కర్ణాటకలో రూ. 6.5 కోట్ల ఫస్ట్ Bentley Bentayga కొనుగోలు చేసిన వ్యక్తి.. ఇతడే

ప్రపంచ మార్కెట్లో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందుతున్న లగ్జరీ వాహన విభాగంలో ఒకటి Bentley Bentayga (బెంట్లీ బెంటైగా). Bentley Bentayga లగ్జరీ వెహికల్ 2021 లో భారతీయ మార్కెట్లో విడుదల చేరింది. ఇది అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీని కర్ణాటక రాష్ట్రానికి చెందిన రోహన్ కార్పొరేషన్ ఓనర్ 'రోహన్ మోంటిరో' కర్ణాటక రాష్ట్రంలోనే మొట్ట మొదటి Bentley Bentayga కారుని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.

కర్ణాటకలో రూ. 6.5 కోట్ల ఫస్ట్ Bentley Bentayga కొనుగోలు చేసిన వ్యక్తి.. ఇతడే

రోహన్ మోంటిరో కొనుగోలు చేసిన Bentley Bentayga వి8 వేరియంట్. ఇది ఈ లైనప్ లో పవర్ పుల్ డబ్ల్యు12 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త Bentley Bentayga కారు ధర సుమారు రూ. 6.5 కోట్లు(ఎక్స్ షోరూమ్). అదే విధంగా ఈ మోడల్ యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 4.1 కోట్లు(ఎక్స్ షోరూమ్).

కర్ణాటకలో రూ. 6.5 కోట్ల ఫస్ట్ Bentley Bentayga కొనుగోలు చేసిన వ్యక్తి.. ఇతడే

సాధారణంగా Bentley Bentayga వంటి విలాసవంతమైన లగ్జరీ కార్లను ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు మరియు సినీ పరిశ్రమలోని వారు కొను గోలుచేస్తూ ఉంటారు. దాని అత్యధిక ధర కారణంగా ఎక్కువమంది సాధారణ ప్రజలు కొనుగోలు చేయలేరు. కానీ ఇహి ధరకు తగిన విధంగానే అత్యంత విలాసవంతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

కర్ణాటకలో రూ. 6.5 కోట్ల ఫస్ట్ Bentley Bentayga కొనుగోలు చేసిన వ్యక్తి.. ఇతడే

కొత్త Bentley Bentayga కారు ప్రపంచ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే భారతీయ మార్కెట్లో విడుదలైంది. Bentley Bentayga ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన అత్యంత విలాసవంతమైన కారు. ఎక్కువమంది సంపన్నులు ఈ SUV కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.

కర్ణాటకలో రూ. 6.5 కోట్ల ఫస్ట్ Bentley Bentayga కొనుగోలు చేసిన వ్యక్తి.. ఇతడే

Bentley Bentayga చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికోసం బయటివైపు అనేక కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలమైన లగ్జరీ మోడల్. ఈ SUV ముందు భాగంలోని గ్రిల్ కొత్త డిజైన్ కలిగి ఉంటుంది. అంటే కాకుండా కొత్త ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్‌లు మునుపటికంటే కూడా చాలా అప్డేటెడ్ గా ఉంటాయి.

కర్ణాటకలో రూ. 6.5 కోట్ల ఫస్ట్ Bentley Bentayga కొనుగోలు చేసిన వ్యక్తి.. ఇతడే

ఇక Bentley Bentayga యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ కొత్త 3D ఎలిప్టికల్ టెయిల్-లైట్లను కాంటినెంటల్ GT లాగా యానిమేటెడ్ LED లతో కలిగి ఉంది. రెండు చివర్లలోని బంపర్లు పునరుద్ధరించబడ్డాయి, కావున ఇది మరింత దూకుడుగా ఉంటుంది. Bentayga SUV యొక్క మొత్తం సిల్హౌట్ సైడ్ ప్రొఫైల్‌లో కూడా ఎక్కువ మార్పులను పొందుతుంది. ఇది 22 ఇంచెస్ వీల్ డిజైన్‌ను పొందుతుంది.

కర్ణాటకలో రూ. 6.5 కోట్ల ఫస్ట్ Bentley Bentayga కొనుగోలు చేసిన వ్యక్తి.. ఇతడే

Bentley Bentayga యొక్క ఇంటీరియర్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇందులో వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో 5.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ టాబ్లెట్‌ను కలిగి ఉంది. క్యాబిన్ ముందు భాగంలో అప్‌డేట్ చేయబడిన హై-రిజల్యూషన్ 10.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంది.

అంతే కాకుండా, ఇందులో యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ టెక్నాలజీ ఉన్నాయి, ఇందులో డిజిటల్ ఇన్‌స్టెన్స్ క్లస్టర్ ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో యుఎస్‌బి-సి పోర్ట్‌లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే మరియు 12-స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటివి కూడా ఉన్నాయి.

కర్ణాటకలో రూ. 6.5 కోట్ల ఫస్ట్ Bentley Bentayga కొనుగోలు చేసిన వ్యక్తి.. ఇతడే

2021 Bentley Bentayga ఎస్‌యూవీ 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ వి8 ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 542 బిహెచ్‌పి పవర్ మరియు 770 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6.0-లీటర్ డబ్ల్యూ 12 మోటార్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది ఇంజిన్ 600 బిహెచ్‌పి పవర్ మరియు 900 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇది నాలుగు చక్రాలకు శక్తిని పంపుతుంది మరియు ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్‌లను కూడా కలిగి ఉంటుంది.

కర్ణాటకలో రూ. 6.5 కోట్ల ఫస్ట్ Bentley Bentayga కొనుగోలు చేసిన వ్యక్తి.. ఇతడే

బెంట్లీ బెంటైగా భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. అంబానీ కుటుంబంతో సహా చాలా మంది ప్రముఖులు ఈ లగ్జరీ కారును కలిగి ఉన్నారు. అంబానీ ఫ్యామిలీ ఇప్పటికే మూడు బెంటైగా కార్ల ను కలిగి ఉంది. 2021 Bentley Bentayga భారతీయ మార్కెట్లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, లంబోర్గిని ఉరస్ మరియు రోల్స్ రాయిస్ కల్లినన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Bentley bentayga bought karnataka builder rohan monteiro details
Story first published: Monday, September 27, 2021, 9:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X