ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో

మనం రోజు నిత్యా జీవితంలో ఎన్నెన్నో సంఘటనలు చూస్తూ ఉంటాము. అందులో కొన్ని ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన మాత్రం చూసేవారిని ఒక్కసారిగా షాక్కు షాక్‌కు చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక మహిళా స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళుతోంది. స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ పోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది అని మీకు సందేహం కలగొచ్చు. కానీ నిశితంగా పరిశీలిస్తే.. ఆ మహిళా తలకు ఒక స్కార్ఫ్ (గుడ్డ)తో గట్టిగా కట్టి ఉంది. ఆమె చెవి దగ్గర చూస్తే మొబైల్ ఫోన్ ఉండటం గమనించవచ్చు. ఇది చూడగానే వాట్ ఏ ఐడియా సర్జీ అనుకున్నారా?

Bengaluru Woman Using Mobile Phone While Scooter Riding

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఈ సంఘటన బెంగళూరులోని విద్యారణ్యపుర సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ వినియోగించడంలో ఈ మహిళ ట్రెండ్ సెట్ చేసిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మార్చి 26న వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను ఏఐ కెమెరాలు రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. నగరంలో చాలా వరకు ఏఐ కెమెరాలు ఇన్‌స్టాల్ చేయడం వల్ల అక్కడక్కడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

మార్చి 26వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో బెంగళూరులోని విద్యారణ్యపుర ఎన్‌టిఐ గ్రౌండ్స్ ఎదురుగా జరిగిన ఈ ఘటనలో స్కూటీ డ్రైవ్ చేస్తున్న మహిళ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటికే 24000 కంటే ఎక్కువమంది వీక్షించారు. 200 కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Bengaluru Woman Using Mobile Phone While Scooter Riding

ఈ వీడియో చూసిన వారిలో ఒకరు నా వ్యాపార భాగస్వామి తన హెల్మెట్ మధ్య మొబైల్ ఉంచి ఇలాగే చేసాడు, అతనికి కొచ్చిలో పోలీసులు రూ. 500 జరిమానా విధించారు అని కామెంట్ చేసాడు. హెల్మెట్ లోపల మొబైల్ ఉంచుకున్న వారిని చూసాను.. ఇలాంటి సన్నివేశం చూడటం ఇదే మొదటిసారి అని మరొకరు కామెంట్ చేశారు. పోలీసుల కంట పడితే బాగుంటుందనే విధంగా ఇంకొకరు కామెంట్ చేశారు.

నిజానికి పబ్లిక్ రోడ్డు మీద ఇలాంటి చర్యలకు పాల్పడటం చట్టరీత్య నేరం. వీడియోలో కనిపించే మహిళ స్కూటీ రైడింగ్ మీద కాకుండా మొబైల్ మీద ఎక్కువ ద్రుష్టి పెడుతుంది. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చేవారు లేదా పక్కన నుంచి వచ్చే వారిని గమనించక పోవచ్చు. ఆ సమయంలో జరిగే ప్రమాదం ఊహాతీతమనే చెప్పాలి. ప్రమాదం జరిగితే ప్రాణాలే కోల్పోయే అవకాశం ఉంటుంది.

ఇక మరో విషయం గమనిస్తే.. స్కూటీ రైడ్ చేసే మహిళ హెల్మెట్ ధరించకపోవడం కూడా గమనించవచ్చు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద టూ వీలర్ మీద ప్రయాణించే వారు తప్పకుండా.. హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ప్రమాదంలో ప్రాణాలు కాపాడే బ్రహ్మాస్త్రం. పబ్లిక్ రోడ్డు మీద హెల్మెట్ ధరించకపోవడం మాత్రమే కాకుండా.. మొబైల్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తోంది. ఇది ఆమెకు మాత్రమే కాకుండా.. రోడ్డుపైన ప్రయాణించే ఇతరులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 28, 2024, 18:26 [IST]
English summary
Bengaluru woman call while phone riding video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+