటంతో జనాభా దశాబ్దా కాలంతో పోలిస్తే దేశంలోని ప్రధాన నగరాల్లో భారీగా పెరుగుతుంది. గతంలో లక్షల సంఖ్యలో ఉన్న నగర జనాభా ఇప్పుడు కోటికి పైనే ఉందంటే పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయో అర్థం అవుతుంది. అయితే ఎంత ఫాస్ట్‌గా జన సంఖ్య పెరుగుతుందో దానికి తగ్గట్టు మౌలిక సదుపాయాలను కూడా కల్పించడం చాలా అవసరం. ఇదిలా ఉంటే ఇండియా ఐటీ నగరం బెంగళూరులో జనాభా భారీగా పెరుగుతుంది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత గాంచిన అంతర్జాతీయ సంస్థలు, దేశీయ కంపెనీలు తమ కార్యాలయాలను కలిగి ఉన్నాయి. దీంతో యువత ఉద్యోగాల కోసం దేశం నలుమూలల నుంచి ఇక్కడికి తరలి వస్తుంటారు.

అయితే ఈ జన సంఖ్య పెరగడం మూలంగా నగర ప్రజల అవసరాలకు సరిపోని విధంగా మారిపోయింది. పొద్దున లేచింది మొదలు చీకటి అయ్యే వరకు కూడా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ప్రజలు తమ రోజువారి అవసరాలకు సొంత వాహనాలను కలిగి ఉండటానికి ఆసక్తి చూపిస్తుండటంతో వ్యక్తిగత వాహనాల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో బెంగళూరు నగర రోడ్లపై రద్దీ భారీగా పెరుగుతుంది.

List Of Worst Asian City For Traffic

ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల సగటు ప్రయాణం సమయం, వాహనాలకు అయ్యే ఇంధన ఖర్చులు, CO2 ఉద్గారాలను లెక్కించే టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, ఆసియాలో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది. స్టాటిస్టా సంస్థ సోషల్ మీడియా అకౌంట్‌లో ఈ విషయాన్ని తెలిపింది. ప్రతిరోజు ఈ నగరంలో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది.

టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం, బెంగళూరు నగరంలో వాహనదారుడు ప్రతి 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు 28 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుంది. అంటే సిలికాన్ వాలీ ఆఫ్ ఇండియాగా పరిగణించే నగరంలో వాహనదారులు ఏటా 132 గంటలు అనగా ఐదున్నర రోజుల సమయం మొత్తం కూడా ట్రాఫిక్‌లోనే గడపుతున్నారు. మరికొన్ని సమయాల్లో ట్రాఫిక్ రద్దీ మరింత ఎక్కువ ఉంటే, ఇంకా ఎక్కువ సమయం ట్రాఫిక్‌లోనే వెచ్చించాల్సి వస్తుంది.

Asian Wosrt City For Traffic Details

బెంగళూరు నగరంలో రోజువారీ ట్రాఫిక్ సవాళ్ళను అధిగమించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా పెద్ద సవాలుతో కూడుకుంది. నగరంలో జనాభా పెరుగుతున్న కొద్ది రోడ్లను కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. దీని ద్వారానే అత్యంత రద్దీ ఉన్న నగరంగా నిలిచిన బెంగళూరు రానున్న రోజుల్లో ఈ జాబితాలో స్థానం కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. నివేదిక ప్రకారం, పూణే నగరంలో కూడా ట్రాఫిక్ రద్దీ విపరీతంగానే ఉంది.

స్టాటిస్టా ప్రకారం, పూణేలో ప్రతి 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు 27 నిమిషాల 50 సెకన్ల సమయం పడుతుంది. దీంతో అత్యంత ట్రాఫిక్ నగరాల జాబితాలో ఇది బెంగళూరు తరువాత రెండవ స్థానంలో నిలిచింది. తరువాత ఫిలిప్పీన్స్‌లోని మనీలా ప్రతి 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి 27 నిమిషాల 20 సెకన్ల సమయంతో మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో 26 నిమిషాల 50 సెకన్లతో తైవాన్‌లోని తైచుంగ్ స్థానం పొందింది.

Bengaluru Tops The List Of Worst Asian City For Traffic

ఇక గ్లోబల్ నగరాల విషయానికి వస్తే, లండన్‌లో వాహనదారులు ప్రతి 10 కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు 37 నిమిషాల 20 సెకన్ల సగటు సమయం తీసుకుంటున్నారు. ఇక భారత్‌లో రానున్న రోజుల్లో నగర జనాభా భారీగా పెరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోడ్లను విస్తరించడం, టన్నెల్‌లు, ఫ్లైఓవర్లను నిర్మించడం వంటి పలు చర్యల ద్వారా ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 3, 2025, 16:00 [IST]
English summary
Bengaluru tops the list of worst asian city for traffic here 10 km journey takes 28 minutes
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+