ఏకంగా 99 ట్రాఫిక్ చలాన్లతో యువకుడి రికార్డ్, ఖంగు తిన్న పోలీసులు.. స్కూటర్ అమ్మినా ఇంత డబ్బు రాదేమో.!!
తరచుగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే పోలీసులు వాహనం సీజ్ చేయడం ఖాయం. కానీ ఇక్కడ ఓ యువకుడు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 99 ట్రాఫిక్ ఉల్లంఘనల(99 Challans Pending)కు పాల్పడ్డాడు. చివరికి పోలీసులకు పట్టుబడటంతో అరెస్ట్ చేశారు. అసలు ఇన్ని ఉల్లంఘనలకు ఎలా పాల్పడ్డాడు. ఇన్ని రోజులు ఎలా తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎలా దొరికాడు.??
దేశంలోని ప్రధాన నగరాల్లో చాలా మంది చాలా వరకు ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించడం కామన్. ఫైన్‌లు కట్టకుండా దొరికినప్పుడు చూసుకోవచ్చులే అని ధీమాతో రోడ్లపై ధైర్యంగా తిరుగుతారు. ఒకవేళ పోలీసులకు దొరికినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. లేదంటే పోలీసులు వాహనం సీజ్ చేయడం కూడా చూస్తుంటాం.

అయితే బెంగళూరు ట్రాఫిక్ జామ్(Bengaluru Traffic Jam) గురించి అందరికీ తెలిసిందే.. ఇటీవల బంద్ మరియు సెలవులు వంటి కారణాల వల్ల బెంగళూరులోని చాలా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఆ సమయంలో బస్సు, ఆటో సహా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఓ యువకుడు తన ఆఫీసు నుంచి ఇంటికి దాదాపు 12 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువగా ఉన్నప్పటికీ, అక్కడ ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించే వారు చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ బాగా చదువుకున్నారు, ఉద్యోగాల్లో మంచి హోదాలో ఉన్న వారు ఎక్కువ మంది ఉండటమే ఇందుకు కారణం. అయితే అదే సమయంలో బెంగళూరులో కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారు కూడా ఉన్నారని తాజా ఘటన ద్వారా తెలుస్తోంది.

గత కొంతకాలంగా వరుస ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఈ యువకుడు.. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారికి యూత్ లీడర్ అనడంలో సందేహం లేదు. అతడిపైనా, స్కూటర్‌పైనా పలు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి ఐడెంటీని వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. పోలీసులు ఆ యువకుడిపై FIR నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని స్కూటర్ ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో ఉంది.
సాధారణంగా చిన్న చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై పోలీసులు కేసులు పెట్టరు. అయితే ఈ వ్యక్తికి దాదాపు 99 ట్రాఫిక్ ఉల్లంఘన రికార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా అతను రూ.56,000 జరిమానా కట్టాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా ఈ యువకుడు ఇప్పటికే కొన్ని ఉల్లంఘనలకు పెనాల్టీని చెల్లించినట్లు సమాచారం.

అయితే తరచూ యువకుడు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే స్కూటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. అసలు ఇంతకీ పోలీసులు ఈ వ్యక్తిని ఎలా పట్టుకున్నారంటే..
ప్రసన్న కుమార్ అనే సోషల్ మీడియా యూజర్.. సదరు యువకుడు రోడ్డుపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతుండగా వీడియో తీసి X(ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ, బెంగళూరు సిటీ పోలీస్ మరియు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ & రోడ్ సేఫ్టీ అలోక్ కుమార్‌ను ట్యాగ్ చేశారు.

వేగా సిటీ జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కారణంగా వ్యక్తి తన స్కూటర్‌ను రోడ్డుకు వ్యతిరేక దిశలో నడుపుతుండగా ప్రసన్న కుమార్ వీడియో తీసి పోస్ట్ చేశారు. ఇది ఆ యువకుడి యొక్క 100వ ట్రాఫిక్ ఉల్లంఘన. పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తి స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ KA05EM1946.
వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్‌లో ఉంచితే ఆ వాహనంపై ఎలాంటి కేసులు, ఎన్ని కేసులు ఉన్నాయో తెలుస్తుంది. వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉల్లంఘనకు పాల్పడిన యువకుడి వాహనం యొక్క పూర్తి వివరాలను ప్రసన్న కుమార్ ట్వీట్ చేశారు. ఈ ట్విటర్ పోస్ట్‌లను చూసిన బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి ప్రసన్న కుమార్‌ను ప్రశంసించారు.
ఆధునిక టెక్నాలజీ ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించిందో లేదో తెలియదు.. కానీ ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించే వారు త్వరగా పోలీసులకు చిక్కుతారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ద్వారా ఆ వ్యక్తిని పోలీసులు త్వరగా గుర్తించారు. అంతేకాకుండా, ఈ 100 ఉల్లంఘనలలో ఎక్కువ భాగం ఆన్‌లైన్‌లో నమోదైనవే కావడం ఆశ్చర్యం.


Click it and Unblock the Notifications








